కొందరు తల్లిదండ్రులు డబ్బుల కోసం ఎంతకైన దిగజారుతున్నారు. తమ కొడుకును లేదా కూతురును బజారులో ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారు. కట్న, కానుకల (Dowry Harassment) పేరుతో ఎదుటివారిని వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు వరకట్న వేధింపులను నిరోధించడానికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఇలాంటి వారు మారడం లేదు. ఈ కోవకు చెందిన ఒక ఘటన ప్రస్తుతం ఢిల్లీ (Delhi)లో జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు.. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చక్కగా చదివిస్తున్నారు. ఆ తర్వాత వారికి ఒక మంచి కుటుంబంతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. తమ పిల్లలు ఆ కుటుంబంలో సంతోషంగా ఉండాలను కుంటారు. ఈ తరుణంలో కట్నకానుకల విషయంలోనూ ఏమాత్రం వెనుకాడటం లేదు. అయితే, ఒక్కొసారి ఎదుటివారు వీరి బలహీనతలను ఆసరాగా చేసుకొని కొందరు , అధిక లాంఛనాలను డిమాండ్ చేస్తున్నారు. కట్నం పేరుతో వేధిస్తున్నారు.
ప్రస్తుతం ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు మనం వార్తలలో వస్తున్నాయి. ప్రస్తుతం ఇలాంటి సంఘటన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉత్తమ్‌నగర్ కు చెందిన రాబిన్ అనే వ్యక్తికి, అదే ప్రాంతంలో ఉండే గరిమా అనే యువతితో పెళ్లి (Marriage) నిశ్చయమైంది. మొదట వరుడి తరుపు వారు.. అమ్మాయి మాకు నచ్చిందని ఎలాంటి లాంఛనాలు అవసరంలేదని తెలిపారు.
దీంతో వధువు (Bride) బంధువులు పొంగిపోయారు. వారు తమ కూతురుకి కొన్ని కట్నకానుకలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అంతగా కావాల్సివస్తే ఒక రూపాయి కట్నం కింద చాలని.. వరుడి వారు కోరారు. ఆ తర్వాత.. వధువు వారు తమ కూతురుకి కొన్ని లాంఛనాలు (Dowry) ఇస్తామని ఒప్పుకున్నారు.
ఈ తరుణంలో.. ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. వీరి పెళ్లి ఫిబ్రవరి 18 న జరగాల్సి ఉంది. అయితే, ఈ క్రమంలో వరుడి (Groom) తరుపు వారి బుద్ధి మారింది. వారు ప్రతి రోజు ఏదో ఒక కొత్త వస్తువులను కట్నం కింద కావాలని వేధించడం (Dowry Harassment) మొదలుపెట్టారు. ఇది బంగారం, నగలు డిమాండ్ చేయడం వరకు వెళ్లింది.
పాపం.. వధువు వారు కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కానుకలను ఇస్తునే ఉన్నారు. ఈ క్రమంలో వధువు ఇంట్లో ఫిబ్రవరి 16న హల్దీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా వరుడి తరుపు వారు తమకు ఒక కారును కావాలని డిమాండ్ చేశారు.
అది కూడా క్రెటా కావాలని(Creta Car Demands) పంతంపట్టారు. దీంతో విసిగి పోయిన వధువు తరుపువారు.. పెళ్లి కొడుకు, వరుడి తండ్రి, మామయ్యలపై కేసులను నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎవరిని అదుపులోనికి తీసుకొలేదు. పెళ్లి (Marriage) కొడుకు వారు కేసు నమోదు చేసినందుకు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని.. వధువు వారు ఆరోపిస్తున్నారు. దీనిపై వరుడి (Groom) తరపు వారు వధువుపై అనేక ఆరోపణలు చేశారు. వారిపై పలు కేసులను పెట్టారు. ప్రస్తుతం కేసులను నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Dowry harassment, Wedding