Home /News /trending /

DREAM 11 RS 2 CRORE WIN MAKES KASHMIRI MAN MILLIONAIRE OVERNIGHT PVN

Dream11 : అదృష్టం అంటే నీదేనయ్యా..నిద్ర మధ్యలో లేచి ఫోన్ చూస్తే అకౌంట్ లో రూ.2 కోట్లు

డ్రీమ్ 11లో 2 కోట్లు గెల్చుకున్న వసీం రాజా

డ్రీమ్ 11లో 2 కోట్లు గెల్చుకున్న వసీం రాజా

Man Win 2 Crores In Dream 11 : ఆన్‌లైన్ క్రికెట్ గేమ్ అయిన డ్రీమ్ 11 గురించి ఎవరికి తెలియదు చెప్పండి. డ్రీమ్ 11 గురించి క్రికెట్ ప్రేమికులకే కాదు, చాలా మంది ఇతరులకు కూడా తెలుసు. అంతలా ఈ ఆన్‌లైన్ క్రికెట్ గేమ్ యాప్ చాలా ప్రజాదరణ పొందింది.

ఇంకా చదవండి ...
Kashmiri Man Win 2 Crores In Dream 11 : ఆన్‌లైన్ క్రికెట్ గేమ్ అయిన డ్రీమ్ 11 గురించి ఎవరికి తెలియదు చెప్పండి. డ్రీమ్ 11 గురించి క్రికెట్ ప్రేమికులకే కాదు, చాలా మంది ఇతరులకు కూడా తెలుసు. అంతలా ఈ ఆన్‌లైన్ క్రికెట్ గేమ్ యాప్ చాలా ప్రజాదరణ పొందింది. జమ్ముకశ్మీర్​కు చెందిన ఓ యువకుడు డ్రీమ్ 11 గేమ్‌లో పాల్గొని మిలియనీర్ అయ్యాడు అతను తన మొబైల్ ఆన్‌లైన్ క్రికెట్ గేమ్ యాప్ డ్రీమ్ 11లో తన IPL జట్టును సృష్టించాడు. అతను ఏర్పాటు చేసిన జట్టు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీంతో రాత్రికి రాత్రే రెండు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు

దక్షిణ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని షల్గామ్ గ్రామానికి చెందిన వసీం రాజా గత రెండేళ్లుగా డ్రీమ్​11 లో క్రికెట్​, హాకీ, ఫుట్​బాల్​, కబడ్డీ, బాస్కెట్​బాల్​ క్రీడల్లో బెట్టింగ్​ వేస్తున్నాడు. . ఎప్పటిలాగే బెట్టింగ్​ వేయగా అదృష్టం వరించి 2 కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్​ కావడం వల్ల నెటిజన్లు కూడా వసీం రాజాకి శుభాకాంక్షలు చెబుతున్నారు. అదృష్టం అంటే నీదేనయ్యా..మాకు ఎప్పుడు ఈ అదృష్టం తగుల్తదో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ALSO READ  Viral Video : దళితుడి నోట్లోని ఆహారాన్ని తీసి తిన్న ఎమ్మెల్యే

ఈ సందర్భంగా వసీం రాజా మాట్లాడుతూ..."శనివారం రాత్రి నిద్రలో ఉండగా నా ఫ్రెండ్స్ కొందరు ఫోన్ చేశాడు. నేను డ్రీమ్​11లో పెట్టిన జట్టు మొదటి స్థానంలో ఉందని చెప్పారు. దీంతో నేను లేచి చూడగా రెండు కోట్లు గెలుచుకున్నట్లు ఉంది. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో ఫాంటసీ టీమ్‌లను సృష్టించి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని అవ్వడం నిజంగా ఓ కలగా అనిపిస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన మా కుటుంబం పేదరికాన్ని అధిగమించేందుకు ఇది దోహదపడుతుంది. మా అమ్మ అనారోగ్యంతో ఉంది. ఇప్పుడు ఈ డబ్బులతో నేను ఆమెకు ట్రీట్మెంట్ చేయించగలను"అని తెలిపాడు. వసీంరాజాకు స్థానికులు అభినందనలు తెలుపుతున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALSO READ  Bharat Bandh : బిగ్ అలర్ట్..ఈ నెల 25న భారత్ బంద్!

కాగా, గతంలోనూ కొందరు డ్రీమ్​11లో బెట్టింగ్​ పెట్టి కోట్లు గెలుచుకున్నారు. గత నెలలో బీహార్‌లోని సరన్ జిల్లా రసూల్‌పూర్‌ గ్రామానికి చెందిన రమేష్ కుమాక్ అనే డ్రైవర్ డ్రీమ్ 11 గేమ్‌లో పాల్గొని మిలియనీర్ అయ్యాడు. రమేష్ కుమార్ పశ్చిమ బెంగాల్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి పేద కూలీ. ఇంట్లో పేదరికం ఉండేది. దీంతో అతడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చాలా సార్లు డ్రీమ్ 11 గేమ్‌లో ఓడిపోయాడు. అయినా పట్టు వదలకుండా గేమ్ ఆడాడు. 49 రపాయల ఖర్చుతో డ్రీమ్ 11లో ఐపీఎల్ టీమ్ సృష్టించి 2 కోట్ల రూపాయలుగెల్చుకున్నాడు.

Dream11 అనేది.. ఫాంటసీ క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ మరియు బాస్కెట్‌బాల్ ఆడేందుకు వినియోగదారులను అనుమతించే భారతీయ ఫాంటసీ క్రీడా వేదిక. ఏప్రిల్ 2019లో, డ్రీమ్ 11 యునికార్న్‌గా మారిన మొదటి భారతీయ గేమింగ్ కంపెనీగా అవతరించింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Dream 11, Jammu and Kashmir

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు