Video: కుక్కలు మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు కదా... నిజమే... మనుషులైనా మనల్ని మోసం చేస్తారేమోగానీ... కుక్కలు చెయ్యవు. మన కోసం ప్రాణాలు కూడా ఇస్తాయి. అవి చూపించే విశ్వాసం ఈ భూమిపై మరే జంతువూ చూపించలేదు. ఒక్క బిస్కెట్ వేసినా చాలు... ఆ వ్యక్తిని జీవితాంతం గుర్తుంచుకుంటాయి. అలాంటి శక్తి వాటికి ఉంటుంది. సరే... మన టాపిక్ విషయానికి వస్తే... 30 సెకండ్ల ఈ వీడియోని ఫేస్ బుక్ యూజర్ శ్రీజిత్ త్రిక్కర పోస్ట్ చేశారు. ఇందులో సంప్రదాయ సంగీతం వినిపిస్తుండగా... ఓ యువతి ఇసుకలో క్లాసికల్ డాన్స్ చేస్తోంది. ఆ యువత వెనక తాడు కట్టి ఉన్న ఓ కుక్క... ఆమె డాన్స్ ప్రారంభించగానే... రెండు కాళ్లతో పైకి లేచి... ముందు కాళ్లతో క్లాప్స్ కొట్టడం ప్రారంభించింది.
మనుషులు ఎలాగైతే... రెండు చేతులతో చప్పట్లు కొడతారో... అదే విధంగా ఆ కుక్క... కాళ్లతో ప్రయత్నించిన విధానం అందర్నీ కట్టిపడేస్తోంది. ఆమె డాన్స్ చేస్తున్నంతసేపూ... కుక్కలో ఆనందం క్లియర్‌గా కనిపిస్తోంది. తన ఆనందాన్ని మనలాగా చెప్పలేని ఆ మూగ జీవి... ఇలా కాళ్లను జోడిస్తూ... తెలిపింది. డాన్స్ చేస్తున్న ఆమె... ఓసారి కుక్కవైపు తిరిగినప్పుడు ఆ కుక్క... క్లాప్స్ కొట్టడం ఆపేసి... సైలెంటుగా ఉండిపోయింది. ఆమె మళ్లీ కెమెరావైపు తిరగ్గానే... మళ్లీ కాళ్లు జోడిస్తూ ఎంకరేజ్ చేసింది. ఆ వీడియోని ఇక్కడ చూడండి.
ఇది నెటిజన్లకు విపరీతంగా నచ్చడంలో వింతేమీ లేదు కదా. వీడియో అదుర్స్, సూపర్, ఆ కుక్క చాలా మంచిది అని పొగడ్తల వర్షం కురిస్తున్నారు. అలాగే ఆమె అద్భుతమైన డాన్సర్ అని మెచ్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Flying Car: విమానం లాగా గాల్లోకి ఎగిరే కారు... భవిష్యత్తు వీటిదే అంటున్న నిపుణులు
కొందరు యూజర్లు... ఆ కుక్కను ఎందుకు కట్టేశారు... వదిలేయవచ్చుగా... అలా కట్టేయడం, బంధించడం కరెక్టు కాదు అంటున్నారు. బహుశా... అలా కట్టేయకపోతే... ఆ కుక్క డాన్స్ వెయ్యకుండా... మధ్యలో అడ్డు వస్తుందని అలా చేసి ఉండొచ్చు. ఆ కుక్కపై ఆమెకు ఎంతో ఆప్యాయత ఉంది కాబట్టే... ఆమె వీడియో చివర్లో... కుక్కను కట్టేసినందుకు బుజ్జగించింది. అలాగే ఆ పప్పీ కూడా ఆమెపై విశ్వాసాన్ని అనుక్షణం చాటుకుంటోంది. అందుకే ఈ వీడియో నెటిజన్ల మనసును దోచుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: VIRAL NEWS, Viral Video, Viral Videos