అజయ్ దేవగణ్‌ని ఫాలో అయిన కుక్క...ఆటోపై అదిరిపోయే ఫీట్...వైరల్ వీడియో

వేగంగా వెళ్తున్న ఆటో టాప్‌పై నిలబడి కెమెరాలకు చిక్కిందో శునకం. అంత స్పీడ్‌లో వెళ్తున్నా..ఏ మాత్రం కదలకుండా నిలబడి పోజులిచ్చింది. డాగ్ స్టంట్ వీడియోను బాలీవుడ్ హీరో, జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

news18-telugu
Updated: February 8, 2019, 4:54 PM IST
అజయ్ దేవగణ్‌ని ఫాలో అయిన కుక్క...ఆటోపై అదిరిపోయే ఫీట్...వైరల్ వీడియో
ఆటోపై కుక్క, బైక్స్‌పై అజయ్
news18-telugu
Updated: February 8, 2019, 4:54 PM IST
బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ సినిమాల్లో ఎన్నో స్టంట్స్  చేశాడు. రిస్కీ ఫీట్స్ చేసి ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఐతే 1991లో విడుదలైన 'ఫూల్ ఔర్ కాంటే'  సినిమాలో అజయ్ చేసిన ఓ ఫీట్ అప్పట్లో పాపులర్ అయింది.  హైస్పీడ్‌లో దూసుకెళ్తున్న రెండు బైకులపై బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తాడు అజయ్ దేవగన్. ఆ సీన్ చూసి థియేటర్లన్నీ విజిల్స్‌తో మార్మోగిపోయేవి. ఐతే ఓ కుక్క సేమ్ టూ సేమ్ ఇలాంటి ఫీట్‌నే చేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది.

వేగంగా వెళ్తున్న ఆటో టాప్‌పై నిలబడి కెమెరాలకు చిక్కిందో శునకం.  అంత స్పీడ్‌లో వెళ్తున్నా..ఏ మాత్రం కదలకుండా నిలబడి పోజులిచ్చింది. డాగ్ స్టంట్ వీడియోను బాలీవుడ్ హీరో, జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  'అజయ్ దేవగణ్..! ఇప్పుడే మీ కుక్కును చూశా..' అని సరదాగా  కామెంట్ చేశాడు.
రితేశ్ దేశ్‌ముఖ్ ట్వీట్‌కు అజయ్ దేవగణ్ సైతం స్పందించాడు. 'ఈ పక్షిలాగే ఎలాగైతే నాదో..ఆ కుక్క కూడా అలానే' అని ట్వీట్ చేశాడు. రెండు చెక్కలపై అటో కాలు ఇటో కాలు వేసి కూర్చున్న ఓ పక్షి ఫొటోను షేర్ చేశాడు.

ఈ కుక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. అజయ్ దేవగణ్ బైక్ స్టంట్‌ని కాపీ చేస్తూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...