Neem chew stick in America: ఆ వేప పుల్లల ఖరీదు రూ.1,825 అంట.. అమెరికాలో ఈ కామర్స్​ సంస్థ వినూత్న వ్యాపారం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త ప్రోడక్టులు అందుబాటులోకి రావడంతో చాలామంది ఈ వేప పుల్లలను పక్కన పెట్టేశారు. ఆఖరికి గ్రామాలకు కూడా ఈ సంస్కృతి విస్తరించింది. కొత్త కొత్త పేస్టులు దంతాలు శుభ్రం చేసుకోవడానికి వాడుతున్నారు. అయితే విదేశాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఏకంగా వేప పుల్లల (neem chew sticks)ను అమ్మేస్తున్నారు. దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఉత్తమమైనదిగా ప్రచారం చేసి మరీ అమ్మేస్తున్నారు. ఇంతకీ ఈ వేప పుల్లలను ఎంతకి అమ్ముతున్నారో తెలుసా..

  • Share this:
    వేప పుల్లలు (neem chew sticks) తెలుసు కదా.. గ్రామాల్లో ఎక్కువగా పళ్లు తోముకోవడానికి బ్రష్​లా ఉపయోగిస్తారు. వేపలో మంచి ఔషధ గుణం ఉందని అందరికీ తెలిసిందే. అందుకే ఊళ్లల్లో పేస్టులకు బదులుగా వేపపుల్లలను వాడుతారు. నగరాల్లో అయితే ఎక్కువగా ఎవరూ ఉపయోగించరు. అయితే సాంకేతికత పెరిగి కొత్త కొత్త ప్రోడక్టులు అందుబాటులోకి రావడంతో చాలామంది ఈ వేప పుల్లలను పక్కన పెట్టేశారు. ఆఖరికి గ్రామాలకు కూడా ఈ సంస్కృతి విస్తరించింది. కొత్త కొత్త పేస్టులు దంతాలు శుభ్రం చేసుకోవడానికి వాడుతున్నారు. అయితే విదేశాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఏకంగా వేప పుల్లల (neem sticks)ను అమ్మేస్తున్నారు. దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఉత్తమమైనదిగా ప్రచారం చేసి మరీ అమ్మేస్తున్నారు. ఇంతకీ ఈ వేప పుల్లలను ఎంతకి అమ్ముతున్నారో తెలుసా.. అక్షరాల రూ.1825.. ఏంటీ అంత పెట్టి ఎవరు కొంటారు అనుకుంటున్నారా? మరి వేపకు ఉన్న పవర్​ అలాంటిది.. ఇంతకీ అలా ఎవరు అమ్ముతున్నారు తెలుసుకుందాం..

    అమెరికాలో(America)ని ఒక ఇ-కామర్స్(E commerce) కంపెనీ వేప పుల్లలను ఇలా సేంద్రీయ టూత్ బ్రష్‌లుగా విక్రయిస్తోంది. వేప చెట్టు పొలాలు(Neem Tree Farms) అనే సంస్థ వేప పుల్లలను 24.99 డాలర్ల (రూ .1,825.34)కి విక్రయిస్తోంది. చాలా దేశాల్లో ఈ వేప పుల్లలను ఉపయోగిస్తారని తమ సంస్థ వెబ్​సైట్లో పేర్కింది. దంతాలు శుభ్రపరచడానికి, ప్రకాశవంతంగా చేయడానికి ఈ వేప పుల్లను ఉపయోగించొచ్చని  సంస్థ పేర్కొంది. అంతేకాదు ఈ వేప పుల్లలను ఎలా వాడాలో కూడా సదరు సంస్థ వివరిస్తోంది. అంతేకాందు ఆ పుల్లలు దాదాపు 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చని తెలిపింది. రూ.1,825కి ఒక్కో డబ్బాలో 15 నుంచి 25 పుల్లల వరకు వస్తాయని చెప్పింది.  కాగా, ఇలా పుల్లలు అమ్మడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ వేప పుల్లలను ఆన్​లైన్​లో అమ్మారు. ఈ విషయాన్ని 2020లో ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయెంకా తన ట్విటర్​ అకౌంట్​లోనూ పోస్టు చేశాడు. అక్కడి సంస్థలు 15 డాలర్లకు అమెరికాలో వేప పుల్లలు అమ్ముతున్నట్లు తెలిపాడు.



    గతంలోనూ ఈ కామర్స్​ సంస్థ ఫ్లిప్​కార్ట్​లో కూడా వేప పుల్లను ఆన్​లైన్​లో అమ్మారు. వాస్తవానికి 50 వేప పుల్లల ధర రూ.999. కానీ, 70 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.298కే కొనొచ్చని తెలిపింది ఆ సంస్థ. వాటి బరువు 780 గ్రాములు. పురుషులు, మహిళలు ఇద్దరూ వాడొచ్చంట. కొన్న తర్వాత సంవత్సరం పాటు మన్నగలవని తెలిపింది. ఆయుర్వేద ప్రాడక్ట్ అని, చిగుళ్ల నొప్పితో బాధపడేవాళ్లు, బ్రీత్ ఫ్రెష్‌గా ఉండేందుకు వీటిని వాడాలని అప్పట్ల్లో సూచించింది ఆ సంస్థ. చూశారు కదా.. మనం వద్దనుకున్న వేప పుల్లలను అభివృద్ధి చెందిన దేశాల్ల్లోనూ అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇకనైనా ఆధునికి పోకడలకు పోయి మన దగ్గర ఉన్నవనరులను నిర్లక్ష్యం చేయకుండా.. మన సంపదను కాపాడుకుంటే మంచిది.

    ఇది కూడా చదవండి: సముద్రం మధ్యలో ఉండగా మనిషి మీది కొచ్చిన పెద్ద పాము.. వచ్చి ఆ పాము ఏం చేసిందో తెలుసా?
    Published by:Prabhakar Vaddi
    First published: