హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Dog Missing: రైల్వే స్టేషన్ లో తప్పిపోయిన కుక్క.. ఆచూకీ కోసం రంగంలోకి ఆర్పీఎఫ్

Dog Missing: రైల్వే స్టేషన్ లో తప్పిపోయిన కుక్క.. ఆచూకీ కోసం రంగంలోకి ఆర్పీఎఫ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెంపుడు కుక్కను వెతకడం కోసం పోలీసు దళమే రంగంలోకి దిగిన సంఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. పుణె రైల్వే స్టేషన్ లో దిగిన ఓ జంట తమ పెంపుడు కుక్క తప్పిపోయిందని ఓ జంట పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

  • News18
  • Last Updated :

పెంపుడు కుక్కను వెతకడం కోసం పోలీసు దళమే రంగంలోకి దిగిన సంఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. పుణె రైల్వే స్టేషన్ లో దిగిన ఓ జంట తమ పెంపుడు కుక్క తప్పిపోయిందని, ఎలాగైనా దాన్ని కనిపెట్టాలనే అసాధారణ కార్యక్రమాన్ని రైల్వే పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బలగాలు రంగంలోకి దిగి తప్పిపోయిన శునకాన్ని వెతికే పనిలో పడ్డారు. ఈ సంఘటన గత ఆదివారం జరిగింది.

అగ్రజ కశ్యప్ దంపతులు దిల్లీ నుంచి పుణెకు ఏసీ రైలు బోగిలో ప్రయాణం సాగించారు. పుణె రైల్వేస్టేషన్ లోని ఒకటో నెంబరు ప్లాట్ ఫాంలో దిగిన వీరి పెంపుడు కక్కు జనం సందడిలో పడి తప్పిపోయింది. దీంతో తాము ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కుక్కను ఎలాగైనా పట్టి ఇవ్వాలని రైల్వే పోలీసులను ఆశ్రయించారు.

"నేను నా భర్త దిల్లీ నుంచి పుణెకు మా రెండు పెంపుడు కుక్కలతో కలిసి వచ్చాం. ప్రయాణంలో వాటి నుంచి మాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే మేము పుణేలో రైలు దిగినప్పుడు నేను ఓ శునకాన్ని పట్టుకున్నాను. నా భర్త మరోకదాని బాధ్యతు చూసుకుంటున్నాడు. ఇంతలో నా కాలు జారి కింద పడ్డాను. ఈ ప్రక్రియలో కాలికి గాయమైంది. నా బాధలో నేను ఉండగా.. ఆ గందరగోళంలో నా కుక్క భయంతో ఎటువైపో పరుగులు తీసింది. జనంలో ఎంత వెతికినా కనిపించలేదు" అని అగ్రజా కశ్యప్ తెలిపారు.

"బాధతో తీవ్రంగా ఉండటంతో కుక్కను వెతకడం అలా ఉంచి ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అనంతరం తప్పిపోయిన మా కుక్క గురించి సీనియర్ రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాం. దాన్ని గుర్తించడంలో వారిని సహాయం చేయమని అడిగాం. అయితే ఇప్పటికీ మా కుక్కు రైల్వే స్టేషన్ సమీపంలో ఉందా లేదా అనే విషయం మాకు తెలియడం లేదు. ఒకవేళ స్టేషన్ కు దగ్గరలో మా శునకం ఎవరికైనా కనిపిస్తే రైల్వే అధికారులను సంప్పదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం" అని ఆవేదన వ్యక్తి చేశారు.

మరోపక్క రైల్వేపోలీసులు కుక్క కోసం గాలింపు తీవ్రతరం చేశారు. ఎలాగైనా వెతికి తీసుకొస్తామని హామి ఇచ్చారు. ఈ వియంలో కేసు విచారణ చేస్తోన్న ఇన్ స్పెక్టర్ అశ్విన్ కుమార్ స్పందించారు. "ఫిర్యాదు అందుకున్న తర్వాత తప్పిపోయిన శునకం ఫొటోను ఫిర్యాదారులను నుంచి తీసుకొని మా బృందంలోని ప్రతి ఒక్కరికి పంపించాం. తప్పిపోయిన కుక్క దొరికే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించాం" అని ఆయన స్పష్టం చేశారు.

గత మూడు రోజులుగా వివిధ బోగీలు, యార్డుల్లో వెతికామని, రైల్వే కోచ్ లు కూడా శోధించామని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. అయితే ఇంతవరకు శునకం జాడ తెలియరాలేదని, రైల్వే ట్రాక్ కు సమీప పొదల్లోనూ వెతికామని.. శునకం ఆచుకీ లభ్యమైతే తమను అప్రమత్తం చేయాలని సిబ్బందిని కోరారు.

Published by:Srinivas Munigala
First published:

Tags: Dog, Maharashtra, Pune

ఉత్తమ కథలు