Accident: ఇది లగ్జరీ యాక్సిడెంట్.. మీరూ ఓ లుక్కేయండి

Accident: అలాంటి రెండు పెద్ద పెద్ద హై-ఎండ్ లగ్జరీ కార్లు రోడ్డు మధ్యలో ఢీకొట్టుకుని యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో ఊహించారా? ఇలాంటి ప్రమాదమే అక్టోబరు 12న  బ్రిటన్‌లో జరిగింది.

news18-telugu
Updated: October 16, 2020, 3:17 PM IST
Accident: ఇది లగ్జరీ యాక్సిడెంట్.. మీరూ ఓ లుక్కేయండి
Photo: twitter
  • Share this:
రోడ్లపై ప్రీమియం బ్రాండ్‌ల లగ్జరీ కార్లు కనిపిస్తేనే మనం విచిత్రంగా చూస్తాం. దాని గురించి చర్చించుకుంటాం. అలాంటి రెండు పెద్ద పెద్ద హై-ఎండ్ లగ్జరీ కార్లు రోడ్డు మధ్యలో ఢీకొట్టుకుని యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుందో ఊహించారా? ఇలాంటి ప్రమాదమే అక్టోబరు 12న  బ్రిటన్‌లో జరిగింది. బర్మింగ్‌హామ్ సమీపంలోని వాల్సాల్‌లో జరిగిన ఈ ఖరీదైన కారు ప్రమాదంలో లంబోర్గిని ఉరుస్ లగ్జరీ కారును వెనుక నుంచి ఒక రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు డ్రైవరే ప్రమాదానికి కారణమని వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఇది చాలా ఖరీదైన క్రాష్ అని వెస్ట్ మిడ్లాండ్స్ పోలీస్ ఫోర్స్ రెస్పాన్స్ టీమ్ ట్వీట్ చేసింది. తనకంటే పెద్ద కారును చూసి తట్టుకోలేకనే రోల్స్ రాయిస్ నడిపే వ్యక్తి లంబోర్గిని కారును ఢీకొట్టాడేమోనని పోలీసు శాఖ ట్వీట్లో చమత్కరించింది. డ్రైవర్లకు ఇలాంటి కార్లపై పూర్తిగా అవగాహన లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

ఫొటో కారులో పెట్టి పరారయ్యాడు

ప్రమాదానికి కారణమైన రోల్స్ రాయిస్ యజమానిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. కానీ స్థానికంగా లగ్జరీ కార్లను అద్దెకు ఇచ్చే ఏజెన్సీల నుంచి ఎవరో దీన్ని తీసుకొచ్చి ఉంటారని అక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం తరువాత రోల్స్ రాయిస్ ఘోస్ట్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ కారులో తన ఫొటోను వదిలేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.



లంబోర్గినికి తీవ్ర నష్టం
ఘోస్ట్ కారును నుడుపుతున్న వ్యక్తి ఏకంగా రెండు కార్లను ఢీకొట్టాడు. వాటిలో ఒకటి ఈ లంబోర్గిని ఉరుస్. ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే, లంబోర్గిని తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. దాని ఎడమ వైపు హుడ్, గ్రిల్‌ విరిగిపోయాయి. మరో కారు ప్రభావం వల్ల ఫెండర్‌లకు కూడా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఘోస్ట్ కారులోని అన్ని ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. వాటిని రీప్లేస్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. దెబ్బతిన్న ఘోస్ట్, ఉరుస్ కార్ల భాగాలు, రిపేర్లు అన్నీ కలుపుకుంటే, ఈ క్రాష్ వల్ల రెండు కార్లకు కలిపి రెండున్నర లక్షల డాలర్ల వరకు భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది.
Published by: Nikhil Kumar S
First published: October 16, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading