Home /News /trending /

DONKEY MILK USED AS MEDICINE AND ITS LITER COST TEN THOUSAND RUPEES PRV

Donkey milk: ఆ గాడిద పాలు ఔషధమంటా.. లీటర్​ రూ​ .10 వేలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ లోని ఉమర్గాకు చెందిన ధోత్రే కుటుంబం 20 గాడిదలను పెంచుతూ లీటరు గాడిద పాలు రూ.10 వేలు అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇంత డిమాండ్ ఏంటీ? ఎందుకు ఇంత ధర? వీటిని దేనికి ఉపయోగిస్తారు? అనే సందేహాలు వచ్చే ఉంటాయిగా..మరి ఉపయోగాలు లేకపోతే అంత ధర ఎలా ఉంటుంది? మరి ఆ ఉపయోగాలేంటో.. గాడిద పాలల్లో ఉండే ఆ మహత్తు ఏంటో తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
    ఎవరన్నా పిచ్చి పనులు చేస్తే ఏంటీ గాడిద(Donkey)లా ఉన్నావ్.. ఆ మాత్రం తెలీదా అలా చేయకూడదని.. అని తిడతారు. గాడిదను తిట్టడానికే కాదండోయ్.. ఎక్కువ బరువులు మోసేవారిని గాడిదలాగా ఎంత బరువు మోస్తున్నాడో అంటారు. అలాగే ఎక్కువ పనులు చేస్తే గాడిద చాకిరి అని కూడా అంటారు. కానీ ఇప్పుడు గాడిద అనేది అంత తేలిగ్గా తీసి పారేసే జంతువు మాత్రం కాదు. కాస్ట్లీ అనే చెప్పాలి. గంగిగోవు పాలు(milk) గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము (గాడిద) పాలు అని చిన్నప్పుడు పద్యం చదువుకున్నాం. కానీ ఇప్పుడు గాడిద పాల(milk)కు చాలా డిమాండ్ ఉంది. ఎంత డిమాండ్ అంటే గాడిద పాలు లీటరు రూ.10వేలకు అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇంత డిమాండా? వీటిని దేనికి ఉపయోగిస్తారు? గాడిద(donkey) పాలల్లో ఉండే ఆ ఉపయోగాలేంటో తెలుసుకుందాం..

    మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ లోని ఉమర్గాకు చెందిన ధోత్రే కుటుంబం 20 గాడిదలను పెంచుతూ లీటరు గాడిద పాలు రూ.10 వేలు(thousand) అమ్ముతున్నారు. గాడిద పాలకు ఇంత డిమాండ్ ఏంటీ? ఎందుకు ఇంత ధర? వీటిని దేనికి ఉపయోగిస్తారు? అనే సందేహాలు వచ్చే ఉంటాయిగా..మరి ఉపయోగాలు లేకపోతే అంత ధర ఎలా ఉంటుంది? మరి ఆ ఉపయోగాలేంటో.. గాడిద పాలల్లో ఉండే ఆ మహత్తు ఏంటో తెలుసుకుందాం.. గాడిద పాలలో ఆరోగ్యానికి ఉపకరించే ఎన్నో విశేష గుణాలున్నాయని అంటున్నారు సైంటిస్టులు. జన్యుపరమైన, వైరల్ సంబంధిత సమస్యలకు గాడిద పాలు చక్కని పరిష్కారాన్ని సూచిస్తాయని తెలిపారు. అంతేకాదు గాడిద పాలతో ఔషధాలే(medicine) కాకుండా బ్యూటీ ఉత్పత్తులను కూడా రూపొందిస్తున్నారు. కేరళ, మహారాష్ట్రలలో గాడిద పాలలో ఉండే ఔషధ గుణాల గురించి.. ఆ పాల వల్ల ఉపయోగాల గురించి నిర్వహించిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇవ్వటంతో గాడిద పాలకు డిమాండ్ వచ్చి పడింది. గాడిద పాలను తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. దగ్గు, జలుబు, ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్, టీబీ తదితర వ్యాధుల నివారణలో గాడిద పాలు ఉపకరిస్తాయని పరిశోధనల్లో తేలింది. కేరళలోని కోచికి చెందిన ఏబీ బేబీ… గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులు రూపొందించి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. అలా సంవత్సరానికి రూ. 20 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. పలు పరిశోధనలు నిర్వహించిన తరువాతనే వీరు సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. గాడిద పాలతో తయారు చేసే సౌందర్య ఉత్పత్తులు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. అంతే కాదు వీటికి చాలా ఖరీదు కూడా ఎక్కువే… గాడిద పాలను సబ్బులు, లిప్ బా‌మ్‌లు, బాడీ లోషన్లు తదితర వాటిని తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు.

    అలాగే మహారాష్ట్ర(Maharastra)లోని షోలాపూర్‌లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు గాడిద పాలతో బ్యూటీ ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నారు. చిన్నపిల్లలకు గాడిద పాలు చాలా బలాన్నిస్తాయట. కాగా ఒక్కో గాడిద రోజుకు 200 నుంచి 250 మిల్లీలీటర్ల పాలు ఇస్తుంది. అందుకే ఈ గాడిదల పాటకు బహు డిమాండ్​.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Animal Lovers, Business, Life Style, MILK

    తదుపరి వార్తలు