సీసీటీవీ కెమెరాలు వచ్చిన తరువాత అన్ని అందులో రికార్డ్ అవుతున్నాయి. క్షణాల్లో జరిగిపోయే యాక్సిడెంట్లు వంటివి అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి యాక్సిడెంట్ ఒకటి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అయితే ఈ యాక్సిడెంట్ చేసింది ఓ కుక్క కావడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూల్‌గా ఓ చోటికి వచ్చి తన కారును పార్క్ చేసిన ఓ వ్యక్తి... కారు దిగి మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి అతడు కిందపడిపోయాడు. ఇందుకు కారణం అటు నుంచి వేగంగా వస్తున్న ఓ కుక్కు.
వేగంగా పరుగెడుతూ వచ్చిన కుక్క... కూల్‌గా నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. అంతే.. అతడు అమాంతం కిందపడిపోయింది. అతడి నడుముకు గాయమైంది. ఆ తరువాత నడుము పట్టుకుని పైకి లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బాధితుడు.
In South Africa, on June 6, there was a road accident !!!
— KisiPisi (@PisiKisi) June 9, 2021
Dog hit a man crossing the road on a zebra crossing ? pic.twitter.com/cRpThAfWvn
ఓ కుక్క ఈ స్థాయిలో యాక్సిడెంట్ చేసి హిట్ అండ్ రన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే కుక్క కారణంగా యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తికి ఎలాంటి తీవ్రగాయాలు కాకపోవడం ఊరట కలిగించే విషయం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.