Home /News /trending /

DOES ANY MARRIAGE DO LIKE THIS IN WHICH THERE WAS NO BAND NO CRACKERS BURST SSR

Marriage: ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ఎన్నో పెళ్లిళ్లు జరుగుతుండగా ఈ కొత్త జంట పెళ్లే ఎందుకు ప్రత్యేకమంటే..

కొత్త జంట

కొత్త జంట

ఒకప్పుడు పెళ్లిళ్లంటే వేదమంత్రాల సాక్షిగా, మంగళవాయిద్యాల నడుమ బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఆహ్లాదంగా జరిగేవి. కానీ.. మారుతున్న కాలంతో పాటే పెళ్లి జరిగే పద్ధతిలో కూడా మార్పులొచ్చాయి.

  ఒకప్పుడు పెళ్లిళ్లంటే వేదమంత్రాల సాక్షిగా, మంగళవాయిద్యాల నడుమ బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఆహ్లాదంగా జరిగేవి. కానీ.. మారుతున్న కాలంతో పాటే పెళ్లి జరిగే పద్ధతిలో కూడా మార్పులొచ్చాయి. ఇప్పుడు పెళ్లంటే.. డీజేలు, తీన్మార్ డ్యాన్స్‌లు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కలిసి వాళ్ల పెళ్లిలోనే స్టెప్పులు.. బాగా డబ్బున్న వాళ్లైతే సంగీత్ పేరుతో రాత్రంతా అందరితో కలిసి జోరుగా డ్యాన్స్‌లు, పెళ్లి కొడుకు తాళి కట్టగానే గాల్లో పేలే టపాసులు.. ఇలా ఒక్కమాటలో చెప్పాలంటే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అట్టహాసంగా పెళ్లి చేసుకునేందుకు ఈరోజుల్లో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అలాంటి ట్రెండ్ నడుస్తున్న ఈరోజుల్లో నాగ్‌పూర్‌లో ఓ జంట చేసుకున్న పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాళ్ల పెళ్లిలో బ్యాండ్ బాజాల్లేవు. పెళ్లిలో ఎలాంటి హంగామా లేదు. ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి బంధువులొచ్చారు. వారి సమక్షంలో వధూవరులు దండలు మార్చుకున్నారు. ఇద్దరు కలిసి కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతే.. పెళ్లయిపోయింది.

  అయితే.. ఈ పెళ్లిలో చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే.. పెళ్లి పేరుతో ఈ జంట పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించలేదు. చివరికి మొక్కలకు కూడా ప్రాణముంటుందని భావించిన ఈ జంట పెళ్లిలో కూడా ఎలాంటి పూలను వాడలేదు. పూలమాల, పూజలు తప్ప పెళ్లిలో అంతకు మించి పూలను వినియోగించలేదు. ఈ పెళ్లి చేసుకున్న జంటకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌కు చెందిన జుహీ సామాజిక కార్యకర్త అయిన మంజుష కుమార్తె. ‘నో ప్లాస్టిక్’ ఉద్యమంలో జుహీ కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జుహీకి పెళ్లి కుదిరింది.

  అయితే.. పెళ్లి పేరుతో అందరిలా టపాసులు పేల్చుతూ.. డీజేలు పెట్టి పర్యావరణాన్ని కాలుష్యం చేయకూడదని జుహీ, ఆమె తల్లి భావించారు. పర్యావరణ సహితంగా జుహీ పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ విషయాన్ని వరుడికి, అతని కుటుంబానికి తెలియజేసింది. ఆ కుటుంబం కూడా ఈ నిర్ణయానికి అంగీకారం తెలపడంతో జుహీ పెళ్లి ఎకో-ఫ్రెండ్లీగా జరిగింది. పెళ్లి ఆచారసాంప్రదాయాల ప్రకారమే జరిగింది. కానీ.. ఎలాంటి హంగామా లేదు. ప్రశాంత వాతావరణంలో.. ప్రకృతికి ఎలాంటి హాని తలపెట్టకుండా పెళ్లి జరిగింది. శబ్ద కాలుష్యానికి చోటు లేదు. వాయు కాలుష్యం మాటేలేదు.

  ఇది కూడా చదవండి: Bride: పెళ్లై 16 రోజులైనా కాలేదు.. ఆమె ఊహించింది ఒకటి.. జరిగింది మరొకటి..

  పెళ్లి గురించి వధూవరుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఈ పెళ్లిలో ప్లాస్టిక్‌ను నిషేధించామని, బ్యాండ్, క్రాకర్స్, డ్యాన్స్‌లుపాటల పేరుతో శబ్ద కాలుష్యానికి పాల్పడే అవకాశం లేకుండా.. పెళ్లి మండపాన్ని కూడా ఎకో-ఫ్రెండ్లీగా రూపొందించినట్లు చెప్పారు. ఈ పెళ్లిలో డెకరేషన్‌కు వినియోగించినవన్నీ పేపర్‌కు సంబంధించినవే కావడం విశేషం. పెళ్లికి ఆహ్వాన పత్రిక కూడా పూర్తి పర్యావరణ సహితంగా ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారైన పేపర్‌పై ముద్రించినట్లు పెళ్లి కుమార్తె తండ్రి మకరంద్ పండరిపాండే తెలిపారు. కొత్తగా జరిగిన ఈ పెళ్లి ఆదర్శంగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోజురోజుకూ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యానికి ఢిల్లీలో పరిస్థితి ఎలా తయారైందో మనకు కనిపిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ సహితంగా జరిగిన ఈ పెళ్లి చేసుకున్న జంటను నిండు మనసుతో ఆశీర్వదించకుండా ఉండగలమా.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Arrange marriage, Maharashtra, Marriage, VIRAL NEWS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు