Video: అద్భుతం. రైల్లోకి దూద్‌సాగర్ జలపాతం. చూసి తీరాల్సిందే!

Video: అద్భుతం. రైల్లోకి దూద్‌సాగర్ జలపాతం. (image credit - twitter)

Viral Video: మనం ఎంత బిజీగా ఉన్నా... కొన్ని కొన్ని వీడియో క్లిప్పులు చూసేయాలి. ఎందుకంటే అవి లైఫ్‌లో అరుదుగా వస్తాయి. అలాంటి ఓ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యింది. అది చూసేద్దాం.

  • Share this:
    Viral Video: మన దేశంలో జలపాతాలు చాలా ఉన్నా... దూద్‌సాగర్ జలపాతం (Doodhsagar Falls) చాలా మందికి ఇష్టం. ఎందుకంటే... ఆది 1017 అడుగుల నుంచి జాలువారుతూ ఉంటే... దాని పక్క నుంచే రైలు వెళ్తుంది. ఆ సమయంలో జలపాతం నుంచి నీటి బిందువులు... గాల్లో ఎగురుతూ... ప్రయాణికుల్ని టచ్ చేస్తాయి. ఆ చల్లదనం, ఆ నీటి స్పర్శ... ఒకరకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ థ్రిల్ పొందేందుకు ప్రయాణికులు అటుగా వెళ్తారు. అక్కడ రైలు కాసేపు ఆగుతుంది. గోవాలో ఈ వాటర్ ఫాల్స్ ఉంది. గోవాలో బీచ్‌లు, రిసార్టులు ఎలాగో... ఈ జలపాతం కూడా అలా ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది.

    తాజాగా దూద్ సాగర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గోవాలో జోరుగా వర్షం పడుతున్న సమయంలో... పెద్ద ఎత్తున ఈదురు గాలులు వచ్చాయి. ఆ సమయంలో... రైలు దూద్ సాగర్ వైపు వెళ్లింది. అప్పుడే దూద్ సాగర్ నుంచి నీరు గాల్లో ఎగురుతూ... రైలు మొత్తాన్నీ చుట్టేస్తూ ముందుకు సాగింది. రైలును ఆపేశారు. ఆ దృశ్యం వైరల్ అయ్యింది.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.


    ట్విట్టర్‌లో పోస్ట్ అయిన ఈ వీడియో ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వాళ్లంతా... "అబ్బబ్బబ్బా ఏం ఉంది... అదిరిపోయింది" అంటున్నారు. చాలా మంది లైక్స్, షేర్స్ చేస్తున్నారు. కొంత మంది నేను కచ్చితంగా అక్కడికి వెళ్తాను అంటున్నారు.

    బెంగళూరు, గోవా మధ్య ఉండే రైల్వే లైన్ ద్వారా రైలు వెళ్లేటప్పుడు ఈ దూద్ సాగర్ కనిపిస్తుంది. పేరుకు తగ్గట్టే ఇది చాలా తెల్లగా ఉంటుంది. అందుకే దీన్ని మిల్కీ సీ (పాల సముద్రం) అంటారు. కొంత మంది ప్రత్యేకించి జలపాతం దగ్గరకు వెళ్తారు. అలా వెళ్లినప్పుడు అది నీరో, మేఘమో అర్థం కావట్లేదని అంటారు. అంతలా ఆ ప్రాంతమంతా... ఎగిరే నీటి బిందువులతో చల్లగా ఉంటుంది. దానికి తోటు చుట్టూ ఉండే చెట్లు, ప్రకృతి... దానికి మరింత అందాన్ని తెచ్చాయి.

    ఇది కూడా చదవండి: Video: వంట వండుతోందా.. ఆ వంకతో అందాలు చూపిస్తోందా?

    ఈ జలపాతం భగవాన్ మహవీర్ శాంక్చురీలో భాగంగా ఉంది. ఇండియాలో ఎత్తైన జలపాతాల్లో ఇదీ ఒకటి. పైగా ఇది చాలా వెడల్పుగా కూడా ఉంటుంది. దీని వెడల్పు 98 అడుగులు.
    Published by:Krishna Kumar N
    First published: