Home /News /trending /

DOGS RESTING ON HOSPITAL BEDS IN GWALIOR VIDEO GOES VIRAL SNR

OMG: ఆ దవఖానాలో కుక్కలకు రాజభోగం..పేద రోగులకు నో బెడ్స్

Photo Credit:Youtube

Photo Credit:Youtube

OMG: గ్వాలియర్ కమలరాజా ఆసుపత్రిలో మంచాలపై కుక్కలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఈవీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కుక్కలు మంచాలపై రెస్ట్ తీసుకుంటుంటే ఆసుపత్రిలోని సిబ్బంది ఏం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇదే హాస్పిటల్ చిన్నపిల్లల వార్డులో ఓ పసికందను కుక్క దాడి చేసి చంపిన ఘటన మర్చిపోయారా అంటూ రోగులు నిలదీస్తున్నారు.

ఇంకా చదవండి ...
గతంలో ఎన్నో దారుణాలు, విషాధ ఘటనలు జరిగినప్పటికి వైద్య, ఆరోగ్య సిబ్బందిలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వీడటం లేదు. మొద్దు నిద్ర నుంచి మేల్కొనడం లేదు. మద్యప్రదేశ్‌(Madhya pradesh) గ్వాలియర్‌(Gwalior)లో జరిగిన ఓ ఘటనే ఇందుకు సజీవ సాక్ష్యాంగా నిలిచింది. గ్వాలియర్‌లోని కమలరాజా ఆసుపత్రి(Kamalraja hospital)కి పేదలు ఎక్కువ వస్తుంటారు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే..ఆసుపత్రికి వచ్చే రోగుల కోసం వార్డుల్లో బెడ్‌(Hospital beds)లు కాళీ ఉండవు. కానీ రోడ్లపై తిరిగే కుక్కలు(Dogs,)వీధుల్లో జనం వెంటపడి పిక్కలు పీక్కుతినే శునకాలు మాత్రం ఇక్కడ రాజ్యభోగం అనుభవిస్తున్నాయి. నీట్‌గా శుభ్రం చేసి వైట్‌ బెడ్‌షిట్‌లు పరిచిన బెడ్‌లపై రోడ్లపై తిరిగే పిచ్చికుక్కలు,వీధి కుక్కలు మంచాలపై పడుకుంటున్నాయి. అనేక రోగాలతో ఈ ఆసుపత్రికి వచ్చే పేద రోగులు మాత్రం వార్డుల్లోనే కింద కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒకటి రెండు కాదు పదుల సంఖ్యలో కుక్కలు కమలరాజా ఆసుపత్రిలోని బెడ్లను ఆక్రమించి పడుకున్న వీడియో (Video)ఇప్పుడు తెగ వైరల్ (Viral)అవుతోంది. ఇంత జరిగినప్పటికి ఆసుపత్రి సిబ్బంది, అధికారుల్లో మాత్రం ఏమాత్రం చలనం రాలేదు. కనీసం ఎందుకిలా జరిగింది, ఎవరి నిర్లక్ష్యం కారణంగా వీధుల్లో ఉండాల్సిన కుక్కలు ఆసుపత్రి బెడ్‌లపైకి వచ్చాయని ఆరా కూడా తీయడం లేదు.

చికిత్స రోగులకు..బెడ్లు కుక్కలకు..
గ్వాలియర్‌లో కమలరాజా ఆసుపత్రి చాలా ఫేమస్. చుట్టు పక్కల ఏ చిన్న రోగమొచ్చినా పేదలు ఈ ఆసుపత్రికే పరిగెత్తుకొని వస్తారు. గత కొద్ది రోజుల క్రితం ఇదే ఆసుపత్రిలోని మెటర్నరీ వార్డులోని బెడ్‌పై పడుకోబెట్టిన పసికందును కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మరి అలాంటి పరిస్థితి కమలరాజా ఆసుపత్రిలోనే నెలకొంటే..ఎందుకు గతంలో జరిగిన ఘటనలతో గుణపాఠాలు నేర్చుకోరని రోగులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. వార్డుల్లోని బెడ్లపై కుక్కలు విశ్రాంతి తీసుకుంటుంటే మేం ఎక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలని నిలదీస్తున్నారు. ఈవీడియో చూసైన మధ్యప్రదేశ్‌ హెల్త్ మినిస్టర్‌ ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సర్కారు దవఖానలో సిబ్బంది ఎప్పటికి మారేనో..
చిన్నపిల్లలు, ప్రసూతి మహిళలు, వృద్ధులు,ఆపరేషన్‌లు చేయించుకున్న వారు సైతం ఆసుపత్రి బెడ్‌లపై లేవలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వాళ్లపై కుక్కలు దాడి చేస్తే జరిగే నష్టానికి ఎవరూ బాధ్యత వహించాలని ప్రశ్నిస్తున్నారు. వెంటనే కమలరాజా ఆసుపత్రిలో మకాం పెట్టిన కుక్కలను వెంటనే తొలగించి వార్డుల్లోని బెడ్‌లను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Dog, Hospitals, Madhya pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు