Home /News /trending /

Identical Twins: కొంతమంది కవలలే ఎందుకు ఒకేలా ఉంటారో తెలుసా..? వీడిన మిస్టరీ..!

Identical Twins: కొంతమంది కవలలే ఎందుకు ఒకేలా ఉంటారో తెలుసా..? వీడిన మిస్టరీ..!

Identical Twins (PC : Getty Images)

Identical Twins (PC : Getty Images)

Identical Twins: వేర్వేరు రూపాలతో జన్మిస్తే వారిని ‘డైజైగోటిక్ ట్విన్స్’ అని పిలుస్తారు. అయితే ఐడెంటికల్ ట్విన్స్ ఒకేలా ఎందుకు ఉంటారనే విషయం వైద్య శాస్త్రంలో ఓ అంతుబట్టని మిస్టరీగా మిగిలిపోయింది.

  ఒకే తల్లి కడుపులో ఒకే సమయంలో లేదా సెకన్ల తేడాతో పుట్టే పిల్లలను కవలలు అంటారు. ఈ కవలలు మగ బిడ్డలు కావచ్చు లేదా ఆడ పిల్లలు కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఓ మగ బిడ్డ, ఓ ఆడ బిడ్డ కూడా పుట్టొచ్చు. ఈ కవల పిల్లలు చూడ్డానికి ఒకే రకంగా ఉండటంతో పాటు ఒకే రకంగా ప్రవర్తిస్తే వారిని ఐడెంటికల్ ట్విన్స్ (Identical Twins) అంటారు. వేర్వేరు రూపాలతో జన్మిస్తే వారిని ‘డైజైగోటిక్ ట్విన్స్’ అని పిలుస్తారు. అయితే ఐడెంటికల్ ట్విన్స్ ఒకేలా ఎందుకు ఉంటారనే విషయం వైద్య శాస్త్రంలో ఓ అంతుబట్టని మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా ఈ మిస్టరీని నెదర్లాండ్స్ పరిశోధకులు చేధించారు.కొందరు కవలలే ఎందుకు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారనే వైద్య రహస్యాన్ని కనిపెట్టారు ఈ పరిశోధకులు. వారి పరిశోధనతో పుట్టుకతో వచ్చే రుగ్మతల చికిత్సకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పరిశోధకులు తొలిసారిగా ఒకే రకమైన కవలల (identical twins) లో స్థిరమైన డీఎన్ఏ మిథైలేషన్ సిగ్నేచర్ (methylation signature) కనుగొన్నారు. ఇది గర్భధారణ సమయంలో శిశువుల పెరుగుదలను మారుస్తుంది.

  ఫలదీకరణం చెందిన అండం ఒకే జన్యువులను పంచుకుంటూ రెండు పిండాలుగా విడిపోతుంది. దీన్నే జైగోట్(zygote) అంటారు. ఈ జైగోట్ ఏర్పడితే.. ఒకే రకమైన కవలలు పుడతారు. జైగోట్ ప్రారంభంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పిండాలుగా విడిపోతుంది. కుటుంబ సభ్యుల జన్యుపరమైన ప్రభావాల వల్ల వేర్వేరు కవలలు పుడతారని చెప్పవచ్చు. వీరి జీవసంబంధమైన మూలాల గురించి శాస్త్రవేత్తలు తెలుసుకోగలరు. కానీ ఒకేరకమైన కవలలు ఎలా జన్మిస్తారనేది జీవశాస్త్రంలో ఎప్పటినుంచో ఒక పరిష్కరించలేని రహస్యంగా ఉండిపోయింది.

  అయితే నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన తాజా పరిశోధన ఫలితాలు.. ఒకే రకమైన కవలలు జీవితకాల మాలిక్యులర్ సిగ్నేచర్(జన్యువులు, ప్రోటీన్లు, జన్యు వైవిధ్యాలు) కలిగి ఉంటారని.. కాబట్టి చనిపోయిన మోనోజైగోటిక్(monozygotic) కవలపై నిర్ధారణ పరీక్షలు చేయొచ్చని సూచించాయి.

