దూరదర్శన్ ట్యూన్‌కు స్టెప్పులేసిన యువకుడు... టిక్ టాక్ వీడియో వైరల్

1990కు సంబంధించిన దూరదర్శన్ ట్యూన్ మీకు గుర్తుందా ? అదేనండి వార్తలు వచ్చే ముందు వస్తుంది కదా ... ఆ ట్యూన్. ఇప్పుడా మ్యూజిక్‌కు సంబంధించిన ట్యూన్‌కు స్టెప్పులేశాడు యువకుడు.

news18-telugu
Updated: March 7, 2019, 4:02 PM IST
దూరదర్శన్ ట్యూన్‌కు స్టెప్పులేసిన యువకుడు... టిక్ టాక్ వీడియో వైరల్
దూరదర్శన్ ట్యూన్‌కు యువకుడి టిక్ టాక్ వీడియో
  • Share this:
టిక్ టాక్ యాప్ ఈమధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో డబ్‌స్మాష్‌ కూడా ఈ తరహా యాప్ అయినప్పటికీ టిక్ టాక్ వచ్చిన తర్వాత యువత దీనికి బాగా అలవాటుపడ్డారు. తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో టిక్ టాక్ యాప్ ద్వారా ఓ యువకుడు పెట్టిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలుసా.. ఎప్పుడో 1990కు సంబంధించిన దూరదర్శన్ ట్యూన్ మీకు గుర్తుందా ? అదేనండి వార్తలు వచ్చే ముందు వస్తుంది కదా ... ఆ ట్యూన్. ఇప్పుడా మ్యూజిక్‌కు సంబంధించిన ట్యూన్‌కు స్టెప్పులేశాడు యువకుడు. దీంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వైశాఖ నాయర్ దూరదర్శన్ ట్యూన్‌కు టిక్ టాక్ చేసి ... ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీంతో ఇప్పుడీ వీడియో సోషల్ వెబ్‌సైట్లలో హల్ చల్ చేసింది. ఇప్పటివరకు రెండు లక్షల మంది ఈ వీడియోను చూశారు. 5వేల మంది ఈ వీడియోను తమ ట్విట్టర్ ఎకౌంట్లలో షేర్ చేశారు. దూరదర్శన్‌కు చెందిన అఫిషియల్ ట్విట్టర్ ఎకౌంట్‌లో కూా నాయర్ డాన్స్‌ వీడియోను షేర్ చేసి లైక్ కొట్టారు.First published: March 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు