Video: ఒక్క ఆలూ చిప్స్ ముక్కకు రూ.14 లక్షలు ఇచ్చిన కంపెనీ.. ఎందుకంటే.!

ఒక్క ఆలూ చిప్స్ ముక్కకు రూ.14 లక్షలు (image credit - twitter)

Viral Video: అందరూ ఆశ్చర్యపోయే ఘటన ఇది. అసలు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించరు కూడా. ఆలూ చిప్స్ ముక్కకు ఆ కంపెనీ రూ.14 లక్షలు ఎందుకు ఇచ్చింది? ఆ బాలిక జీవితాన్ని మార్చిన ఘటన ఇది.

  • Share this:
    ఇదో అద్భుతమైన చందమామ కథ. నిజంగానే జరిగింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక రైలీ స్టువార్ట్ (Rylee Stuart). ఆమెకు బంగాళాదుంప చిప్స్ తినడం అంటే ఇష్టం. అందులోనూ అత్యంత క్వాలిటీ, కాస్ట్‌లీ బ్రాండ్ అయిన డోరిటోస్ (Doritos) ఆలూ చిప్స్ అంటే ఎంతో ఇష్టంగా కరకరలాడిస్తుంది. అలాంటి ఆ బాలికకు... ఈమధ్య చిప్స్ ప్యాకెట్‌లో చిత్రమైన చిప్స్ ముక్క కనిపించింది. అది మిగతా చిప్స్ ముక్కలలా కాకుండా... సమోసాలాగా ఉబ్బినట్లు ఉంది. అది చూసిన ఆ పిల్ల... దాన్ని మిగతా చిప్స్ లాగే తినేద్దామని అనుకుంటూ ఉండగా... చివరి క్షణంలో మనసు మారింది. అరుదైనది కావడంతో... దాచుకోవాలి అనిపించింది. ఆ చిప్స్ ముక్కను వీడియో తీసి... టిక్‌టాక్‌లో ఉబ్బిన స్నాక్ (puffed-up snack) పేరుతో అప్‌లోడ్ చేసింది.

    నెటిజన్లు బాగా స్పందించారు. ఆ వీడియో క్రమంగా ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది. దాంతో... చాలా మంది రకరకాల కామెంట్లు పెట్టారు. నెటిజన్లలో చాలా మంది ఆ చిప్ కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తుంటే... ఆ చిన్నారికి కొత్త ఆలోచన వచ్చింది. దాన్ని ఈ-కామర్స్ సంస్థ వెబ్‌సైట్ ఈబేలో అమ్మాలని డిసైడైంది. చిప్ ముక్కను ఫొటోలు తీసి... దాని ధరను డాలర్ కంటే తక్కువగా కోట్ చేసింది.

    ఆ చిప్ ముక్కకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది భారీగా డబ్బులిచ్చి కొనేందుకు ముందుకొచ్చారు. ఇలా వేలం కొనసాగుతూ ఉండగా... డోరిటోస్ కంపెనీకి ఈ విషయం తెలిసింది. ఆశ్చర్యపోయిన కంపెనీ... బిడ్డింగ్‌లో పాల్గొని అందరికంటే చాలా ఎక్కువగా $20,100 ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అంటే మన రూపాయిల్లో రూ.14,89,540 అన్నమాట. దాంతో బాలిక ఫ్యామిలీ ఎగిరిగంతేసింది. ఆనందడోలికల్లో మునిగితేలింది.


    ఎందుకు అంత ధర:
    ఒక చిన్న ఆలూ చిప్స్ ముక్కను రూ.14 లక్షలు పెట్టి కొనేందుకు డోరిటోస్ ముందుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై కంపెనీ వివరణ ఇచ్చింది. "మరెవరైనా అయితే... ఆ చిప్స్ ముక్కను నోట్లో పెట్టుకొని తినేవారేమో... ఆ బాలిక క్రియేటివ్‌గా ఆలోచించింది. దాన్ని కూడా వ్యాపార కోణంలో చూసింది. దానితో బిజినెస్ చేసింది. ఆమె ధైర్యం మాకు నచ్చింది. ఆమెలో ఓ వ్యాపారవేత్తను మేం చూశాం. పైగా ఆ ఫ్యామిలీ మా చిప్స్‌కి అభిమానులు. అందుకే ఇలా చేశాం" అని తెలిపింది.

    ఇది కూడా చదవండి: Sand Dollars: అమెరికా సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సాండ్ డాలర్స్.. అసలు ఏంటివి?

    "ఆ చిప్స్ ప్యాకెట్ నా డబ్బులతో కొన్నాను. కాబట్టి ఆ రూ.14 లక్షలు నావే అని డాడీ అన్నారు. కానీ ఆ చిప్స్ ప్యాకెట్ తిన్నది నేను. అందులో చిప్ కనిపెట్టింది నేను. కాబట్టి ఆ డబ్బు నాదే" అని నవ్వేసింది రైలీ. బాగుంది కదా చందమామ రియల్ కథ.
    Published by:Krishna Kumar N
    First published: