కైలీ జెన్నర్ రికార్డును బద్దలు కొట్టిన గుడ్డు.. దాని వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా?

అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల.. కవితకు కాదేదీ అనర్హం అన్నాడో మహాకవి. అచ్చం అలాగే.. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి.. కాదేదీ అనర్హం అంటోంది నేటి జనరేషన్. తాజాగా ఇన్స్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఓ గుడ్డు ఫొటో అదే విషయాన్ని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: January 20, 2019, 2:12 PM IST
కైలీ జెన్నర్ రికార్డును బద్దలు కొట్టిన గుడ్డు.. దాని వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
egg-kylie-jenner
  • Share this:
అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల.. కవితకు కాదేదీ అనర్హం అన్నాడో మహాకవి. అచ్చం అలాగే.. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి.. కాదేదీ అనర్హం అంటోంది నేటి జనరేషన్. తాజాగా ఇన్స్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఓ గుడ్డు ఫొటో అదే విషయాన్ని స్పష్టం చేసింది. సెలబ్రిటీలను మించి లైకులు సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. కొన్ని రోజులకు ముందు ఫేమస్ రియాలిటీ టీవీ స్టార్.. కైలీ జెన్నర్ ఇస్టాగ్రామ్‌లో పెట్టిన తన కూతురు స్టార్మి ఫొటోకు.. ఏకంగా 18 మిలియన్ల లైకులు వచ్చాయి. మొన్నటి వరకూ అదే వరల్డ్ రికార్డు కూడా. అయితే, ఇటీవలే ఇన్స్‌స్టాగ్రామ్‌లో కనిపించిన ఓ గుడ్డు ఫొటో.. ఆ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసేసింది. ఏకంగా 49 మిలియన్ల లైక్స్‌ను సొంతం చేసుకుని కొత్త రికార్డును నెలకొల్పి.. నెటిజన్లను సర్‌ప్రైజ్ చేసింది. జనవరి 4న పోస్టు చేయబడిన ఈ గుడ్డు పిక్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో పాపులరైంది.

world record egg, egg instagram record, egg instagram, egg creates record on instagram, most liked photo in instagram, most liked on insta, కోడిగుడ్డు, కోడిగుడ్డు తినడం వల్ల ప్రయోజనాలు, గుడ్డు తినడం వల్ల ఆరోగ్య లాభాలు, ఆరోగ్య సమాచారం
ప్రతీకాత్మక చిత్రం


మరి, ఈ గుడ్డు ఫొటోను పోస్టు చేసిందెవరు? దీని వెనకున్నదెవరు? అనే యాంగిల్‌లో శోధన చేపట్టిన News18.com, ఆ వ్యక్తిని ఇషాన్ గోయల్‌గా గుర్తించింది. ఇండియాకు చెందిన ఈ 19ఏళ్ల యువకుడు.. కైలీ పెట్టిన ఫొటో కన్నా ఎక్కవ లైకులు గుడ్డు ఫొటోకు వచ్చేలా ప్లాన్ చేశాడు. అయితే అదొక సీక్రెట్ సాస్ అని చెప్పుకొచ్చాడు. ఇషాన్ మంచి మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్.. దాంతో పాటు స్నేహితులు, సెలబ్రిటీస్ నెట్‌వర్క్, ఇతర పరిచయాలు, స్నేహితుల ద్వారా.. ఈ వరల్డ్ రికార్డును సాధించాడు.

అదన్నమాట గుడ్డు పగలగొట్టిన వరల్డ్ రికార్డు వెనుక ఉన్న అసలు సంగతి. ఏదేమైనా ఒక్క గుడ్డు పిక్‌తో కైలీ జెన్నర్‌ లాంటి స్టార్స్ రికార్డును కూడా బ్రేక్ చేయడమంటే నిజంగా గ్రేటే మరి.

 

ఇది కూడా చూడండి:

First published: January 20, 2019, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading