• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • DONKEY ENJOYING SWING WILL MAKE YOU SURPRISE WATCH THIS VIRAL VIDEO AK GH

Viral video: ఈ గాడిద ప్రత్యేకత వేరు.. జీవితంలో చూసి ఉండరు.. కావాలంటే చూడండి

ఉయ్యాల ఊగుతున్న గాడిద

ఒక గాడిద ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేస్తోంది. అది ఏమాత్రం భయపడకుండా, కదలకుండా ఉయ్యాలలో కూర్చుంది.

  • Share this:
ఇంటర్నెట్ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చిన తరువాత జంతువులు సందడి చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాటిలో కొన్ని.. చూసేవారి హృదయాలకు చేరువ అవుతాయి. మరొకొన్ని మాత్రం నవ్వించేలా చేస్తాయి. తాజాగా ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంట్లో ఒక గాడిద ఉయ్యాల ఊగుతూ ఎంజాయ్ చేస్తోంది. అది ఏమాత్రం భయపడకుండా, కదలకుండా ఉయ్యాలలో కూర్చుంది. తన యజమాని పాడుతున్న పాటను కూడా ఆ గాడిద ఆస్వాదిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. దీన్ని ఎవరు ఎక్కడ రికార్డు చేశారనే పూర్తి వివరాలు లేవు. కానీ వీడియో చూసిన యూజర్లు ఎంజాయ్ చేయడంతో పాటు షేర్‌ చేస్తున్నారు. 2017లో కూడా ఇలాంటి వీడియో ఒకటి యూట్యూబ్‌లో హల్ చల్ చేసింది. దీంతో ఇది పాత వీడియోనా, కొత్తదా అనేది తెలియట్లేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇలాంటిదే మరో వీడియో కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. పుంగనూరు జాతికి చెందిన ఒక చిన్న ఆవు దూడ యజమానులతో ఆడుకున్న ఆ వీడియో వైరల్ అవుతోంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత రాజీవ్ కృష్ణ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ 50 సెకన్ల వీడియోను గత వారం షేర్ చేసిన తరువాత వైరల్‌గా మారింది. వారం రోజుల క్రితం పుట్టిన చిన్న ఆవుదూడ ఎంతో ముద్దుగా ఉంది. దానికి గంటలను అందంగా అలంకరించారు. దీంతో అది నడుస్తున్నప్పుడు గంటల శబ్దం వినిపిస్తోంది.

https://twitter.com/aleksyuliyanov/status/1352783382351126528?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1352783382351126528%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fwatch-viral-video-of-donkey-enjoying-swing-will-make-you-laugh-out-loud-4429056%2F

https://twitter.com/RajivKrishnaS/status/1360875464990941185?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1360875464990941185%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fviral%2Fcute-cow-baby-viral-video-gau-mata-bachda-breaks-internet-cute-baby-hindi-news-india-4425951%2F

పుంగనూరు జాతి ఆవులు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాయి. దీంతో వీటి దూడలు మరీ చిన్నవిగా కనిపిస్తాయి. ఈ జాతి ఆవులు రోజుకు 4-5 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. వీటి పాలల్లో వెన్నశాతం ఎక్కువగా ఉంటడం విశేషం.
Published by:Kishore Akkaladevi
First published: