మనం సాధారణంగా బయట మార్కెట్ కు వెళ్తుంటాం. అక్కడ ఇతరులను సరదాగా, అంకుల్ లేదా ఆంటీ అని పిలుస్తుంటాం. కొన్ని సార్లు.. తెలిసిన వారైతే.. మామ.. అల్లుడా.. అని అనేక పేర్లుతో ప్రేమగా పిలుస్తుంటాం. కొందరికి వయసులో ఎంత పెద్దవారైన వారికి, తాతయ్య లేదా అంకుల్ అని పిలుచుకొవడం అసలు ఇష్టం ఉండదు. వారు.. తాము ఇంకా యంగ్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు. కొంత మంది తమకు పేరు పెట్టే పిలవాలని అంటుంటారు. మరికొందరు.. మెయిన్ గా అమ్మాయిలు.. తమను అన్నయ్య, లేదా అంకుల్ అని పిలవడానికి అసలు ఒప్పు కోరు. అమ్మాయిలను లైన్ వేయడానికి ప్రయత్నింస్తుంటారు.
ఇలాంటి ఫన్నీ ఘటనలు మన చుట్టు జరుగుతునే ఉంటాయి. అయితే, ఇక్కడోక వింత ఘటన జరిగింది. ఒక తైవాన్ లోని కేఫ్ మహిళా యజమాని తనను ఆంటి అని పిలవోద్దని కస్టమర్ లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా స్పెషల్ బ్యానర్ లను కేఫ్ బయట ఏర్పాడు చేసింది. ప్రస్తుతం ఈ బ్యానర్ లు నెట్టింట వైరల్ గా మారాయి.
పూర్తి వివరాలు.. తైవాన్ ఒక కాఫీ షాప్ యజమాని వింతగా ప్రవర్తించింది. తనను కస్టమర్ లు ఆంటీ అని పిలవోద్దని హెచ్చరించింది. అంతే కాకుండా.. 18 ఏళ్లు పైబడిన టీనేజర్స్.. నన్ను అసలు ఆంటీ (Taiwan cafes shop anty banner) పిలవోద్దని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత.. కేఫ్ బయట బ్యానర్ లు కూడా ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం.. టాయో యువాన్ నగరంలోని ఝోంగ్లీ జిల్లాలో కేఫ్ బయట వెలసిన ఆ బ్యానర్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిలో టీనేజర్ కస్టమర్ లు తరచుగా ఆమెను ఆంటీ అని పిలుస్తుండటంతో ఆమె విసిగిపోయింది. ఆమె.. నేను... యంగ్ గా, స్మార్ట్ గా ఉంటాను.. అలాంటి తనను.. ఆంటీ అని పిలవడం ఏంటని కస్టమర్ ల మీద రుసరుస లాడింది. కాగా, బావోఫి కమ్యూన్ అనే ఫేస్ బుక్ గ్రూప్ లో ఈ బ్యానర్ లను.. పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా జూలో ఒక చింపాంజి సిగరేట్ తాగింది.
సౌత్ ఆసియన్ దేశంలోని వియత్నంలో ఈ ఘటన జరిగింది. హో చిమిన్ సిటీలోని సైగాన్ జూ ఉంది. దానిలో ఒక ఒరంగుటాన్ ను ప్రత్యేకంగా కాపాడుతున్నారు. అయితే, అది ఒక సిగరేట్ తీసుకుంది. (Orangutan Smoking in Vietnam Zoo) దాని చేతిలో పట్టుకుని మనిషి మాదిరిగా పొగను తాగింది. అది అచ్చం మనిషి మాదిరిగా దమ్ముకొడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coffee, Taiwan, Trending news, VIRAL NEWS