హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

తప్పిపోయిన కుక్క తిరిగొచ్చిన వేళ భావోద్వేగం.. మనసును కరిగించే వీడియో – Viral Video

తప్పిపోయిన కుక్క తిరిగొచ్చిన వేళ భావోద్వేగం.. మనసును కరిగించే వీడియో – Viral Video

Twitter image

Twitter image

చాలా రోజుల తర్వాత యజమానిని చూసిన ఓ శునకం (Dog) ఆనందంలో మునిగిపోయింది. ఒక్కసారిగా ఓనర్​ను హత్తుకుంది. ఆమె కూడా కన్నీటితో ఆ శునకంపై ఉన్న మమకారాన్ని చాటింది.

  యజమానికి, పెంపుడు కుక్కలకు ఉండే బంధం ఎంతో బలంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. శునకాలు భావోద్వేగంతో మనుషులకు కనెక్ట్ అవుతాయి. అలాంటాది యజమాని నుంచి వేరైతే ఆ శునకం బాధ తీవ్రంగా ఉంటుంది. అలవాటైన మనుషులు, వాతావరణం లేక చాలా వేదన చెందుతాయి. యజమానులు సైతం అదే విధంగా ఆవేదనలో ఉంటారు. అలాంటిది కుక్క తప్పిపోయి చాలా రోజుల తర్వాత కనిపిస్తే ఆనందం చెప్పనక్కర్లేదు. ఇలాంటి ఘటనే ఇటీవల జరిగింది. తప్పియిన శుకనం తన ఓనర్ ఇంటికి వెతుక్కుంటూ వచ్చింది. ఆమెను చూసిన వెంటనే మీదకు వెళ్లింది. ఆ శునకాన్ని చూసిన ఆమె కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మనసు సంతోషంతో నిండిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  43 సెకన్లు ఉన్న ఈ వీడియోలో… తప్పిపోయిన ఆ శునకం.. యజమానికి చూడగానే సంతోషంతో చెంగున ఎగిరింది. పరుగెత్తుకెళ్లి కౌగిలించుకుంది. సంతోషంతో భావోద్వాగానికి లోనైంది. ఆ యజమాని సైతం అంతే ఆప్యాయంగా శునకాన్ని కౌగిలించుకున్నారు. కన్నీరు పెట్టుకున్నారు.  ముద్దులు పెట్టారు. ఈ వీడియో ఎమోషనల్​గా ఉండడంతో నెటిజన్లు ఫిదా అయిపోయారు.

  ఓ ట్విట్టర్​ యూజర్​ ఈ వీడియోను పోస్ట్ చేశారు. “తప్పిపోయిన కుక్క.. యజమాని వద్దకు వచ్చిన క్షణంలో పొందిన సంతోషం. ఈ వీడియో అందరిలో  సంతోషం నింపుతుందని ఆశిస్తున్నా” అని రాసుకొచ్చారు.

  ఈ వీడియోకు ఇప్పటికే భారీ సంఖ్యలో వ్యూస్​ రాగా లైక్​లు, కామెంట్లు ఇదే విధంగా వస్తున్నాయి.

  “చూడండి.. అది మనుషులను ఎంత ప్రేమించిందో. చాలా అందమైన దృశ్యం. నేను చాలా వారాలు దూరమయ్యాక నా కూతుర్ల నుంచి కూడా ఇంత ఎఫెక్షన్ చూడలేదు” అని ఓ యూజర్ రాసుకొచ్చారు.

  “ప్రేమ, అమాయకత్వంలో శునకాలను మించిందేదీ లేదు. మీ  ఆస్తిని కుక్కలు అసలు పట్టించుకోవు” అని మరో యూజర్ స్పందించారు.

  Published by:Krishna P
  First published:

  Tags: Dog, Viral Video

  ఉత్తమ కథలు