Home /News /trending /

DO YOU KNOW WHY COINS ARE PLACED IN RIVERS AT SHRINES WHAT IS THE USE OF THEM FIND OUT THE FULL DETAILS HERE VB

పుణ్యక్షేత్రాల వద్ద నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా.. వాటి వల్ల ఉపయోగం ఏంటి..! పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

ప్రతాకాత్మక చిత్రం(Image credit : twitter)

ప్రతాకాత్మక చిత్రం(Image credit : twitter)

Coins Dropping in to Holy Rivers: పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు చాలామంది నదుల్లో నాణేలను వేస్తుండటం గమనిస్తుంటాం. అలా వాళ్లు భక్తశ్రద్ధలతో ఎందుకు నీళ్లల్లో నాణేలను విసురుతారో చాలామందికి తెలియదు. దాని వల్ల ఉపయోగం ఉంటుందా.. ఉండదా అనే అవగాహన కూడా ఉండదు. కానీ ఆచారంగా వస్తుంది కాబట్టి నాణేలను గంగలో వేస్తూ ఉంటారు. దానికి సంబంధించి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
    మనం చాలా సందర్బాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. అక్కడ కొన్ని సంఘటనలు అవి ఎందుకు చేస్తారో మనకు అస్సలు అర్థం కావు.. సమాధానం కోసం అడగాలని అనుకుంటాం.. కానీ అడగం. ఇలా దేవుడి గుడి దగ్గర చాలా మంది స్నానాలు చేసి పూజలు చేస్తారు. అక్కడ కొంత మంది గంగలో నాణేలు వేస్తూ ఉంటారు. అలా ఎందుకు గంగలో నాణేలు వేస్తారనే విషయం చాలా మందికి తెలవదు. అంతేకాదు నదులను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ఈ సందర్భంగా నదుల్లో లేదా సరస్సులలో నాణేలను ఎందుకు వేస్తారు.. నదులను ఎందుకు పూజిస్తారు? ఇలా నదుల్లో నాణేలు వేయడానికి గల కారణాలేంటి? దేవుని దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి కచ్చితంగా వేయాలా అనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.  ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే గోదావరి, కృష్ణా ప్రధాన నదులుగా ఉన్నాయి. . గోదారమ్మను దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో కావేరి, తుంగభద్ర, పెన్నా నదులతో పాటు ఇంకా ఎన్నో నదులున్నాయి. ఇక ఉత్తరభారతంలో అయితే ప్రపంచంలోనే పెద్ద నదుల్లో ఒకటైన గంగా నది అనేక రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది.

    ఇదిలా ఉంటే.. ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు బ్రిడ్జి పై నుంచి నదిలోకి కొంత మంది నాణేలను విసురుతూ ఉంటారు. అంతేకాదు నదులను ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ స్నానమాచరించి దర్శనానికి బయలుదేరుతారు. అదే సమయంలో నదిలో దీపాలను వదులుతారు. కొందరు కొబ్బరికాయలు, నాణేలను వేస్తుంటారు. దీనికి గల కారణం ఏంటంటే.. అప్పట్లో రాగి నాణేలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుందని చాలా మంది నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసే వారు. అప్పటి రాజ్యంలో ఉండే వారు ఆ విషయంపై అందరికీ అవగాహన కల్పించారు. ఎందుకంటే రాగి పాత్రలకు, రాగి నాణేలకు నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. నది శుభ్రమవుతుందని.. రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని, దాని వల్ల మనం నీరు తాగేందుకు పనికొస్తుందని అప్పట్లో ఆ పనిని విధిగా చేసేవారు.

    ఎందుకంటే అప్పటి కాలంలో అందరూ నదిలో లభించే నీళ్లనే తాగేవారు. ఇప్పటిమాదిరిగా అప్పట్లో ఫిల్టర్లు లేవు. అందుకే రాగి నాణేలను నీటిలో వేసి నీటిని శుభ్రపరిచేవారు. పూర్వకాలం నుండే ఈ విధంగా నదిలో నాణేలు వేయడం ఒక ఆచారంగా ఉండేది. అందుకే దీని వల్ల ఉపయోగం ఏంటనే విషయం కూడా చాలా మందికి తెలియకుండానే ఆచరంగా వస్తుంది కాదా అని ఫాలో అవుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం రాగి నాణేలన్నీ కనుమరుగు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్న నాణేలని నదిలో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీటి వల్ల నీరు శుభ్రం కాదు. పైగా ఇప్పుడు వాడుతున్న నాణేలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Coins, Holy river, Life Style

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు