• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • DOG GETS TRAPPED BEHIND THE WALL AFTER GETTING FRIGHTENED BY THE FESTIVE FIRECRACKER BANGS VIDEO GOES VIRAL GH SRD

Viral Video: టపాసుల శబ్దానికి భయపడి.. గోడ రంధ్రంలో ఇరుక్కుపోయిన కుక్క.. ఆ తర్వాతేం జరిగిందంటే..

Viral Video: టపాసుల శబ్దానికి భయపడి.. గోడ రంధ్రంలో ఇరుక్కుపోయిన కుక్క.. ఆ తర్వాతేం జరిగిందంటే..

టపాసుల శబ్దానికి భయపడి.. గోడ రంధ్రంలో ఇరుక్కుపోయిన కుక్క..(Photo Credit : Youtube)

Viral Video: పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు టపాసులు కాల్చడం అంతటా సహజంగా జరిగేదే..  వీటి నుంచి వచ్చే పొగ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలిసినా సరే, పక్కవారితో పోల్చుకొని మరీ టపాసులు పేలుస్తుంటాం. అయితే, మన ఆనందం కోసం పక్కవారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని గుర్తించాలి. టపాసుల నుంచి వచ్చే శబ్ధం పెంపుడు జంతువులను భయభ్రాంతులకు గురిచేస్తుంది.

  • Share this:
పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే చాలు టపాసులు కాల్చడం అంతటా సహజంగా జరిగేదే..  వీటి నుంచి వచ్చే పొగ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలిసినా సరే, పక్కవారితో పోల్చుకొని మరీ టపాసులు పేలుస్తుంటాం. అయితే, మన ఆనందం కోసం పక్కవారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని గుర్తించాలి. టపాసుల నుంచి వచ్చే శబ్ధం పెంపుడు జంతువులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. అనేక సందర్భాల్లో, టపాసుల వల్ల జంతువులకు వినికిడి లోపం కూడా వస్తుంది. ఇటీవల చైనాలో కూడా ఇటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధిన వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనా ప్రజలు ఏటా ప్రపంచానికి విభిన్నంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. వారి క్యాలెండర్ వేరుగా ఉండడమే దీనికి కారణం. ఈసారి కూడా  ఫిబ్రవరి 13న లూనార్​ న్యూ ఇయర్​ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే యాంచెంగ్​లోని ఒక అపార్ట్​మెంట్​లో ఒక ఆసక్తిరమైన సంఘటన చోటుచేసుకుంది. అపార్ట్​మెంట్​ వాసులు పెద్ద ఎత్తున టపాసులను పేల్చి వేడుకలు నిర్వహిస్తుండగా.. ఆ శబ్ధంతో భయానికి లోనైన ఒక కుక్క వాటి నుండి తప్పించుకునేందకు గోడ వెనుక దాక్కుంది.

అయితే, ఆ గోడకు చిన్న రంధ్రం ఉండటంతో అందులో చిక్కుకుపోయింది. తద్వారా అది ఎటూ కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయింది. దీన్ని గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు దాన్ని రక్షించేందుకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు రంగంలోకి దిగి కుక్కను సురక్షితంగా బయటికి తీశారు. కాగా, పోలీసులు కుక్కను రక్షిస్తున్న సందర్భంలో తీసిన చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సురక్షితంగా కాపాడిన రెస్క్యూ టీం..ఈ వీడియోను నిశితంగా పరిశీలించగా.. గోడ రంధ్రంలో ఇరుక్కుపోయిన కుక్కను బయటికి తీయడానికి రెస్క్యూ టీం సుత్తిని ఉపయోగించారు. కుక్కకు ఎటువంటి గాయాలు కాకుండా సుత్తితో ఒక పోలీసు అధికారి గోడను పగులగొట్టారు. దీంతో ఆ కుక్కను సురక్షితంగా బయటికి తీయగలిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కాగా, హాక్నీలోని విక్టోరియా పార్క్‌లో కూడా ఇటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒక కుక్క మంచుతో కూడిన నదిలో పడిపోయింది. దీంతో తన కుక్కను కాపాడుకునేందుకు వీరోచిత పోరాటం చేశాడు దాని యజమాని. దాన్ని రక్షించేందుకు గడ్డకట్టే నీటిలోకి దూకాడు. మంచును విచ్ఛిన్నం చేసి దాన్ని కాపాడాడు. అప్పట్లో ఈ వీడియో కూడా సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు