news18-telugu
Updated: November 16, 2020, 8:14 PM IST
బ్యాట్స్‌మెన్ గెటప్‌లో డాక్టర్
వైద్యవృత్తిని ప్రాణప్రదంగా ప్రేమించే ఓ వైద్యుడు (doctor) తన పేషెంట్ కోసం ఏకంగా బ్యాట్ మ్యాన్ (batman) అవతారం ఎత్తాడు. క్యాన్సర్ (cancer తో బాధపడుతున్న ఓ చిన్నారి కోరిక తీర్చేందుకు డాక్టర్ తన తెల్ల కోటును వదిలి, బ్యాట్ మెన్ గెటప్ కోసం నల్ల డ్రెస్ ధరించి అందరి మన్ననలు పొందుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో (viral video) నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సూపర్ హీరో గెటప్ లో వచ్చిన డాక్టర్ చిన్నారిని మనస్ఫూర్తిగా హత్తుకునే వీడియో ట్విట్టర్లో తెగ షేర్ అవుతోంది. 'ద ఫీల్ గుడ్ పేజ్' (The feel good page) షేర్ చేసిన ఈ వీడియోకి అప్ లోడ్ చేసిన వెంటనే 5,000 పైగా వ్యూస్ వచ్చాయి. "నీ కల ఏంటం"టూ రోగిని అడిగిన డాక్టర్ కు వచ్చిన జవాబు డాక్టర్‌ను ఆలోచనలో పడేసింది. "నేను బ్యాట్ మ్యాన్‌ను కలవాలనుకుంటున్నా" అన్న జవాబు హృదయాంతరాలను తాకింది. అంతే ఆ మరుసటి రోజే డాక్టర్ బ్యాట్ మ్యాన్ గెటప్‌లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరచాడు. బ్యాట్ మ్యాన్ ఫుల్ గెటప్‌లో వచ్చిన డాక్టర్ ఆసుపత్రి వరండాలో నడుచుకుంటూ వచ్చి, రోగి వద్దకు రాగానే ఆప్యాయంగా వంగి, ప్రేమగా లాలిస్తూ హత్తుకునే వీడియో చాలా బావుందంటూ నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. అంతే ఆ డాక్టర్ చర్యకు ఇక లైకుల వరద వందల్లో వచ్చిందంటే నమ్మండి.
ఇక ఈ చిన్న వీడియో క్లిప్ వేలాది మందికి మందికి కంట నీరు తెప్పించింది. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేమని, మన ప్రపంచంలో గొప్ప మనసున్నవారు చాలా మంది ఉన్నారని రుజువు చేస్తున్నట్టు ఈ వీడియో ఉందని.. డాక్టర్‌ను అభినందిస్తున్నారు. మీరెంత మంచి మనసున్న డాక్టరో అంటూ మరో నెటిజన్ ట్వీట్ (netizen tweet) చేసి మెచ్చుకున్నాడు.
ఇళ్లు లేని నిరుపేదలు రోడ్డుపై పడి ఉండటాన్ని ఊరికే చూస్తూ ఉండలేని ఓ యువకుడు బ్యాట్ మ్యాన్ లా వచ్చి వేడి వేడి ఆహారాన్ని అందించి వెళ్లే మరో వీడియో కూడా నెట్ లో వైరల్ గా మారింది. చిలీ (chile) రాజధాని శ్యాంటిగో నగరంలో ఈ యువకుడు ఇలా రోజూ రాత్రిళ్లు వచ్చి పదుల సంఖ్యలో ఉన్న నిరుపేదలకు కడుపు నింపుతున్నట్టు దీన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి వివరించడం విశేషం. కరోనా (corona) మహమ్మారి (pandemic) కారణంగా ఉద్యోగం, ఉపాధి ఊడి అల్లాడుతున్న సామాన్యులకు కనీసం ఒక పూట అయినా కడుపు నింపడమే తన లక్ష్యమంటున్న ఈ యువకుడు నిత్యం రాజధాని వీధుల్లో రాత్రంతా కలియ తిరుగుతూ, ఆకలితో ఉన్నవారి దగ్గరికి స్వయంగా వెళ్లి వేడి వేడి భోజనం ఇస్తాడు. అవసరంలో ఉన్నవారికి ఈ మాత్రం సాయం చేయకపోతే ఎందుకని ఈ యువ బ్యాట్ మ్యాన్ అంటుండడం చాలా మందికి ప్రేరణగా నిలుస్తోంది. కరోనా కోరల్లో చిక్కుకున్న చిలీలో అంతకంతకూ నిరుద్యోగం పెరిగిపోతుండగా ఇలాంటి యవకులు చేస్తున్న వితరణ మానవత్వం ఇంకా బతికుందనే భావన కలిగిస్తోందని ఇక్కడి స్థానికులు పేర్కొంటున్నారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 16, 2020, 8:11 PM IST