కార్పొరేట్ ఆసుపత్రుల్లో సర్జికల్ స్పెషలిస్ట్‌లు, అత్యాధునిక పరికరాలు, జనరేటర్, పారా మెడికల్ సిబ్బంది ఉంటేనే రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అలాంటిది పేషెంట్‌కి సర్జరీ చేస్తుండగా భూకంపం వస్తే ఎలా ఉంటుంది.? ఆ ప్రభావంతో ఒక నిమిషం పాటు కరెంట్ పోతే పేషెంట్ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోండి. జమ్మూ కశ్మీర్(Jammu and kashmir)అనంతనాగ్‌లో మంగళవారం స్వల్ప భూకంపం (Earthquake)సంభవించింది. సుమారు 40సెకన్లు అంటే నిమిషం వరకు ప్రకంపనలు సంభవించాయి. అదే సమయంలో బిజ్బిహారా(Bizbihara)లోని ఉప జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ఓ పేషెంట్‌కి ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ మధ్యలో ఉండగానే కరెంట్ పోవడంతో వైద్యులు షాక్ అయ్యారు. అయితే ఆందోళన చెందకుండా పారామెడికల్ సిబ్బంది సహాయ, సహకారాలు తీసుకున్నారు. బెడ్ మీద ఉన్న పేషెంట్ ప్రాణాలు కాపాడటానికి తమ అనుభవంతో పాటు..ధైర్యాన్ని పణంగా పెట్టారు.
రోగి ప్రాణాలు నిలబెట్టిన తీరు..
ఏ పేషెంట్‌కైనా ఆపరేషన్ అంటేనే ఏదో తెలియని భయం ఉంటుంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటిది బెడ్‌పైన పేషెంట్ ఉండగా..సర్జరీ సగం మధ్యలో భూకంపం సంభవించి కరెంట్ పోయింది. రోగికి సర్జరీ చేస్తున్న డాక్టర్లు ఏమాత్రం భయపడకుండా..వెంటనే పారా మెడికల్ సిబ్బంది సహాయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్లోని బిజ్బిహారాలోని జిల్లా ఆసుపత్రిలో ఈఘటన చోటుచేసుకుంది. భూకంపం వచ్చి నిమిషం పాటు కరెంట్ పోయిన సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు రోగికి ఎలాంటి వైద్యం అందించారో తెలియజెప్పేందుకు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైద్య సిబ్బందికి అభినందనలు..
మంగళవారం అఫ్గనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతానికి ఆగ్నేయంగా 40కిలో మీటర్లు దాదాపు 190కిలో మీటర్ల లోతులో భూమి కంపించిందని యూఎస్ జియోలాజికల్ సర్వీస్ అంచనా ప్రకారం అక్కడ భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. దాని ప్రభావం కారణంగానే బిజ్బిహారా జిల్లా ఆసుపత్రిలో రోగికి వైద్యం చేసిన తీరును సీఎంవో అధికారులు సైతం అభినందించారు. బలమైన భూకంపం వచ్చినప్పటికీ, వైద్యులు మరియు పారామెడిక్స్ బృందం ధైర్యం మరియు సమతుల్యతను కోల్పోకుండా శస్త్రచికిత్సను కొనసాగించారు. అదే సమయంలో, CMO అనంతనాగ్ తన ట్విట్టర్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. దీనితో పాటు, ఈ ధైర్యసాహసాల కోసం అతను శస్త్రచికిత్స బృందాన్ని కూడా అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, National News, VIRAL NEWS, Viral Video