Viral Video: చేతిలో ఏమీ లేకున్నా తినిపిస్తున్నట్టు ఆశ చూపిన యజమాని.. ఆ కుక్కపిల్ల రియాక్షన్ చూసి నవ్వాపుకోలేరు..!

చేతిలో ఏమీ లేకున్నా తినిపిస్తున్నట్టు ఆశ చూపుతున్న యజమాని

పెంపుడు జంతువులతో చేసే ఫన్నీ చేష్టలు నవ్వు తెప్పిస్తుంటాయి. పిల్లులు, కుక్క పిల్లల వీడియోలయితే నెట్టింట ట్రెండ్ సృష్టిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

  • Share this:
    నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. ఓ స్మార్ట్ ఫోన్, దానికి ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు. నెటిజన్లు తమ కళా పోషనను చూపిస్తుంటారు. ఫ్రాంక్ వీడియోలతో భయపెట్టిస్తుంటారు. ఫన్నీ వీడియోలతో ఆకట్టుకుంటారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తుంటుంటారు. నెట్టింట వైరల్ అయ్యే వీడియోలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంత సిల్లీ వీడియో వైరల్ ఎందుకు అవుతోందబ్బా..? అని అంతా ఆశ్చర్యపడిపోతుంటారు. సోషల్ మీడియాలో మనుషుల రిస్కీ ఫీట్లు, నెటిజన్ల టాలెంట్లకు సంబంధించిన వీడియోలతోపాటు జంతువుల వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. పెంపుడు జంతువులతో చేసే ఫన్నీ చేష్టలు నవ్వు తెప్పిస్తుంటాయి. పిల్లులు, కుక్కలతో వారు ఆడే ఆటలకు సంబంధించిన వీడియోలయితే నెట్టింట ట్రెండ్ సృష్టిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

    ఓ చిన్న కుక్క పిల్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట యమా జోరుగా ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యజమాని తన పప్పీకి ఏదో తినిపిస్తున్నట్టుగా ఆశ చూపిస్తుంటాడు. చేతిలో ఏమీ లేకున్నా ఉన్నట్టుగా తీసుకెళ్లి ఆ కుక్క పిల్ల మూతి దగ్గరకు తీసుకెళ్తుంటాడు. రెండు సార్లు ఆశగా ఆ కుక్కపిల్ల నోరు తెరచింది. మూడో సారి మాత్రం అది నోరు తెరవలేదు. పైగా కోపంగా కళ్లు పెద్దవి చేసి మరీ చూడటం మొదలు పెట్టింది.




    ఇది కూడా చదవండి: వేగంగా వెళ్తున్న కారు అద్దంపై పాము ప్రత్యక్షం.. వైపర్ తో తొలగించేందుకు ప్రయత్నం.. చివరకు..

    ’అందులో ఏమీ లేదు. నన్నే ఫూల్ చేయాలనుకుంటున్నావా‘ అన్నట్టుగా దానిచూపులు ఉన్నాయి. ఆ కుక్క పిల్ల ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ చూసిన నెటిజన్లు వీడియోకు ఫిదా అవుతున్నారు. ఐదు రోజుల క్రితం వూఫ్ వూఫ్ అనే ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఆ వీడియోను ఇప్పటి వరకు 3.7 లక్షల మంది లైక్ చేశారు. 42 వేల మంది ఆ వీడియో కింద కామెంట్స్ చేశారు. లక్షల 88 వేల మంది ఆ వీడియోను షేర్ చేశారు. మరి ఫన్నీ ఫన్నీగా ఉన్న ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
    ఇది కూడా చదవండి: స్నేహితుడి పెళ్లికి వెరైటీ బహుమతిని ఇచ్చిన యువకులు.. గిఫ్ట్ బాక్సులో ఏముందో చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా..
    Published by:Hasaan Kandula
    First published: