Karthika Deepam: 'కార్తీక దీపం'లో ఊహించని ట్విస్ట్.. టెన్షన్లో వంటలక్క అభిమానులు
కార్తీక దీపం
సీరియళ్లనందు కార్తీక దీపం(Karthika Deepam) వేరయా.. అవును నిజమే. ఎందుకంటే ఈ సీరియల్‌కి క్రేజ్ అంతా ఇంతా కాదు. కొన్ని ఇళ్లలో ఈ సీరియల్ వచ్చే సమయంలో రిమోట్ కోసం యుద్ధాలే జరుగుతుంటాయి
Karthika Deepam: సీరియళ్లనందు కార్తీక దీపం వేరయా.. అవును నిజమే. ఎందుకంటే ఈ సీరియల్‌కి క్రేజ్ అంతా ఇంతా కాదు. కొన్ని ఇళ్లలో ఈ సీరియల్ వచ్చే సమయంలో రిమోట్ కోసం యుద్ధాలే జరుగుతుంటాయి. హిందీ సీరియళ్లను సైతం వెనక్కి నెట్టేసిన సీరియల్ ఇది. గత కొన్ని నెలలుగా టాప్ రేటింగ్‌తో దూసుకుపోతున్న వంటలక్క సీరియల్‌కి ఇటు సాధారణ ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులే. స్టార్ హీరో అయినా సరే, హిట్ సినిమా అయినా సరే.. కార్తీక దీపం వచ్చే సమయానికి కాస్త వెనుకబడాల్సిందే. అంతటి క్రేజ్ కలిగిన ఈ సీరియల్ నుంచి అందరూ కోరుకునేది ఏంటంటే డాక్టర్ బాబు, వంటలక్క కలవటం. వీరిద్దరు కలవాలని బయట కొంతమంది పూజలు కూడా చేస్తుంటారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కాగా గత కొన్ని రోజులుగా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సాగుతోన్న ఈ సీరియల్ ఇప్పుడు ఊహించని దశకు వచ్చేసింది. డాక్టర్ బాబుకు అనుమానం మరింత పెరిగేలా మౌనిత ఆజ్యం పోయగా.. డాక్టర్ బాబుకు ఇప్పుడు నిజం తెలిసే సమయం వచ్చింది. బుధవారం నాటి ఎపిసోడ్ ప్రోమోలో ఈ సీన్‌ని ఇవాళ చూపించనున్నారు. హిమను వంటలక్క దగ్గర వదిలేసిన కార్తీక్ అక్కడకు వెళ్లడం.. అక్కడ హిమ పుట్టుక గురించి దీప, తులసికి చెప్పడం డాక్టర్ బాబు వినేశాడు. దీంతో అతడు మరింత షాక్‌కి గురైనట్లు అర్థమవుతోంది. చూస్తుంటే ఈ సీరియల్ ఊహించని దశకు వచ్చేసింది. ఇక ఇప్పటికే ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతూ రాగా.. నెక్ట్స్ కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ ట్విస్ట్‌తో వంటలక్క అభిమానుల్లో మరింత టెన్షన్ మొదలైంది. చూడాలి మరి ట్విస్ట్‌ల కార్తీక దీపం ఎలా తుది దశకు చేరుకుంటుందో.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.