news18
Updated: November 16, 2020, 11:08 AM IST
image credits twitter
- News18
- Last Updated:
November 16, 2020, 11:08 AM IST
‘ఎవరి డ్రీమ్ వాళ్లు తీర్చుకుంటే కిక్కేముంది..? పక్కనోళ్ల డ్రీమ్ తీర్చుతేనే కదా కిక్కు..’.. టాలీవుడ్ లో రవితేజ నటించిన కిక్ చిత్రంలోని ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. అవునూ.. మన కల మనం నెరవేర్చుకుంటే పొందే ఆనందం కన్నా.. అవతలి వ్యక్తుల కలను తీర్చడంలో ఉండే కిక్కే వేరు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల కలలను తీర్చే సమయంలో వారి కళ్లల్లో కనిపించే ఆ కాంతిని.. ఎన్ని వేల కోట్లు సంపాదించిన పొందలేం. కిక్ సినిమా మాదిరిగానే ఇక్కడ ఒక డాక్టర్.. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి కలను నెరవేర్చాడు. హీరో దొంగతనాలేమీ చేయలేదు లెండి..!
ట్విట్టర్ లో ఒక వీడియో తెగ వైరల్ అవుతున్నది. అందులో ఒక డాక్టర్ చిన్నారి కలను నెరవేర్చడానికి బ్యాట్మెన్ లా అవతారమెత్తాడు. ఆ చిన్నారి క్యాన్సర్ తో బాధపడుతున్నది. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్ లో అందరి మనసులను గెలుచుకుంది.
క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక చిన్న పాపను.. ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్న ఒక యువ డాక్టర్.. నీకు బాగా నచ్చిందేమిటి..? అని అడిగాడు. దానికి ఆ చిన్నారి... ‘నాకు బ్యాట్మెన్ అంటే చాలా ఇష్టం.. నేను అతడిని కలవాలనుకుంటున్నాను..’ అని చెప్పింది. దీంతో ఆ డాక్టర్ మరేమీ ఆలోచించకుండా.. మరుసటి రోజు బ్యాట్మెన్ లా అవతారమెత్తి ఆ చిన్నారి ముందు ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన ఆ చిన్నారి పట్టరాని సంతోషంతో తన హీరో బ్యాట్మెన్ ను మనసారా ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో చూసిన వారంతా.. బావోధ్వేగ పోస్టులు పెడుతున్నారు.
ఈ వీడియో చూశాక మా గుండె బరువెక్కిందని కొందరు.. ఆ పాప బతకాలని కొందరు.. కామెంట్లు పెడుతున్నారు. మనం కూడా ఆ పాప బతకాలని ఆల్ ది బెస్ట్ చెబుతాం.
Published by:
Srinivas Munigala
First published:
November 16, 2020, 11:08 AM IST