
Dog plays in the snow (Photo : Twitter)
Viral Video : సాధారణంగా కుక్కలకు మంచు అంటే చాలా ఇష్టం. మంచును చూస్తే అవి ఉత్సాహంతో ఉరకలేస్తాయి. వాటికి ఇష్టం వచ్చినట్లు పరుగులు తీస్తాయి. మంచుపై అవి చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సాధారణంగా కుక్కలకు మంచు అంటే చాలా ఇష్టం. మంచును చూస్తే అవి ఉత్సాహంతో ఉరకలేస్తాయి. వాటికి ఇష్టం వచ్చినట్లు పరుగులు తీస్తాయి. మంచుపై అవి చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. మంచుతో కప్పబడిన సుందరమైన ప్రాంతాన్ని చూసిన ఓ బొచ్చు కుక్క.. ఉత్సాహంతో ఆ ప్రాంతం అంతా కలియతిరిగింది. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ... మంచులో బొర్లాడింది. జారుడు బల్లపై జారినట్లు.. మంచుపై పడుకొని కిందికి జారింది. కుక్క చేసే విన్యాసాలు నవ్వులు పూయిస్తోంది. కుక్క చేసిన ఈ ఫీట్లను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఇక ఈ అరుదైన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 57000 వ్యూస్, 4000 లైకులు వచ్చాయి.
‘కుక్క వీడియోలతో ఇదొక అద్భుత వీడియో, ఈ వీడియో చూస్తే నాకు చక్కిలిగింతలు పెట్టినట్లు అవుతుంది, ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేక పోతున్నాను’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మేం చూసిన వీడియోలో ఇదొక అద్భుతమంటూ మరికొందరూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ఆస్ట్రియాలో తీసినట్లు తెలుస్తోంది.
Published by:Sridhar Reddy
First published:December 27, 2020, 13:22 IST