తెలివైన కుక్క.. నెటిజన్ల ప్రశంసల జల్లు... ఏం చేసిందో తెలుసా?

మనుషులు కూడా చెయ్యని మేలును ఆ కుక్క చేసింది. దాని మంచిపనిని చూసి... అంతా మెచ్చుకుంటున్నారు. మానవత్వం ఉన్న కుక్క అంటున్నారు.

news18-telugu
Updated: July 6, 2020, 11:53 AM IST
తెలివైన కుక్క.. నెటిజన్ల ప్రశంసల జల్లు... ఏం చేసిందో తెలుసా?
తెలివైన కుక్క.. నెటిజన్ల ప్రశంసల జల్లు... ఏం చేసిందో తెలుసా? (credit - twitter)
  • Share this:
మనుషులు మంచి పని చేస్తే... మానవత్వం అంటాం... అదే కుక్కలు చేస్తే... మంచి కుక్క అని మెచ్చుకుంటాం. ఆ కుక్క అదే చేసింది. అచ్చం మనుషులలాగా అది ఆలోచించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పుణెకి చెందిన ఓ పోలీస్ కమిషనర్... ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఓ కుక్క... తన యజమానితో కలిసి... రోడ్డుపై వెళ్తోంది. అయితే... అక్కడో కర్ర... రోడ్డుకి అడ్డుగా ఉంది. కుక్క యజమాని ఆ కర్రను అలాగే వదిలేసి వెళ్లిపోయారు. కుక్క మాత్రం... కర్రను దాటి ముందుకు వెళ్లి... తీరా అదే దారిలో... ఓ కళ్లు లేని దివ్యాంగ వ్యక్తి వస్తున్నారని గ్రహించింది. రోడ్డుపై ఉన్న కర్ర... ఆ వ్యక్తికి అడ్డు తగులుతుందని భావించి... వెంటనే వెనక్కి వెళ్లి... కర్రను నోటితో కరచుకొని... రోడ్డు పక్కనకు తీసుకెళ్లి వదిలింది. ఈ వీడియో... ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


కుక్క చేసిన పనికి, దాని తెలివి తేటలకూ నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. దాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జులై 4న పోస్ట్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 8.5 లక్షల మంది చూసారు. అలాగే... 26వేల మంది లైక్ చేశారు. 5న్నర వేల మంది రీట్వీట్ చేశారు. ఇక కామెంట్లు వస్తూనే ఉన్నాయి. ఆ కుక్క నిజమైన విశ్వాసాన్ని చాటుకుందని అంతా మెచ్చుకుంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 6, 2020, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading