హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అది తప్పే.. వక్షోజాల రూపు అలా ఉండదు.. నెట్టింట్లో ఫోటో వైరల్

అది తప్పే.. వక్షోజాల రూపు అలా ఉండదు.. నెట్టింట్లో ఫోటో వైరల్

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటో ఇదే..

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటో ఇదే..

    ‘పుష్పాల ఆకారంలో వక్షోజాలు.. పూవు రెక్కల్లా పాలు అందించే నాళాలు.. మిగతా శరీర భాగమంతా కండరాలు..’ ఇదీ మహిళల కండర వ్యవస్థ అంటూ ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. స్త్రీల కండర వ్యవస్థ గురించి బాహ్య ప్రపంచానికి అంతగా పరిచయం లేదు. దీంతో ఆ ఫోటోకు క్షణాల్లోనే లక్షలాది లైకులు, షేర్లు వచ్చాయి. ఎప్పుడూ చూడని ఫోటో చూసేసరికి నెటిజన్లలో ఆసక్తి రెట్టింపు అయ్యింది. ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోని వారు లేరు. అయితే, ఆ చిత్రంపై తాజాగా శాస్త్రవేత్తలు స్పష్టతనిచ్చారు. దాన్ని చూసి ఆందోళన చెందవద్దని, అసలు ఆ ఫోటో నిజమే కాదని తేల్చారు.


    నిజానికి, వక్షోజాల్లో పాలు అందించే నాళాలు ఫోటోలో చూపిన విధంగా ఉండవట. ఆ ఫోటోలో ఉన్నట్లు నాళాలు ఒక క్రమంలో ఉండవని శాస్త్రవేత్తలు స్పష్టతనిచ్చారు. ఆ ఫోటోను ఐప్యాడ్ యాప్ ‘అనాటమీ అండ్ ఫిజియాలజీ’కు సంబంధించినదని, అసలు.. ఆ చిత్రం మహిళల కండర వ్యవస్థకు సంబంధించినదే కాదని తేల్చారు.

    First published:

    Tags: Breastfeeding, Health, Health Tips, Women, Women health

    ఉత్తమ కథలు