హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Dog In Bussiness Cabin: పెంపుడు కుక్క కోసం విమానం బిజినెస్‌ కేబిన్‌ మొత్తం బుక్ చేసిన ఓనర్.. ఎంత ఖర్చు చేశాడంటే..

Dog In Bussiness Cabin: పెంపుడు కుక్క కోసం విమానం బిజినెస్‌ కేబిన్‌ మొత్తం బుక్ చేసిన ఓనర్.. ఎంత ఖర్చు చేశాడంటే..

ప్రతీకాత్మక చిత్రం(Image- Shutterstock)

ప్రతీకాత్మక చిత్రం(Image- Shutterstock)

కొందరు మూగ జీవాలంటే విపరీతంగా ఇష్టపడతారు. వాటిపై ప్రేమ, జాలి చూపెడతారు. ఇక, కుక్కల(Pet Dogs) విషయానికి వస్తే చాలా మందిని వాటిని ఇళ్లలో పెంచుకుంటారు.

  కొందరు మూగ జీవాలంటే విపరీతంగా ఇష్టపడతారు. వాటిపై ప్రేమ, జాలి చూపెడతారు. ఇక, కుక్కల(Pet Dogs) విషయానికి వస్తే చాలా మందిని వాటిని ఇళ్లలో పెంచుకుంటారు. అంతేకాకుండా వాటిని కుటుంబ సభ్యులుగా భావించే వారు కూడా ఉన్నారు. వాటి బాగోగులు చూసుకుంటూ, వాటితో ఆడుతూ మురిసిపోతారు. వాటికి చిన్న గాయం అయితే తల్లడిల్లిపోతారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తాను ఎంతగానో ఇష్టపడే కుక్క కోసం ఎయిర్ ఇండియా విమానంలోని( Air India flight) బిజినెస్ క్లాస్ క్యాబిన్ బుక్ చేశాడు. విమానం బిజినెస్ క్లాస్‌లోని మొత్తం 12 సీట్లను బుక్ చేసి.. అందులో తన కుక్కతో కలిసి ప్రయాణించాడు. ఇందుకోసం రూ. 2.5 లక్షలు ఖర్చు చేశాడు.

  వివరాలు.. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో కలిసి ముంబై నుంచి చెన్నై వెళ్లాలని భావించాడు. ఇందుకోసం ఎయిర్ ఇండియా విమానం AI-671‌లో టికెట్స్ బుక్ చేశాడు. ఈ విమానంలో బిజినెస్‌ క్లాస్‌ (business class) కేబిన్‌ సీట్లు 12 ఉంటాయి. దీంతో అతడు తన కుక్కతో సహా ప్రయాణించేందుకు 12 సీట్లనూ బుక్‌ చేసుకున్నాడు. తనకు ఇష్టమైన పెట్‌కు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో అతడు ఈ విధంగా చేశాడు. ఈ విమానం బుధవారం ఉదయం 9 గంటలకు ముంబై నుంచి చెన్నైకి బయలుదేరింది. ఇక, సాధారణంగా ముంబై(Mumbai) నుంచి చెన్నైకి(Chennai) ఎయిర్ ఇండియా బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ రూ.20,000 ఉంటుంది.

  Son Files Case: తండ్రిపై కేసు వేసిన యువకుడు.. సాయం చేయమని పోలీసుల వద్దకు.. ఇంతకీ ఆ తండ్రి ఏం కోరాడంటే..

  ఎయిర్ ఇండియా పాలసీ..

  ఎయిర్ ఇండియా (Air India) తమ విమానాల్లో ప్రయాణించేందుకు పెంపుడు జంతువులను అనుమతిస్తుంది. కుక్కలు, పిల్లలు, పక్షలు వంటి చిన్న పెంపెడు జంతువులు ఆరోగ్యంగా ఉన్నట్టు, రాబిస్ టీకా సర్టిఫికేట్ తీసుకున్నట్టు ఆధారాలు చూపెడితేనే అవి విమానంలో ప్రయాణించేందుకు అనుమతించబడతాయి. ఒక ప్రయాణికుడు.. వాటి సైజ్ ఆధారంగా రెండు పెంపుడు జంతువుతో ప్రయాణించవచ్చు. వాటిని ప్రయాణికులు క్యాబిన్‌లో లేదా, కార్గో హోల్డ్‌లో ఉంచవచ్చు. బిజినెస్ క్లాస్ విషయానికి వస్తే.. పెంపుడు జంతువులకు క్యాబిన్ చివరి వరుసలో కూర్చునేందుకు అనుమతి ఉంటుంది. ఇక, యిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో కుక్కలతో గతంలోనూ పలువురు ప్రయాణించారు.

  Married Woman: భర్త శారీరకంగా కలవడం లేదన్న భార్య.. సెక్స్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే..

  పలు సందర్భాల్లో యజమానులు వారి పెంపెడు జంతువులతో (Pets) కలిసి ప్రయాణించడానికి అనేక విమానయాన సంస్థలు అనుమతించిన సంగతి తెలిసిందే. గతంలో ఒక మహిళ ఒకసారి తన తల్లి, పెంపుడు జంతువు కంగారుతో విమానంలో వెళ్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Air India, Dog, Pet dog

  ఉత్తమ కథలు