Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఇక అలానే ఈరోజు ట్విస్ట్ అందరిని షాక్‌కి గురిచేసింది. వెయ్యి ఏడో ఏపిసోడ్‌కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబు ఆనంద్ రావుతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. వంటలక్కకు ఒక మంచి జాబ్ ఇప్పిస్తా అని, పిఏను కూడా పెడతా అని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆనంద్ రావు అలా చెప్తున్న సమయంలో వంటలక్కకు ఆరోగ్యం క్షిణించినట్టు చెప్పకుండా దాచిపెడుతాడు. వంటలక్క ఆరోగ్యం క్షిణించినట్టు ఆనంద్ రావు, సౌందర్యకు తెలిస్తే బాధ పడుతారు అని.. ఆ విషయం చెప్పి బాధ పెట్టకూడదు అని వంటలక్క ఆరోగ్య విషయం ఇంట్లో వాళ్ళకు తెలియకూడదు అని జాగ్రత్త పడుతాడు. మరోవైపు అత్త సౌందర్యను వంటలక్క దండిస్తుంది.
నన్ను డాక్టర్ బాబు ఇష్టపడి ఇంటికి తీసుకురావాలి అనుకున్నాను కానీ మీ సౌందర్య కోడలిగా రావాలి అనుకోలేదు.. మీరు ఎందుకు డాక్టర్ బాబుకు అలా చెప్పారు అత్తయ్య అంటూ నిలదీస్తుంది. మరోవైపు డాక్టర్ బాబు కూతుర్లతో సంతోషంగా గడుపుతూ.. అమ్మ మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకునేది అంటూ చెప్తుంది సౌర్య. మీకు అమ్మ కావాలా? నాన్న కావాలా అని అడిగితే మీరు అమ్మే కావాలి అని వెళ్లారు కదా అని డాక్టర్ బాబు పిల్లలను ప్రశ్నిస్తే.. అవును నాన్న.. మమ్మల్ని ఉండమని కానీ వెళ్లొద్దు అని కానీ నువ్వు చెప్పలేదు కదా నాన్న అంటూ ప్రశ్నిస్తారు పిల్లలు మరి రేపటి ఎపిసోడ్లో ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది చూడాలి.
కాగా ఈరోజు డాక్టర్ బాబు చేసిన పనితో వంటలక్క చనిపోతుందా? అందుకే డాక్టర్ బాబు నిజాన్ని దాచాడా ? అంటూ అందులోనే చెందుతున్నారు. మరి వంటలక్క పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika Deepam serial, Nirupam paritala, Premi vishwanth, Telugu daily serial, Vantalakka