  నెదర్లాండ్స్ ట్విన్ రిజిస్టర్ (VU) ప్రొఫెసర్ డోరెట్ బూమ్స్మా కు జన్యుశాస్త్రం, కవలల అధ్యయనాలలో ఎంతో నైపుణ్యం ఉంది. తాజాగా ఆయన మాట్లాడుతూ "ఇది చాలా పెద్ద ఆవిష్కరణ. ఒకేలాంటి కవలల(identical twins) పుట్టుక, జీవసంబంధ మూలాలు ఎప్పుడూ ఓ మిస్టరీగానే ఉంది. జన్యుశాస్త్రం సున్నా లేదా అత్యల్ప పాత్ర పోషించే కొన్ని లక్షణాలలో ఇదీ ఒకటి. ఎవరికీ అర్థం కాని మానవుల అసాధారణమైన కవలల విషయంలో బయోలాజికల్ సిగ్నేచర్ కనుగొనడం ఇదే మొదటిసారి. ఇది జన్యువులో కాకుండా దాని బాహ్యజన్యువులో కనిపిస్తుంది." అని చెప్పారు.

  * ఐడెంటికల్ ట్విన్స్ మిస్టరీ
  ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 జననాల్లో నలుగురు ఐడెంటికల్ ట్విన్స్ పుడతారని పరిశోధకులు తెలిపారు. కానీ ఇప్పటివరకు కవలలు ఎలా జన్మిస్తారనేది జన్యు సిద్ధత విశ్లేషణలు గానీ పర్యావరణ ప్రభావిత అధ్యయనాలు గానీ కనిపెట్టలేకపోయాయి. డబుల్ ఓవలేషన్(double ovulation).. అంటే రెండు అండాశయాల నుంచి రెండు అండాలు విడుదలైతే వేర్వేరు పోలికలున్న కవలలు పుడతారు. తల్లి తన పేరెంట్స్, కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా పొందే జన్యువులు డబుల్ ఓవలేషన్ లో కీలక పాత్ర పోషిస్తాయి.

  ఇది కూడా చదవండి : చరిత్రలో గొప్ప అందగత్తె క్లియోపాత్రా సౌందర్య రహస్యం ఇదే..! ఆ ఒక్క నూనెతో..

  గర్భధారణ ప్రారంభ దశలలో ఒకే పిండం రెండుగా విడిపోతే ఒకేరకమైన కవలలు పుడతారు. వారి జన్యువుల కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ తెలియరాలేదు. ఐడెంటికల్ కవలల్లోని క్రోమోజోమ్‌లలోని సమాచారం తేడాగా ఉంటుందని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ ఈ వ్యత్యాసాలు డీఎన్ఏ కోడ్‌లో లేవు. అయితే ఎపిజెనోమ్ అనే చిన్న రసాయన గుర్తులలో మార్పులు కనిపించాయి.

  జన్యువులు ఎలా మెరుగుపడతాయి.. అవి ఎంత బలంగా ప్రవర్తిస్తాయి.. అని నిర్ధారించే ఎలిమెంట్స్ ని ఎపిజెనోమ్స్(Epigenomes) అని పిలుస్తారు. డిఎన్ఏ మిథైలేషన్ అనేది శరీరంలోని ప్రతి కణంలో ఆన్, ఆఫ్ అయ్యే జన్యువులను నియంత్రిస్తుంది.

  ఇది కూడా చదవండి : ఇంట్లో చీమలతో చిరాకు వేస్తోందా... ఈ చిట్కాలు వాడితే పరార్..

  పరిశోధకులు నెదర్లాండ్స్, గ్రేట్ బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన కవలలను అధ్యయనం చేశారు. 6,000 కవలల డిఎన్ఏలో 4,00,000 కంటే ఎక్కువ సైట్ల వద్ద మిథైలేషన్ స్థాయిని కొలిశారు. ఒకేరకమైన కవలలలోని డిఎన్ఏలో 834 స్థానాల్లో మిథైలేషన్ స్థాయి భిన్నంగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Trending news, VIRAL NEWS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు