హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Cow Dung : ఆవు పేడ తిన్నాడు -అదే బలమంటున్నాడు -Haryana డాక్టర్ నిర్వాకం -viral video

Cow Dung : ఆవు పేడ తిన్నాడు -అదే బలమంటున్నాడు -Haryana డాక్టర్ నిర్వాకం -viral video

లైవ్ లో ఆవు పేడ తింటోన్న డాక్టర్ మనోజ్ మిట్టల్

లైవ్ లో ఆవు పేడ తింటోన్న డాక్టర్ మనోజ్ మిట్టల్

ఆవు గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా పేడ తిన్నాడో డాక్టర్. ఎంబీబీఎస్ పట్టా, ఎండీ హోదాలో చిన్నపిల్లల స్పెషలిస్టుగా క్లినిక్ కూడా నడుపుతోన్న ఆయన.. గర్భిణిలు సహా ప్రజలంతా రోజూ పేడ తినాలని, గో మూత్రం తాగాలని సూచించారు. హర్యానాకు చెందిన డాక్టర్ మనోజ్ మిట్టల్ పేడ తినే వీడియో విపరీతంగా వైరలైంది..

ఇంకా చదవండి ...

భారతీయులు పవిత్రమైనదిగా భావించే ఆవు వల్ల అనేక లాభాలుంటాయని, ఆవు పేడ, మూత్రంలో రోగాలు నయం చేసే గుణాలు ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. అయితే, సైన్స్ మాత్రం ఆ వాదనను అంగీకరించదు. అయితే భిన్నవాదనను ఖండిస్తూ, నిజంగా ఆవు పేడ (Cow Dung) వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదని నిరూపించే ప్రయత్నంలో భాగంగా లైవ్ లోనే పేడ తిని చూపించాడొ వైద్యుడు. ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకుని, ఎండీగానూ పైచదువలు పూర్తి చేసి, పిల్లల స్పెషలిస్టుగా పనిచేస్తోన్న ఆ డాక్టర్ చేసిన పనికి లోకమంతా నివ్వెరపోతున్నది. ఆవు పేడ తింటోన్న డాక్టర్ గారి వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరలైపోయింది. వివరాలివి..

హర్యానాలోని కర్నాల్ సిటీకి చెందిన డాక్టర్ మనోజ్ మిట్టల్ స్థానికంగా పాపులర్ వ్యక్తి. చైల్డ్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ మనోజ్ కు కర్నాల్ లో పెద్ద క్లినిక్ ఉంది. ప్రసవాల కోసం, పిల్లల వైద్యం కోసం నిత్యం రోగులు వస్తుండటంతో బిజీగా ఉంటుందా ఆస్పత్రి. సైన్స్ సబ్జెక్టుతో ఎంబీబీఎస్, ఎండీ పూర్తిచేసి, డాక్టర్ గానూ రాణిస్తోన్న ఆయన.. తన విశ్వాసాలను మాత్రం వదులుకోలేదు. ఓ వైపు క్లినిక్ నడుపుతూనే..

shocking : మనవరాలి శవం పక్కనే.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం -కసి ఈనాటిది కాదంటూ..


గోశాలను కూడా నిర్వహిస్తుంటారు డాక్టర్ మనోజ్ మిట్టల్. ఆవు పట్ల విపరీతమైన మమకారాన్ని ప్రదర్శించే ఆయన.. ఆవు గురించి ఎవరేమన్నా ఊరుకోరు. తన దగ్గరకొచ్చే ప్రతివారికి.. ఆవు గొప్పతనాన్ని, అదిచ్చే పాలు, మూత్రం, పేడ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంటారు. ఆ క్రమలో ఎదుటి వ్యక్తి లైవ్ వీడియో తీస్తుండగా, ఆవు గురించి మాట్లాడుతూ.. అమ్మ కూడా ఇలానే చేసేదని గుర్తుచేస్తూ.. ఆవు పేడను చేతిలోకి తీసుకుని రెండు బుక్కలు తినేశారాయన. ఆ తర్వాత..

China : మరో 18 ప్రమాదకర వైరస్‌లు -చైనా మాంసం మార్కెట్లలో గుర్తించిన సైంటిస్టులు


దవడకు ఆవు పేడను అదిమి పెడుతూ.. ఆ పేడ తన మనసును, మెదడును, ఆత్మను శుద్దిచేస్తుందని చెప్పారు డాక్టర్ మనోజ్ మిట్టల్. ప్రతి ఒక్కరూ ఆవు పేడను తినాలని, గోమూత్రాన్ని తాగాలని హితవు పలికారాయన. నిత్యం పురుళ్లు, పిల్ల వైద్యాలతో బిజీగా ఉండే ఆయన.. గర్బిణిలు కూడా ఆవు పేడ తినాలని సూచించారు. గర్బంతో ఉన్న మహిళలు ఆవు పేడ తింటే గనుక సిజేరియన్ అవసరం లేకుండా నార్మల్ డెలివరీలో పిల్లలు పుడతారని డాక్టర్ మనోజ్ వివరించారు.

ఆవు పేడ తింటూ దాని వల్ల కలిగే ఉపగోయాలను వివరిస్తోన్న డాక్టర్ మనోజ్ మిట్టల్ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  విచిత్రం కాకుంటే, డాక్టర్ మిట్టల్ ఆవు పేడ తినడాన్ని సమర్థిస్తూ చాలా మంది కామెంట్లు పెట్టారు. కొందరు మాత్రం ఇది మతిలేని చర్య అని తిట్టిపోశారు. ‘డాక్టర్ మీరు తింటే తిన్నారుగానీ, మీ పేషెంట్లయిన గర్బిణిలు, పిల్లకు మాత్రం పేడ తినిపించకండి..’అని మరికొందరు హితవు పలికారు. ఒకరిద్దరైతే డాక్టర్ మనోజ్ మిట్టల్ లైసెన్స్‌ను భారత వైద్య మండలి రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మరి మీరేమంటారు?

Published by:Madhu Kota
First published:

Tags: Cow Dung, Doctors, Haryana, Viral vide

ఉత్తమ కథలు