హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇల్లెక్కిన శునకం.. ఎలా అక్కడిదాకా చేరుకుందో వీడియో చూస్తే అవాక్కవడం పక్కా..!

ఇల్లెక్కిన శునకం.. ఎలా అక్కడిదాకా చేరుకుందో వీడియో చూస్తే అవాక్కవడం పక్కా..!

ఇల్లెక్కి చూస్తున్న శునకం

ఇల్లెక్కి చూస్తున్న శునకం

ఆ శునకం చేసిన రేర్ ఫీట్ కు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. వాస్తవానికి పిల్లుల వంటివి మాత్రమే నిచ్చెనలు ఎక్కగలవు. కొందరు వ్యక్తులు కూడా ఎత్తైన నిచ్చెనలు ఎక్కడానికి భయపడుతుంటారు. కానీ ఆ కుక్క మాత్రం ఎంతో అనుభవం ఉన్నదానిలా, అలవాటు ఉన్న దానిలా నిచ్చెనను ఎక్కి ఇంటి పైకెక్కింది. ఆ నిచ్చెనను శునకం ఎలా ఎక్కిందో చూద్దామని ఆ ఇంటి యజమాని ఇంటి బయట అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాడు.

ఇంకా చదవండి ...

  ఆ ఇంటి యజమానికి శునకాలంటే చాలా ఇష్టం. అందుకే ఒకటికి రెండు శునకాలను తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. రోజూలాగానే ఆ రోజు కూడా శునకాలు ఎక్కడ ఉన్నాయా? అని వెతుక్కుంటూ ఇంటి ఆవరణలోకి వచ్చాడు. ఒకటే శునకం కనిపించింది. రెండోది కనిపించలేదు. ఇంట్లో లేదు. ఇంటి ఆవరణలో కూడా లేదు. తలుపేమో వేసి ఉంది. ఎక్కడకు వెళ్లి ఉంటుందా అనిఆలోచిస్తుండగా.. మొదటి శునకం అరవడం మొదలు పెట్టింది. ఓ నిచ్చెన దగ్గర నిల్చుని అరుస్తోంది. అసలు సంగతేంటా అని ఆ యజమాని నిచ్చెన ఎక్కి చూస్తే షాక్. ఏకంగా ఇంటి పైన నిల్చుని ఆ శునకం ఠీవీగా బయటకు చూస్తోంది. దీంట్లో వింత ఏముందనుకునేరు. ఆ శునకం మెట్కెక్కి ఆ ఇంటి పైకి వెళ్లలేదు. అక్కడ ఉన్న నిచ్చెనను ఎక్కి మరీ ఆ ఇంటిపైకి వెళ్లింది.

  ఆ శునకం చేసిన రేర్ ఫీట్ కు సోషల్ మీడియా ఫిదా అవుతోంది. వాస్తవానికి పిల్లుల వంటివి మాత్రమే నిచ్చెనలు ఎక్కగలవు. కొందరు వ్యక్తులు కూడా ఎత్తైన నిచ్చెనలు ఎక్కడానికి భయపడుతుంటారు. కానీ ఆ కుక్క మాత్రం ఎంతో అనుభవం ఉన్నదానిలా, అలవాటు ఉన్న దానిలా నిచ్చెనను ఎక్కి ఇంటి పైకెక్కింది. ఆ నిచ్చెనను శునకం ఎలా ఎక్కిందో చూద్దామని ఆ ఇంటి యజమాని ఇంటి బయట అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాడు. అచ్చం మనిషిలాగానే, ఏమాత్రం భయం లేకుండా శునకం నిచ్చెనను ఎక్కడాన్ని చూసి అబ్బురపడ్డాడు.

  మొదటగా ఈ వీడియో టిక్ టాక్ లో వైరల్ అయింది. ఆ తర్వాత ఇదే వీడియోను ఈయాన్ అనే నెటిజన్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసుకున్నాడు. దీంతో మళ్లీ అది హాట్ టాపిక్ గా మారింది. ఆరు మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. నాలుగు లక్షలకు పైగా లైక్స్, 80 వేల వరకు రీట్వీట్లు, రెండున్నర వేలకు పైగా కామెంట్స్ తో అతడి ట్విటర్ ఖాతా మోత మోగిపోయింది. వింత వింత వ్యాఖ్యానాలతో నెటిజన్లు ఆ శునకాన్ని పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు. మరి ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Trending videos, VIRAL NEWS, Viral Video

  ఉత్తమ కథలు