Home /News /trending /

Viral: ఆరు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తి.. కడుపులో ఏముందో చూసి షాకయిన డాక్టర్లు

Viral: ఆరు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తి.. కడుపులో ఏముందో చూసి షాకయిన డాక్టర్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈజిప్టులోని అశ్వన్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌కు ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చాడు. ఆరు నెలలుగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడని చెప్పారు. డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు, చేసి చివరకు ఎక్స్‌-రే కూడా తీశారు. ఆ ఎక్స్‌-రే చూసిన తర్వాత ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

ఇంకా చదవండి ...
పొరపాటున రూపాయి బిళ్ల, పిన్నీసు, ఇంకేదో మింగేవాళ్లను మనం చూస్తుంటాం. కానీ సెల్‌ ఫోన్‌ మింగడం అంటే నిజంగా విడ్డూరమే. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈజిప్టుకు చెందిన ఒక వ్యక్తి నిజంగానే సెల్‌ఫోన్ మింగేశాడు. పైగా అది సహజంగానే బయటకు వస్తుందని భావించి ఇన్నాళ్లూ హాస్పిటల్‌కు కూడా వెళ్లలేదట.

వివరాల్లోకి వెళ్తే.. ఈజిప్టులోని అశ్వన్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌కు ఈ మధ్య ఒక వ్యక్తి వచ్చాడు. ఆరు నెలలుగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడని చెప్పారు. డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు, చేసి చివరకు ఎక్స్‌-రే కూడా తీశారు. ఆ ఎక్స్‌-రే చూసిన తర్వాత ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

ఆరు నెలల క్రితం సదరు వ్యక్తి సెల్‌ఫోన్‌ మింగేశాడట. అది సహజంగానే బయటకు వస్తుందిలే అని నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఆస్పత్రికి వెళ్లి ఆ విషయం చెప్పి చికిత్స చేసుకోవడం అతనికి నామోషీగా అనిపించి, ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదట. దీంతో ఆరు నెలలు కడుపు నొప్పితో తల్లడిల్లాడు. రోజు రోజుకూ నొప్పి తీవ్రమవుతుండటంతో ఆస్పత్రికి రాక తప్పలేదు. ఎట్టకేలకు అశ్వన్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ వైద్యులు ఆపరేషన్‌ చేసి అతని కడుపు నుంచి సెల్‌ఫోన్‌ బయటకు రాశారు. ఆరు నెలలుగా ఫోన్‌ ఒంట్లో ఉండిపోవడంతో అతని కడుపులో, పేగుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ అయింది. కడుపులో ఫోన్ ఉండటంతో అతని శరీరం ఆహారాన్ని గ్రహించలేకపోయిందని అశ్వన్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అష్రాఫ్‌ మాబాద్‌ తెలిపారు.

ఇది కూడా చదవండి: Sad: ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’ వీడియోతో వైరల్ అయిన యువకుడిపై దాడి.. ఎంతలా కొట్టారంటే..

అసలు విషయం ఏంటంటే.. ఈ ఫోన్‌ మింగిన వ్యక్తి ఒక జైల్లో ఖైదీ. జైల్లో రహస్యంగా ఫోన్‌ మాట్లాడుతూ ఉంటాడట. ఫోన్లు మింగడం తనకు అలవాటేనని, అది మలంలో బయటకు వచ్చేస్తుందని అతడు వైద్యులతో చెప్పాడట. అయితే ఈ సారి అతను ఫోన్‌ను ఒక ప్లాస్టిక్‌ బ్యాగులో ఉంచి మింగేశాడు. ప్లాస్టిక్‌ కారణంగా అతని కడుపుకు ఫోన్‌ అతుక్కుపోయి బయటకు రాలేదు. దీంతో ఆరు నెలల పాటు తీవ్ర అవస్థపడ్డాడు. ఇప్పుడు ఆపరేషన్ తర్వాత అతను కోలుకుంటున్నాడు.

ఆ ఖైదీ కడుపులో నుంచి తీసిన ఫోన్‌ను డాక్టర్లు పోలీసులకు అందజేశారు. ఈజిప్టులో ఈ తరహా ఫోన్లు మింగడం కొత్తేమి కాదు. గతేడాది సెప్టెంబర్‌లోనూ ఒక యువకుడి కడుపుల్లోంచి డాక్టర్లు సెల్‌ఫోన్‌ బయటకు తీశారు. అది అతని కడుపులో ఏడు నెలలు ఉంది.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Trending, Trending news, Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు