జనావాసాల్లో వన్యప్రాణులు.. కరోనా వేళ ప్రకృతిలో కొత్త అందాలు..

కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో జీవజాతులు అడవి నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అరుదైన, అంతరించిపోతున్నజీవులు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం.

news18-telugu
Updated: September 15, 2020, 2:57 PM IST
జనావాసాల్లో వన్యప్రాణులు.. కరోనా వేళ ప్రకృతిలో కొత్త అందాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో జీవజాతులు అడవి నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అరుదైన, అంతరించిపోతున్నజీవులు కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. కరోనాకు భయపడి మానవులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అడవి జంతువులు మాత్రం వివిధ ప్రాంతాలలో నగరాల చుట్టూ తిరుగుతున్నాయి. అడవి జంతువులను వీధుల్లో చూడటం వినోదభరితంగా, థ్రిల్లింగ్గా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. కానీ ఇది జీవవైవిధ్యానికి సంబంధించన ఒక హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది మాత్రం తాము రోడ్లపై చూసిన జంతువుల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాటిల్లో కొన్ని...

1. వాషింగ్టన్‌లో వుల్వరైన్

వాషింగ్టన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ (డబ్ల్యుడిఎఫ్డబ్ల్యు) సంస్థ లాంగ్ బీచ్ ద్వీపకల్పానికి సమీపంలో ఒక వుల్వరైన్ రహదారిపై నడుస్తున్న ఫొటోలను పోస్ట్ చేసింది. లాంగ్ బీచ్లో ఓ వ్యక్తి ఆ జంతువును కెమెరాల్లో బంధించాడు. అతడే ఆ సంస్థకు ఫొటోలను అందించాడు. 2020 మేలో మరో సందర్భంలో ఒడ్డుకు కొట్టుకువచ్చిన సముద్రపు జంతువు కలేబరాన్నితింటున్న వుల్వరైన్ ఫొటోను కూడా ఈ విభాగం పంచుకుంది.

2. ఒడిశాలో ఆలివ్ తాబేలు గూడు

ఆలివ్ తాబేళ్ల గుంపు సామూహికంగా నిర్మించుకున్న ఓ గూడు ఒడిశాలోని రుషికూల్య బీచ్లో వెలుగులోకి వచ్చింది. 2015 తరువాత రాష్ట్రంలో ఇలాంటి గూళ్లు కనిపించలేదట. కరోనా మహమ్మారి కారణంగా బీచ్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో తాబేళ్లు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి.


3. పశ్చిమ కనుమలలో నీలగిరి మార్టెన్

కొన్ని రోజుల క్రితం నీలగిరి మార్టెన్ అనే అడవి జంతువు రోడ్లపై తిరుగుతున్న వీడియో ట్విట్టర్లో వైరల్ అయ్యింది. ఇది భారతదేశంలో కనిపించే ఏకైక మార్టెన్ జాతి జంతువు. నీలగిరి పర్వతాలు, పశ్చిమ కనుమల్లోని కొండలలో ఇది నివసిస్తుంది. వీడియోలో కనిపించిన నీలగిరి మార్టెన్ను గతంలో బ్లాక్ పాంథర్ అని భావించారు. అది నీలగిరి మార్టెన్ అని ఓ ఐఎఫ్ఎస్ అధికారి నిర్ధారించారు.


4. జీబ్రా క్రాసింగ్ పై నడుస్తున్న సివెట్(పునుగుపిల్లి)

లాక్డౌన్ సమయంలో కోజికోడ్ సమీపంలోని మెప్పాయూర్లో ఒక పునుగుపిల్లి కనిపించింది. ఇది పశ్చిమ కనుమల నుంచి వచ్చి ఉండొచ్చని అటవీ అధికారులు భావించారు. ఆ జంతువు జీబ్రా క్రాసింగ్ నుంచి నడుచుకుంటూ వెళ్లి రోడ్డు దాటడం విశేషం.


5. ముంబై మెరైన్ డ్రైవ్‌లో డాల్ఫిన్లు

కొన్ని దశాబ్దాల తరువాత మెరైన్ డ్రైవ్, మలబార్ హిల్ వద్ద డాల్ఫిన్లు కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. చేపలు పట్టడం, ఇతర మానవ కార్యకలాపాల కారణంగా అవి ఒడ్డుకు రావడం మానేశాయి. లాక్డౌన్ కారణంగా జన సంచారం లేకపోవడంతో డాల్ఫిన్లు తీరానికి వచ్చాయి.

ఇవి కాక తిరుమలలోనూ వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చి సేద తీరాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 15, 2020, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading