హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో.. మహిళ పొట్టలో నుంచి 55 బ్యాటరీలను బైటకు తీసిన వైద్యులు.. ఎక్కడంటే..

వామ్మో.. మహిళ పొట్టలో నుంచి 55 బ్యాటరీలను బైటకు తీసిన వైద్యులు.. ఎక్కడంటే..

మహిళ పొట్టలో బ్యాటరీలు

మహిళ పొట్టలో బ్యాటరీలు

Viral news:  మహిళ పొట్ట ఒక్కసారిగా ఉబ్బిపోయింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఎక్స్ రే చేసిన వైద్యులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

కొందరు ప్రతి చిన్న విషయాలకు కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. ఉద్యోగం రాలేదని, ఎగ్జామ్ పాస్ కాలేదని, సెల్ ఫోన్ కొనివ్వలేదని సూసైడ్ లు చేసుకుంటుంటారు. మరికొందరు లవ్ లో ఫెయిల్ అయ్యామని ఇక సిల్లీ రిజన్స్ లతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే.. ఇలా చేస్తు నూరేళ్ల తమ జీవితాన్నిఅర్థంతరంగా ముగించేస్తారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఐర్లాండ్ లో (Ireland ) షాకింగ్ ఘటన జరిగింది. డుబిన్ లోని సెయింట్ విన్సెంట్ యూనివర్శీటి ఆస్పత్రిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. 66 ఏళ్ల మహిళ పొట్టలో నుంచి వైద్యులు 55 బ్యాటరీ లను బయటకు తీశారు. కాగా, మహిళ కొన్ని రోజులుగా తీవ్రమైన ఒత్తిడికి గురౌతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె.. ఎవరికి తెలియకుండా గదిలో బ్యాటరీలను మింగింది. ఈ విధంగా సూసైడ్ చేసుకోవాలనిప్లాన్ వేసింది. అయితే.. ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి రావడం, కడుపు ఉబ్బటంతో వైద్యులు ఆస్పత్రికి తరలించారు.

ఆమెకు ఎక్స్ రే తీశారు. ఆమె 55ఎఎ, ఏఏఏ, బ్యాటరీలను మింగినట్లు డాక్టర్లు గుర్తించారు. సర్జన్లు ఆమె కడుపు ద్వారా ఒక చిన్న రంధ్రం కట్ చేసి, అవయవం నుండి AA మరియు AAA రెండింటితో సహా 46 బ్యాటరీలను తొలగించారు. పెద్దప్రేగులో చిక్కుకున్న మిగిలిన నాలుగు బ్యాటరీలు ఆమె పురీషనాళంలోకి "పాలు" చేయబడ్డాయి మరియు పాయువు ద్వారా తొలగించబడ్డాయి - మొత్తం మింగబడిన బ్యాటరీల సంఖ్య 55కి చేరుకుంది. ఈ ఘటన పట్ల వైద్యులుసైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలిసినంతవరకు, ఈ కేసు ఒకే సమయంలో తీసుకున్న అత్యధిక బ్యాటరీల సంఖ్యను సూచిస్తుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా (Viral news) మారింది.

ఇదిలా ఉండగా కొందరు వ్యక్తులు సరదాగా బోట్ లో సముద్రంలోనికి వెళ్లారు.

వారంతా లైఫ్ జాకెట్ లు వేసుకుని మరీ ఉన్నారు. అయితే.. వారిలో ఒక వ్యక్తికి అరుదైన చేప చేతికి చిక్కింది. వెంటనే తన తన ప్యాకెట్ లోని ఫోన్ ను బయటకు తీశాడు. ఆ తర్వాత.. వెంటనే అనేక యాంగిల్స్ లో, చేపతో ఫోటోలు దిగాడు. అంతే కాకుండా రకరకాల స్టిల్స్ తో పోజులిచ్చాడు. అయితే.. తన కోరిక తీర్చుకుని చివరకు చేపను సముద్రంలో వదిలేద్దామనుకున్నాడు.

అంతలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. అతని ఒక చేతిలో చేప, మరోక చెతిలో ఫోన్ ఉన్నాయి. కానీ అతను తత్తర పాటులో.. చెపను సముద్రంలో పడేయాల్సింది కాస్త.. మొబైల్ ఫోన్ ను పాడేశాడు. వెంటనే తెరుకుని నీళ్ల వంక షాక్ తో చూశాడు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఫోన్ నీళ్లలోనికి పడిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ గా (Viral video)  మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఊకో.. ఊకో.., కష్టాలు మనకే వస్తాయిలే.. అంటూ.. ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.

First published:

Tags: Attemp to suicide, VIRAL NEWS

ఉత్తమ కథలు