హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Dog Giving Milk to Baby Cow: లేగ దూడను అక్కున చేర్చుకుని పాలు ఇస్తున్న శునకం..!

Dog Giving Milk to Baby Cow: లేగ దూడను అక్కున చేర్చుకుని పాలు ఇస్తున్న శునకం..!

ఒక బిడ్డ ఆకలి ఒక తల్లికే తెలుస్తుందంటారు. ఆకలితో ఉన్న ఓ లేగ దూడను అక్కున చేర్చుకొని తన చనుపాలు పట్టి ఓ శునకం ఆ లేగ దూడ ఆకలి తీర్చుతోంది. కొద్ది రోజుల క్రితం తల్లిని కోల్పోయిన లేగ దూడను...

  ఆదిలాబాద్: ఒక బిడ్డ ఆకలి ఒక తల్లికే తెలుస్తుందంటారు. ఆకలితో ఉన్న ఓ లేగ దూడను అక్కున చేర్చుకొని తన చనుపాలు పట్టి ఓ శునకం ఆ లేగ దూడ ఆకలి తీర్చుతోంది. కొద్ది రోజుల క్రితం తల్లిని కోల్పోయిన లేగ దూడను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ‘జై శ్రీరాం’ గోశాలలో వదిలిపెట్టారు. కనీసం ఇతర ఆవుల పాలు తాగి పెరుగుతుందని అనుకున్నారు. కాని ఆ లేగదూడ ఏ ఆవు దగ్గర పాలు తాగలేదు. డబ్బా పాలు కూడా తాగలేదు. పాలు తాగకపోయినా ఆ లేగ దూడ హుషారుగా కనిపించడంతో ఆశ్చర్యపోయారు. అయితే గోశాలలో ఉన్న ఓ కుక్క పాలు తాగుతూ లేగదూడ కనిపించింది. కొన్ని రోజుల నుంచి ఆ లేగ దూడ కుక్కలతో కలిసి తిరగడం, వాటితోనే కలిసి పడుకోవడం చేస్తోంది.

  కుక్క కూడా జాతి వైరం మరిచి ఆ తల్లి లేని లేగ దూడను అక్కున చేర్చుకొని తన పాలతో కడుపు నింపుతూ సఖ్యతగా మెలుగుతున్నాయి. అన్నీ తెలిసిన మనిషి బంధాలను తెంపుకుంటున్న ఈ రోజుల్లో ‘నీదే జాతి.. నాదే జాతి’ అని కూడా పట్టించుకోకుండా పాలుపట్టి లేగదూడ ఆకలి తీర్చుతున్న కుక్కలో ఉన్న తల్లి మనసుకు అందరూ ఫిదా అయ్యారు. గతంలో కూడా ఇలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది.

  కుక్క పిల్లలకు జన్మనిచ్చిన తల్లి కుక్క చనిపోవడంతో ఆ పిల్లలన్నీ ఆవు పొదుగు చెంతకు చేరాయి. తన లేగ దూడలు కాకపోయినప్పటికీ ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలను చూసి ఆ గోమాత మనసు కరిగిపోయింది. వాటిని ఏమాత్రం కసురుకోకుండా పాలిచ్చి ఆకలి తీర్చింది. జంతువులు జాతి వైరాన్ని మరిచి ఇలా అన్యోన్యంగా మెలుగుతుంటే మనుషులు మాత్రం కులాల పేరుతో, వర్గాల పేరుతో వైరం పెంచుకుంటున్నారని, ఇలాంటివి చూసైనా.. ఇకనైనా మారాలని జంతు ప్రేమికులు పిలుపునిస్తున్నారు.

  First published:

  Tags: Dog

  ఉత్తమ కథలు