Karthika Deepam: బుల్లితెరపై స్టార్ మాలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ గురించి ఏ ఇంటి ఆడపడుచునైనా అడగండి.. వెంటనే సీరియల్ గురించి ఏకంగా పుస్తకంనే వారి మాటలతో నింపేస్తారు. స్టార్ మా లో ఈ సీరియల్ కు ఉన్న రేటింగ్ అంతా ఇంతా కాదు. ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ కు ఎక్కువ టీఆర్పీ ఉంది. ఇక ఇందులో నటించే నటీనటుల గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండనే ఉండరు.
వంటలక్క, డాక్టర్ బాబు గా ఉన్న దీప, కార్తీక్ లు. 2017 లో ప్రారంభమైన ఈ సీరియల్. ప్రస్తుతం మంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇక దీప, కార్తిక్ ల పాత్రలు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. ఒక అబద్ధపు మాట వల్ల దీప, కార్తీక్ ల మధ్య దూరం పెరిగి విడిపోయారు. ఇక కార్తీక్, దీప కు కలిసి పుట్టిన పిల్లలు కార్తీక్ తన పిల్లలు కాదని, ఇక తనకు పిల్లలు పుట్టరని ఓ అబద్ధపు ప్రచారం వల్ల అదే నిజమని ఆ మాయలో ఉంటాడు కార్తీక్. ఈ విషయం గురించి దీప ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఉంటాడు కార్తీక్. ఇక ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న వీరిద్దరూ.. ఈమధ్య కాస్త దగ్గర అవుతున్నట్లుగా అనిపించడంతో.. ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారింది.
తాజాగా దీప ఆరోగ్యం బాలేనందున హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి తనను కోరగా.. నిరాకరిస్తుంది దీప. దీంతో తన హెల్త్ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లి అన్ని విషయాలు తెలుసుకుంటాడు కార్తీక్. ఇక ఆమె బతకడం కష్టం అని డాక్టర్ చెప్పగా.. తన వెంట తీసుకెళ్లిన మోనిత లోలోపల సంతోషంగా ఉంటుంది. కానీ కార్తీక్ దీప ఆరోగ్యంపై చూపిస్తున్న ప్రేమ, అంతే కాకుండా తన ఇంటికి తీసుకెళ్లి తనకు భర్తగా అన్ని చేయగా.. తన భార్య ఆరోగ్యం పట్ల టెన్షన్ పడిపోతాడు. ఇక ఆ తర్వాత మోనిత ఏం చేస్తుందో ఎపిసోడ్ వరకు ఆగాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka