హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral video: వామ్మో.. స్టోర్ లోకి రయ్.. అంటూ దూసుకెళ్లిన కారు.. అసలేం జరిగిందంటే..

Viral video: వామ్మో.. స్టోర్ లోకి రయ్.. అంటూ దూసుకెళ్లిన కారు.. అసలేం జరిగిందంటే..

స్టోర్ లోకి దూసుకెళ్లిన కారు

స్టోర్ లోకి దూసుకెళ్లిన కారు

America: స్టోర్ ముందు కారును పార్కింగ్ చేయడానికి వెళ్లాడు. కారు పార్క్ చేశాడు. ఇంతలో ఒక పొరపాటు చేశాడు. వెంటనే క్షణాల్లోనే ఊహించని ఘటన జరిగిపోయింది.

మనం ఏదైన వెహికిల్ ను  (Vehicle) నడిపేటప్పుడు చాలా అలెర్ట్ గా డ్రైవ్  చేయాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న క్షణాల్లోనే పరిస్థితులు తల కిందులై పోతుంటాయి. ఇంకా టూవీలర్, కారు నడిపేవారు రోడ్డు పైన చాలా జాగ్రత్తగా, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తు వాహనాలను నడపాలి. మనం తరచుగా రోడ్డుపైన వెళ్తున్నప్పుడు టూవీలర్ వెహికిల్స్ , కారు ప్రమాదాలు జరగటం చూస్తు ఉంటాం. కొంత మంది వాహనాలు సరిగ్గా నడపటం రాకున్న.. రోడ్డుపైకి వాహనాలు తీసుకొని వస్తుంటారు. దీంతో వారు.. తమ వెహికిల్ ను సరిగ్గా కంట్రోల్ చేయలేక పోతారు.

ఈ  క్రమంలో రోడ్డు ప్రమాదాలు (Road accidents) జరుగుతుంటాయి. కొన్ని సార్లు వాహానాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. మరికొన్ని సార్లు వెహికిల్ నడిపేవారు, రోడ్డుపైన నడిచే పాదచారులు తమ ప్రాణాలు సైతం కోల్పోతారు. ఇలాంటి ఎన్నో ఘటనలు తరచుగా వార్తలలో నిలుస్తుంటాయి. తాజాగా, ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. అమెరికాలోని (United states) ఒక షాపింగ్ స్టోర్ లోకి కారు వేగంగా దూసుకెళ్లింది. యూఎస్ లోని టెంపెలో ఈ ప్రమాదం జరిగింది. గత గురువారం ఈ ప్రమాదం (Crashes) జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా  (Social media) మారింది. కాగా, అధికారుల ప్రకారం.. ఒక వ్యక్తి టెంపెలో ఉన్న స్టోర్ లో షాపింగ్  (Shopping) చేయడానికి వచ్చాడు. అప్పుడు కారును స్టోర్ ముందు పార్కింగ్ చేయడానికి వెళ్లాడు. ఇంతలో డ్రైవర్..  బ్రేక్ కు బదులుగా, ఎక్స్ లేటర్ నొక్కాడు.

అంతే.. కారు వేగంగా స్టోర్ లోకి దూసుకెళ్లింది. అప్పుడు షాపులు ఉన్న ఇద్దరు సెల్స్ బాయ్స్ ను (Two Employees) తొక్కుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. దీంతో అక్కడి వారు భయంతో దూరంగా పరుగులు పెట్టారు. ఆ తర్వాత.. తేరుకుని కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. స్టోర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా (viral video) మారింది.

First published:

Tags: Road accident, United states, Viral Video

ఉత్తమ కథలు