DRIVER MAKES DARING U TURN ON CLIFF EDGE IN VIRAL VIDEO BUT DID HE REALLY GH VB
Viral Video: కొండ అంచున కారు.. యూ-టర్న్ కు ప్రయత్నించిన డ్రైవర్.. తర్వాత ఏమవుతుందో ఊహించేలోపే ఇలా..
కారును యూటర్న్ చేస్తున్న డ్రైవర్
వీడియోలో బ్లూ కలర్ కారు మొదట ఇరుకైన రహదారిపై ఎత్తుపైకి వెళ్లి, ధైర్యంగా యూటర్న్ చేసే ప్రయత్నంలో వెనుకకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడుతుందనే భయం మనలో కలుగుతుంది. చివరకు ఏం జరిగిందో తెలుసా..
సోషల్ మీడియా(Social Media) పుణ్యామాని ప్రపంచ నలుమూల జరిగే వింతలు విశేషాలు మన కళ్ల ముందుంటున్నాయి. కొన్ని వీడియోలు చేస్తే.. అసలు నిజంగానే ఇలా జరిగిందా? లేక ఇది కల్పితమా? అనే అనుమానం కూడా కలుగుతుంది. అటువంటి, వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఓ ఎత్తైన కొండపై డ్రైవర్(Driver) చేసిన ఫీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. కొండ అంచున ఓ కారును యూ టర్న్ తీశాడో డ్రైవర్. ఆ వీడియో చూస్తుంటే క్షణ క్షణం ఏమవుతుందనే టెన్షన్(Tension) మనలో కలుగుతుంది. కేవలం నిమిషం నిడివి గల ఈ వీడియో(Video) నరాలు తెగిపోయే ఉత్కంఠతో సాగుతుంది. ఓ ఎత్తైన కొండ అంచుకు కేవలం అంగుళాల దూరంలో కారును డ్రైవర్ సాహసోపేతంగా యూ-టర్న్ చేయడాన్ని వీడియోలో మనం గమనించవచ్చు. వైరల్ క్లిప్‌ను మొదట ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశారు. దానికి “ది పర్ఫెక్ట్ 80 పాయింట్!” అని క్యాప్షన్ ఇచ్చారు.
వీడియోలో బ్లూ కలర్ కారు మొదట ఇరుకైన రహదారిపై ఎత్తుపైకి వెళ్లి, ధైర్యంగా యూటర్న్ చేసే ప్రయత్నంలో వెనుకకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడుతుందనే భయం మనలో కలుగుతుంది. కానీ, డ్రైవర్ ఏ మాత్రం భయపడకుండా స్టీరింగ్ తిప్పుతూ కారును దాదాపు రోడ్డు అంచుకు తీసుకువస్తాడు. తన విశేషమైన డ్రైవింగ్ నైపుణ్యంతో కారును విజయవంతంగా యూటర్న్ చేస్తాడు. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్టర్లో మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది. ఈ థ్రిల్లింగ్ వీడియోను దాదాపు 30,000 మంది లైక్ చేశారు. డ్రైవర్ అసాధారణమైన నైపుణ్యాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు.. ‘‘వావ్, సూపర్ డ్రైవింగ్’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు డ్రైవరన్న టాలెంట్‌కు సలాం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే, ఈ వీడియోను డ్రైవింగ్ స్కిల్ అనే యూట్యూబ్ ఛానెల్ గతేడాది డిసెంబర్లో మొదటిసారి షేర్ చేసింది. కారు నడిపే వ్యక్తి.. ఇరుకైన రహదారిపై యూజర్న్లు ఎలా చేయాలో ప్రదర్శించే నిపుణుడిగా పేర్కొంది. అయితే, ఇప్పుడు మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాక నెటిజన్లను ఆకర్శిస్తోంది.
Going for this must be a more Brave Thought than the Skill to do this 👍https://t.co/giWq4WbeE1
అయితే, ఇదే యూట్యూబ్ ఛానెల్ మరొక క్లిప్‌ను అప్లోడ్ చేసింది. కానీ, వీడియోను వేరే కోణం నుండి చిత్రీకరించింది. డ్రైవర్ వాస్తవానికి కొండ అంచున స్టీరింగ్ చేయలేదని, దాని కింద సమాంతరంగా మరొక రహదారి ఉందని ఈ వీడియోను బట్టి తెలుస్తోంది. దీంతో, డ్రైవర్ నిజంగానే కొండ అంచున కారును యూటర్న్ చేశాడా? లేక ఇది ఫేక్ వీడియోనా? అనే విషయంపై నెటిజన్లలో అయోమయం నెలకొంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.