Karthika Deepam: బుల్లితెరపై ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతున్న డైలీ సీరియల్ కార్తీక దీపం. రోజుకో ట్విస్ట్ తో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఇప్పటికి వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకొని విజయవంతంగా కొనసాగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే కార్తీకదీపం సీరియల్ లో దాదాపు 3 ఏళ్ళ నుంచి అంటే సీరియల్ 10 ఏళ్ళ నుంచి దూరం ఉన్న కార్తీక్, దీప ఈరోజు ఎపిసోడ్ తో కలిసిపోతారు. నువ్వు నా పెళ్ళాం అంటూ వంటలక్క డాక్టర్ బాబు కలిసిపోతారు.
ఈ ఎపిసోడ్ చుసిన కార్తీకదీపం అభిమానుల అందరి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక డాక్టర్ బాబు, వంటలక్క కలిసిపోయారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్విట్లు, పోస్ట్ లు కూడా హాల్ చల్ చేస్తున్నాయ్. హమ్మయ్య కలిసిపోయారు.. ఇక సీరియల్ కి శుభం కార్డు పడుతుంది అంటూ ట్విట్లు, పోస్టులు చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు మోనిత, సౌందర్య చాలా సంస్కారంతో మాట్లాడుకోగా.. డాక్టర్ బాబు వంటలక్కను ఆస్పత్రికి తీసుకెళ్తాడు.
అక్కడ డాక్టర్.. దీపను చూసి ఈమె ఎవరు? మీ వంట మనిషినా? అని ప్రశ్నిస్తుంది. అప్పుడు తన నిక్ నేమ్ వంటలక్క అని చెప్పా కానీ తాను వండుతుంది అని చెప్పనా అంటూ.. దీప నా భార్య అని చెప్తాడు డాక్టర్ బాబు. ఇక్కడితో సీరియల్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప మందులు వేసుకోకుంటే చెవు పిండి అయిన వేయించండి అంటూ చెప్పిన డాక్టర్ బాబు.. నీ భార్యే ఈరోజు వంట చేసింది అంటూ సౌందర్య చెప్పగానే.. మాలతీ ఏమైంది? నా భార్యతో వంట చేయించడం ఏంటి అంటూ సీరియస్ అవుతాడు డాక్టర్ బాబు.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Premi vishwanth, Telugu daily serial, Vantalakka