• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • DOCTOR MAKES ZOOM COURT APPEARANCE WHILE PERFORMING SURGERY VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA NK GH

Doctor viral video: ఆపరేషన్ చేస్తూ కోర్టు మీటింగ్‌కి హాజరైన డాక్టర్... వైరల్ వీడియో..

Doctor viral video: ఆపరేషన్ చేస్తూ కోర్టు మీటింగ్‌కి హాజరైన డాక్టర్... వైరల్ వీడియో..

ఆపరేషన్ చేస్తూ కోర్టు మీటింగ్‌కి హాజరైన డాక్టర్ (image credit - twitter)

Doctor viral video: ఈ కరోనా వచ్చాక... పరిస్థితులు గతానికీ ఇప్పటికీ చాలా మారిపోయాయి. ముఖ్యంగా మీటింగ్‌లు వర్చువల్ రూపంలో జరుగుతున్నాయి. ఆ డాక్టర్ వీడియో మీరే చూడండి.

  • Last Updated:
  • Share this:
వైద్యో నారాయణో హరి.. అని మన పెద్దలు చెబుతుంటారు. భగవంతుడి తర్వాత అంత శక్తి ఉన్నది డాక్టర్లకే.. ఒక జీవికి ప్రాణం పోసే శక్తి ఉంది కాబట్టే వైద్యులను ఎంతో గౌరవిస్తూ ఉంటారు. అలాంటి ఓ డాక్టర్ చేసిన పనికి ఇప్పుడు నెటిజన్లంతా ఫైర్ అవుతున్నారు. ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తున్నారంటే ఆ వ్యక్తి ప్రాణాలు ఆ డాక్టర్ చేతిలో ఉన్నట్లే. ఆపరేషన్‌లో ఏ మాత్రం లోపం జరిగినా.. వ్యక్తి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. ఇంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా బాధ్యతారహితమైన పనిచేశాడా సర్జన్. అమెరికాలో ఓ ట్రాఫిక్ కోర్టులో విచారణ జరుగుతోంది. కరోనా కారణంగా కోర్టు కేసుల విచారణలన్నీ ఆన్‌లైన్‌లో జరుపుతున్నారు. ఓ ట్రాఫిక్ కేసులో ముద్దాయి అయిన ప్లాస్టిక్ సర్జన్ స్కాట్ గ్రీన్... సోమవారం వర్చువల్ కోర్టు విచారణకి హాజరు కావాల్సి ఉంది. అతను హాజరయ్యాడు కానీ ఆపరేషన్ థియేటర్ ఉండి హాజరయ్యాడు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియోలో ఒక్కొక్కరుగా అందరూ కోర్టు వర్చువల్ మీటింగ్‌లో జాయిన్ అవుతూ ఉన్నారు. స్కాట్ గ్రీన్ డ్రెస్ చూసిన జడ్జి... "మీరు కోర్టు విచారణకి అందుబాటులో ఉన్నారా?" అని అడగ్గా.. అవును అన్నాడు. "మీరు ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నట్లున్నారు" అంటే.. అవును అన్నాడు. ఎందుకలా అని అడగితే.. "నాతో పాటు మరో సర్జన్ కూడా ఉన్నారు. ఆయన సర్జరీ చేస్తున్నారు". అని గ్రీన్ చెప్పాడంతో మిగతా వారు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ జడ్జి "ఇది సరైన పద్ధతి కాదు. నేను మరో తేదీకి ఈ విచారణని వాయిదా వేస్తున్నాను. మీరు మీ పేషంట్లను అటెండ్ చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతూ వారి పరిస్థితి క్లిష్టంగా మార్చడం మాకు ఇష్టం లేదు" అన్నారు.


ఇది కూడా చదవండి: Forehead lines: తల రాతలకు అర్థమేంటి.. భవిష్యత్తును తెలుసుకోవచ్చా?

ఈ వీడియోని కొన్ని లక్షల మంది చూశారు. ఆ డాక్టర్‌పై మాల్ ప్రాక్టీస్ సూట్ వేసి లైసెన్స్ రద్దు చెయ్యాలని చాలా మంది కోరుతుంటే.. ఆపరేషన్ థియేటర్ నుంచి కోర్టు కేసుకు అటెండ్ కావాల్సినంత అవసరం ఏముంది? సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నాడా? అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కొందరు కాలిఫోర్నియాలోని మెడికల్ బోర్డుకి కంప్లైంట్ ఇచ్చారు. మెడికల్ బోర్డు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పింది.
First published:

అగ్ర కథనాలు