DOUBTS FOR GIRLS ON SEX RELATED TOPICS ON THE INTERNET SNR
OMG:రాత్రి వేళల్లో అమ్మాయిలు ఎక్కువగా చేసే పని అదే..అందుకే దాన్ని బాగా వాడుతున్నారంట
(ప్రతీకాత్మకచిత్రం)
OMG: అమ్మాయిలు శృంగారానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్నెట్ వాడుతున్న అమ్మాయిల్లో గూగుల్‌లో సెర్చ్ ఇంజన్లో నూటికి 17శాతం మంది శృంగారానికి సంబంధించిన అంశాల కోసం వెదుకుతున్నట్లుగా ఓ సర్వేలో తేలింది.
ప్రెజంట్ జనరేషన్లో అమ్మాయిలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు అనే టాక్ ఉంది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా(Soial media), ఇంటర్నెట్(Internet) వాడకం, గూగుల్(Google) పరిజ్ఞానంలో టీనేజ్ అమ్మాయిలు చూపిస్తున్న ఇంట్రెస్ట్ అంతా ఇంతా కాదు. అసలు అమ్మాయిలు ఇంటర్నెట్‌ని ఎందుకోసం అంతగా వాడుతున్నారనే సందేహం చాలా మందికి ఉంది. అలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికే ఓ సర్వే జరిగింది. అందులో షాక్ అయ్యే నిజాలు బయటపకొచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే గూగుల్‌లో స్టడీ(Study), హెల్త్ టిప్స్(Health tips), అడ్రస్ సెర్చింగ్(Career), సబ్జెక్ట్ ఓరియంటెడ్ డౌట్స్‌తో పాటు శృంగారానికి(Sex related) సంబంధించిన అంశాలపై అమ్మాయిలు విచ్చలవిడిగా వెదుకుతున్నారు. శృంగారం విషయంలో అమ్మాయిలు తమకున్న సందేహాలను నైట్‌టైమ్(Night time)లో గూగుల్ సెర్చ్ ఇంజన్లో నివృత్తి చేసుకుంటున్నారు తెలుసా. స్మార్ట్ ఫోన్స్ వాడకం, ఫోన్లో డేటా, నైట్ టైమ్‌లో చాటింగ్, ఇంటర్నెట్ వాడకంలో అబ్బాయిలతో పోలిస్తే ఎక్కువగా అమ్మాయిలే వాడుతున్నట్లుగా తేలింది. నూటికి 17శాతం (17 Percent)మంది అమ్మాయిలు శృంగారం విషయంలో ఉన్న డౌట్స్, వాటిని ఎలా పరిష్కరించుకోవాలన్న దానిపైనే గూగుల్ సెర్చ్ ఇంజన్లో వెదుకుతున్నట్లుగా సర్వేలో తేలింది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఇంటర్నెట్ వాడకంలో సుమారు 2కోట్లకుపైగా మహిళలు చాలా యాక్టివ్‌గా ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. దేశంలో మొత్తం 150కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అందులో రెండు కోట్ల మంది ఎక్కువ సమయం ఆన్లైన్లోనే గడుపుతున్నట్లుగా తేలింది. అందులో కూడా 75శాతం మంది 15-34 సంవత్సరాల మధ్య వయసున్న అమ్మాయిలు, మహిళలే ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.
లేడిస్‌కి సీక్రెట్ ఫ్రెండ్‌గా మారిన గూగుల్..
ఇంటర్నెట్‌ని విచ్చలవిడిగా వాడుతున్న రెండు కోట్ల మంది మహిళల్లో 31శాతం టీనేజ్ గర్ల్స్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఏం చేయాలన్న దానిపై గూగుల్‌ని ఆశ్రయిస్తున్నారు. మిగిలిన 17శాతం మంది శృంగారం, డిప్రెషన్, డ్రగ్స్ వల్ల ఉపయోగం వంటి వాటి గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా సర్వేలో బయటపడింది. టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత..ఎవరూ ఇతరులపై ఆధారపడటం లేదు. తెలియని విషయాల్ని పక్కన ఉన్నవాళ్లను, బంధువుల్ని, స్నేహితుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే చేతిలో స్మార్ట్ ఫోన్...అందులో ఇంటర్నెట్ డేటా పుష్కలంగా ఉండటంతో గూగుల్ బ్రౌజ్ చేస్తున్నారు. తమకు కావాల్సిన సమాచారం, డౌట్ ఉన్న విషయాలను విస్తృతంగా శోధిస్తున్నారు.
ఎవర్ని అడగకూడని విషయాలు..
పగలు, ఆఫీసులు, కాలేజీల్లో చూస్తే ఇతరులకు తెలిసిపోతుందన్న బిడియంతో రాత్రి వేళల్లో నిద్రపోయే సమయంలోనే ఈతరహా డౌట్స్ కోసం గూగుల్‌పై పడుతున్నారని సర్వే కుండబద్దలు కొట్టింది. ఇక మెయిన్‌గా అమ్మాయిలు, మహిళలు ఐదు విషయాలపై గూగుల్‌ని యూజ్ చేస్తున్నారు. అందులో మెయిన్‌గా కెరియర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లైఫ్‌లో బిందాస్‌గా ఎలా సెటిలవ్వాలనే టాపిక్‌పైనే సెర్చ్ చేస్తున్నారు. సెకండ్ టాపిక్ వచ్చే సరికి హెల్త్ టిప్స్, గ్లామర్‌గా కనిపించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. ఇక మూడో ప్లేస్ మాత్రం హెయిర్ స్టైల్‌పైనే ఫోకస్ చేస్తున్నారు. జుట్టు ఊడకుండా ఏం చేయాలి ? జుట్టుని ఎలా కట్ చేసుకుంటే స్టైల్‌గా ఉంటుంది అనే విషయాలపై డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు. నాలుగో మెయిన్ టాపిక్ వచ్చే సరికి పేరెంట్స్‌కు చెప్పుకోలేనటువంటి సీక్రెట్స్, లవ్, బాయ్‌ఫ్రెండ్స్, మరికొన్ని పర్సనల్ ఇష్యూలపై కూడా సెకండ్ ఒపినియన్గా గూగుల్ సెర్చ్ ఇంజన్‌నే వాడుకుంటున్నారని రీసెర్చ్‌లో తేలింది. ఐదు సబ్జెక్ట్ విషయానికి వస్తే ఫేస్‌పై పింపుల్స్, పీరియడ్స్, బాడీ షేప్స్, ఫ్యాషన్ టిప్స్‌ని టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు గూగుల్‌ని బెస్ట్ ఫ్రెండ్‌గా ఫీలవుతున్నారని ఓ సంస్థ తమ సర్వేలో తేటతెల్లమైంది.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.