Home /News /trending /

DOES RAILWAYS HAS GENDER HERE IS HOW KAZIPET RAILWAY WAGON WORKSHOP FACING BIZARRE IN TELANGANA DHARANI PORTAL MKS

kazipet: ఇంతకీ రైల్వే ఆడా, మగా? తండ్రి పేరేంటి? సమాధానాలు చెబితేనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నిధులు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ రైల్వేస్‌కు లింగ నిర్ధారణ ఉందా? ఇంతకీ రైల్వేస్ ఆడా? మగా? రైల్వేస్ తండ్రి పేరేంటి?.. ప్రశ్నలు చాలా కొత్తగా, అంతకంటే చెత్తగా ధ్వనిస్తున్నాయి కదా. కానీ వీటికి సమాధానాలు రాస్తే తప్ప ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నిధులురాని పరిస్థితి. వివరాలివి..

ఇంకా చదవండి ...
దేశంలో ప్రజారవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఇండియన్ రైల్వేస్‌ (Indian Railways)కు లింగ నిర్ధారణ ఉందా? ఇంతకీ రైల్వేస్ ఆడా? మగా? రైల్వేస్ తండ్రి పేరేంటి?.. ప్రశ్నలు చాలా కొత్తగా, అంతకంటే చెత్తగా ధ్వనిస్తున్నాయి కదా. చదివిన మనకే ఇలా ఉంటే, ఆ ప్రశ్నలు ఎదుర్కొంటోన్న అధికారుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే (south central railwasy) పరిధిలోకి వచ్చే తెలంగాణలో సికింద్రాబాద్ తర్వాత అతిపెద్ద జంక్షన్ కాజీపేటలో రైల్వే వర్క్‌షాప్‌ ఏర్పాటుకు సంబందించి గొప్ప చిక్కొచ్చిపడింది. కేసీఆర్ సర్కారు కేటాయించిన భూమి రైల్వే పేరిట బదిలీకాని వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ధరణి పోర్టల్(Dharani portal)లో భూములు బదిలీ అయితే తప్ప పనులు ప్రారంభించే వీలులేని, అలా జరక్కుంటే ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ లో నిధులు వచ్చే అవకాశం లేని వ్యవహారం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి సాక్షి దినపత్రిక కీలక కథనాన్ని ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం..

దక్షిణమధ్య రైల్వేకు తండ్రి పేరు ఏం రాయాలి? పుట్టిన తేదీ కాలమ్‌లో ఏం నింపాలి? ఇంతకీ ఆడా, మగా అనే చోట ఏం రాయమంటారు? ..కాజీపేట రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీ భూమి యాజమాన్య మార్పిడి కోసం రెవెన్యూ సిబ్బంది అడిగిన ప్రశ్నలివి. వీటికి ఎలాంటి సమాధానం లేదు. ఆ వివరాలను నమోదు చేయకుండా లావా దేవీ నిలిచిపోయింది. 'ధరణి' పోర్టల్‌లోని టెక్నికల్ అడ్డంకుల వల్ల తెలంగాణలో కీలక రైల్వే ప్రాజెక్టు జాప్యం అవుతోంది. అంతా సవ్యంగా జరిగి ఉంటే.. వచ్చేనెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో కాజీపేట రైల్వే ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు జరిగి ఉండే దని అధికారవర్గాలే చెప్తున్నాయి. భూమికి సంబంధించిన కోర్టు కేసులతో దాదాపు 13 ఏళ్లుగా జరుగుతున్న జాప్యం.. ఇప్పుడు ధరణి వల్ల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయని కథనంలో పేర్కొన్నారు.

lockdown : రేపట్నుంచే కఠిన ఆంక్షలు!.. నైట్ కర్ఫ్యూ, ఆన్‌లైన్ క్లాసులపై cm kcr నిర్దేశం నేడు


