ముద్దే మృత్యువు... ప్రాణం తీసిన కిస్... యువతి మృతి

ముద్దు వల్ల ఎన్నో లాభాలుంటాయి. అది సాధారణ మనుషులకు. ఆమె ప్రత్యేకమైన యువతి. అందుకే ముద్దు ఆమె ప్రాణాలు తీసింది. ఇదెలా జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: July 28, 2020, 11:16 AM IST
ముద్దే మృత్యువు... ప్రాణం తీసిన కిస్... యువతి మృతి
ముద్దే మృత్యువు... ప్రాణం తీసిన కిస్... యువతి మృతి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అమెరికా... ఫ్లోరిడాలో జరిగిందీ విషాద ఘటన. 17 ఏళ్ల అరియానా రే డాల్ఫ్స్‌కి ఉన్నట్టుండి ఆరోగ్యం దెబ్బతింది. తలనొప్పి, గొంతులో మంట వచ్చాయి. అది సాధారణ జ్వరం కావచ్చని ఆమె పేరెంట్స్ భావించారు. పైగా... అరియానా మామూలు అమ్మాయి కాదు. అథ్లెట్. చాలా ఫిట్‌గా ఉంటూ... ఎప్పటికప్పుడు వర్కవుట్స్ చేస్తూ... చెలాకీగా ఉండేది. అందువల్ల టేక్ కేర్ అన్నారే తప్ప... ఏ ఆస్పత్రికీ తీసుకెళ్లలేదు. ఆమె కూడా... చిన్న ప్రాబ్లమే డోంట్ వర్రీ అంటూ పేరెంట్స్‌కి చెబుతూ ఉండటంతో... వాళ్లు తేలిగ్గా తీసుకున్నారు. గత వారం అరియానా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆమె నడవలేకపోతుంటే... ఆశ్చర్యపోయిన పేరెంట్స్... హడావుడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఏమైందో తెలీదు. ఎందుకు అలా అయ్యిందో అర్థం కాదు. డాక్టర్లేమో ఏదీ చెప్పకుండా... సినిమాల్లో చూపించినట్లు అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నారు. పేరెంట్స్‌కి టెన్షన్ పెరగసాగింది. మధ్యలో ఓసారి డాక్టర్లు ఏదో మీటింగ్ ఉందని ఇప్పుడే వచ్చేస్తామని వెళ్లారు. ఆ టైంలో పేరెంట్స్ ఆమె ఉన్న గదిలోకి చూశారు. తల్లిదండ్రుల్ని చూసిన అరియానా వాళ్లను లోపలికి పిలిచింది. తాను బాత్‌రూంకి వెళ్దామనుకుంటే... అసలు కాళ్లు, వేళ్లూ కదపలేకపోతున్నానని చెప్పింది. తనకు కాళ్లు ఉన్నట్లే అనిపించట్లేదని అంది. అసలే షాక్‌లో ఉన్న పేరెంట్స్‌ ఆమె చెప్పింది విన్నాక... మరింత షాక్ అయ్యారు. వెంటనే పేరెంట్స్... తమ అమ్మాయికి ఏమైందో చెప్పాలని నిలదీశారు. డాక్టర్లు... ఇది మామూలు సమస్య కాదు... ఆమెకు స్ట్రోక్ తగిలింది... ఉండండి... కంగారు పెట్టకండి... అంటూ... ఆమెను హెలికాప్టర్ అంబులెన్స్‌లో జాక్సన్‌విల్లేకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దాసుపత్రికి తరలించారు.

అక్కడకు వెళ్లాక... అరియానా ఏదేదో మాట్లాడటం మొదలుపెట్టింది. అసలు ఏమంటోందో కూడా పేరెంట్స్‌కి అర్థం కాలేదు. అక్కడి ఓ సీనియర్ డాక్టర్‌కి విషయం అర్థమైంది. ఆయన పేరెంట్స్‌ని పక్కకి పిలిచి... మీ అమ్మాయికి ఎప్స్టీన్ బార్ వైరస్ సోకింది అన్నాడు. పేరెంట్స్ ఆల్రెడీ షాకింగ్ ఫేసుతోనే ఉన్నారు కాబట్టి... కొత్తగా ఏ హావభావాలూ చూపించలేకపోయారు. డాక్టర్ వెంటనే... మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఆమెకు కిస్సింగ్ డిసీజ్ సోకింది అన్నాడు. అప్పుడు వాళ్లు కాస్త ఆశ్చర్యంగా చూశారు. ఈ వ్యాధి వల్ల అరియానా బ్రెయిన్ వాచిపోయింది. ఇప్పుడు అది పనిచెయ్యట్లేదు అన్నాడు. అందుకే ఆమె అలా మాట్లాడుతోంది అన్నాడు. పేరెంట్స్‌ షాకులోనే ఉన్నారు.

అరియానాపై ఆశలు వదులుకోవాల్సిందే. ఆమెను మొదటే ఆస్పత్రికి తెచ్చి ఉంటే బాగుండేది. చాలా ఆలస్యమైంది అన్నాడు. ఇంతలో ఓ డాక్టర్ వచ్చి... చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే సీనియర్ డాక్టర్... అదే నేనూ చెబుతున్నాను. అంటూ పేరెంట్స్ వైపు చూసి... ఐ యామ్ సారీ... షి డైడ్ అంటూ... మరణ వార్త చెప్పాడు. తల్లిదండ్రులకు ఆశ్చర్యం, విషాదం, అయోమయం, కన్నీళ్లు, ఆవేదన అన్నీ ఒకేసారి వచ్చాయి. డాక్టర్లు కోరడంతో... అరియానా అవయవాల్ని ఇతర పేషెంట్లకు ఇచ్చేందుకు పేరెంట్స్ ఒప్పుకున్నారు.

కిస్సింగ్ డిసీజ్ అంటే ఏమిటి? :
ఈ వ్యాధిని ‘మోనోన్యుక్లియోసిస్’ లేదా ‘మోనో’ అని కూడా అంటారు. ఇది ఎప్స్టీన్ బార్ వైరస్‌ (Epstein Barr Virus-EBV) ద్వారా సోకుతుంది. జనరల్‌గా మనుషుల ఉమ్మి నుంచి వ్యాపిస్తుంది. పెదవులతో ముద్దు పెట్టుకునే వారికి ఈ వ్యాధి వచ్చే ఛాన్సుంది. ఇది అరుదైన వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు తినే ఆహారాన్ని ఇతరులు తిన్నా, వాడిన గ్లాసులు ఇతర వస్తువుల్ని ఇతరులు వాడినా... వాళ్లకూ వ్యాధి సోకుతుంది. సో... ముద్దు అన్నిసార్లూ ముద్దు కాదు. ఒక్కోసారి అది మృత్యువు కూడా కాగలదని ఈ ఘటన చెబుతోంది.
Published by: Krishna Kumar N
First published: July 28, 2020, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading