Video : కుక్కను భయపెడుతున్న హెయిర్ క్లిప్... నవ్వు ఆపుకోలేకపోతున్న నెటిజన్లు...

ఒక్కోసారి ఇళ్లలో పెంచుకునే కుక్కలు అతి గారాబానికి పోతాయి. ఆ టైంలో అవి మనతో ఆడుకుంటాయి. అలాంటి ఓ కుక్క... హెయిర్ క్లిప్‌ని చూసి భయపడుతోంది. ఇప్పుడా వీడియోని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 12:09 PM IST
Video : కుక్కను భయపెడుతున్న హెయిర్ క్లిప్... నవ్వు ఆపుకోలేకపోతున్న నెటిజన్లు...
గోల్డెన్ రిట్రీవర్ (Image : Instagram - tuckerbudzyn)
Krishna Kumar N | news18-telugu
Updated: August 9, 2019, 12:09 PM IST
జనరల్‌గా ఆ కుక్క... ఎవర్ని చూసినా భయపడదు. మొరగడంలో కూడా దానిది పెద్ద రికార్డే. అలాంటిది ఆ గోల్డెన్ రిట్రీవర్... ఓ చిన్న ప్లాస్టిక్ హెయిర్ క్లిప్ చూసి వణికిపోతోంది. ఆ క్లిప్‌ని చూపిస్తే చాలు... "వామ్మో... నా కొద్దు ఇది" అన్నట్లు ఫేస్ పెట్టి... ఆందోళనతో ఓనర్ వైపు చూస్తోంది. "అసలది ఏంటిది? దాన్ని నాకెందుకు చూపిస్తున్నారు? అది ఎందుకు తెరచుకొని, మూసుకుంటోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఆ కుక్క మైండ్‌లో మెదులుతున్నట్లు కనిపిస్తోంది ఆ వీడియోని చూస్తే. కర్ట్‌నీ బడ్జిన్ ఆ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఏడాది వయసున్న ఆ పప్పీ... బెడ్‌పై అటూ ఇటూ గెంతుతూ.... క్లిప్‌ని తనకు చూపించవద్దని ఓనర్‌ను బతిమలాడుతున్న సీన్... నెటిజన్లకు తెగ నచ్చేస్తోంది. ఎలాగైనా ఆ క్లిప్‌ని కొరకాలని అనుకుంటూ, లోలోపల భయపడుతూ ఆ కుక్క ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇప్పటికే ఈ వీడియోను 20 లక్షల మంది దాకా చూశారు. మూడున్నర లక్షల మంది లైక్ కొట్టారు.

 






 

Loading...


View this post on Instagram




 

Loobsters is definitely food, NOT frens 🍴🦞Almost snip snapped my hekkin floof off 😡 - Watch the FULL 3 minute version on my YouTube channel 🎥 Link in bio!


A post shared by Tucker | The Golden Retriever (@tuckerbudzyn) on





ప్రస్తుతం మిచిగాన్‌లోని ఈ గోల్డెన్ రిట్రీవర్ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయ్యింది. దీనికి ఇన్‌స్టాగ్రాంలో 15 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.


First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...