సమస్య ఎక్కడుంది?
దాదాపు 13 ఏళ్ల కింద కాజీపేటకు రైల్వే వ్యాగన్‌ వీల్‌ ఫ్యాక్టరీ మంజూరైంది. కాజీపేట సమీపంలోని మడి కొండలో ఉన్న సీతారామస్వామి దేవాల యానికి చెందిన 150 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఏళ్లకేళ్లు జాప్యం జరిగింది. ఈ లోగా రైల్వేశాఖ ఆ ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి మార్చింది. తర్వాత దానిస్థానంలో రూ.383.05 కోట్ల వ్యయ అంచనాతో వ్యాగన్‌ ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపును 2016లో మంజూరు చేసింది. రైల్వే బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు భూమిని కేటాయించకపోవడంతో ఆ నిధులు విడుదల కాలేదు. ఇన్నేళ్ల తర్వాత గత ఏడాది కోర్టుకేసు పరిష్కారమై.. రైల్వేకు భూమిని అప్పగించేందుకు మార్గం సుగమమైంది. నిబంధనల ప్రకారం.. ఆ భూమి పూర్తిగా రైల్వే పేరిట ట్రాన్స్‌ఫర్‌ కావాలి, ఆ తర్వాతే ఫ్యాక్టరీ పనులు చేపడతారు. రైల్వే అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర అధికారులకు చెప్పారు కూడా. కానీ ధరణిలో గందరగోళంతో సమస్య వచ్చి పడిందని కథనంలో రాశారు.

Shocking: స్నేహితులతో కలిసి అసహజరీతిలో భార్యపై గ్యాంగ్ రేప్.. మర్మాంగాలను సిగరెట్లతో కాల్చి..సంస్థల పేరిట నమోదుకు చాన్స్‌ లేక..
ధరణిలో వ్యక్తుల వివరాలు నమోదు చేసే వెసులుబాటు ఉందేతప్ప.. సంస్థల పేరిట నమోదు చేసే అవకాశం లేదు. పేరు, తండ్రిపేరు, ఆడా/మగ, పుట్టిన తేదీ, వాటి తాలూకు ఆధారాలు వంటి వివరాలను సంస్థలకు అన్వయించడం కుదరదు. దీనివల్ల రైల్వేకు కేటాయించిన భూముల వివరాలు ధరణిలో చేరడం లేదు. ఇప్పటికే దాదాపు ఎనిమిది నెలల సమయం గడిచిపోయినా.. అధికారులు చిక్కు ముడిని విప్పలేకపోయారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్‌ దగ్గరపడింది. ప్రాజెక్టు భూమి రైల్వే పేరిట ట్రాన్స్‌ఫర్‌ కాకపోవడంతో ఈసారి కూడా నిధులు కేటాయించే అవకాశం లేనట్టేనని, మరో ఏడాది వృధా అవుతుందని రైల్వే అధికారులు సాక్షికి తెలిపినట్లు పేర్కొన్నారు.

CM KCR: మరో సంచలనం.. పాలనలో భారీ ప్రక్షాళన.. జీవో 317 సక్సెస్.. తర్వాతి స్టెప్ ఇదే..అయితే రెవెన్యూ అధికారులు త్వరగా సమస్యను కొలిక్కి తెచ్చి.. భూమిని రైల్వే పేరిట మార్చితే కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఇక మరో 11 ఎకరాల భూమికి సంబంధించి కూడా కొంత సమస్య నెలకొంది. అందులో పదెకరాలు పరిష్కారమైందని, ఇంకో ఎకరం కేటాయింపు త్వరలో అవుతుందని రెవెన్యూ అధికారులు వివరిస్తున్నారు. అయితే అంతా కలిపి ఇస్తేనే లెక్కగా ఉంటుందని, అసలు భూమి రానప్పుడు ప్రాజెక్టులో కదలికకు అవకాశం ఉండదని రైల్వే అధికారులు చెప్పినట్టు తెలిపారు.

ఫలించిన Revanth reddy రిక్వెస్ట్ -24న కాంగ్రెస్‌లోకి డీఎస్ -నమ్మకద్రోహులకు మళ్లీ నీడా?ఏమిటీ ప్రాజెక్టు?
రైల్వేలో వినియోగిస్తున్న గూడ్స్‌ వ్యాగన్లను నిర్ణీత సమయంలోగానీ, మరమ్మతులు వచ్చినప్పుడుగానీ సరిచేసి.. పూర్తిస్థాయిలో సిద్ధం చేయడం ఓవర్‌హాలింగ్‌ వర్క్‌షాపు పని. కాజీపేటలో చేపట్టదలచిన ఈ వర్క్‌షాప్‌లో నెలకు వంద గూడ్సు వ్యాగన్లను ఓవర్‌ హాలింగ్‌ చేసే సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. దీనితో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి దక్కుతుందని అంచనా.
Published by:Madhu Kota
First published:

Tags: India Railways, South Central Railways

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు