• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • DO YOU KNOW HOW MANY MEMBERS WAS READY TO TAKE COVID 19 VACCINE INDIA FIT REPORT REVEALS SHOCKING DETAILS HSN GH

Covid-19 Vaccine: కరోనా వ్యాక్సీన్ తీసుకోవడానికి ఎంతమంది సుముఖంగా ఉన్నారో తెలుసా..?

Covid-19 Vaccine: కరోనా వ్యాక్సీన్ తీసుకోవడానికి ఎంతమంది సుముఖంగా ఉన్నారో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

గత డిసెంబరులో చేసిన సర్వేలో దాదాపు 53 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి భయపడుతున్నామని వెల్లడించారు. అయితే ఇటీవల చేసిన తాజా సర్వేలో ఈ భయం కాస్త తగ్గింది. భారత్ లో కోవిషీల్డ్(31 శాతం), కోవాగ్జిన్(18 శాతం) రెండింటిని తీసుకునేందుకు..

  • Share this:
కరోనా వ్యాక్సీన్ అందించే కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కేవలం వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది వంటి కొందరికే వ్యాక్సీన్ అందిస్తున్నా.. టీకాలపై అనుమానంతో వాటిని తీసుకోవడంలో చాలామంది విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్వహించిన ఓ సర్వేలో దాదాపు 23 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదని తేలింది. 16 శాతం మందికి కరోనా టీకాల గురించి సరైన అవగాహన లేదని తెలిపింది. స్మార్ట్ కేర్ ఎనేబుల్డ్ ప్రీవెంటివ్ హెల్త్ కేర్ ప్లాట్ ఫాం జీఓక్యూఐఐ ప్రజలపై కరోనా ప్రభావం, జీవనశైలిపై ఇండియా ఫిట్ రిపోర్టు 2021ను ప్రారంభించింది. ఈ రిపోర్టు ముఖ్యంగా వ్యాక్సిన్ పట్ల ప్రజల అభిప్రాయాన్ని విశదీకరిస్తుంది.

వ్యాక్సిన్ తీసుకునేందుకు సంకోచం..
గత డిసెంబరులో చేసిన సర్వేలో దాదాపు 53 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి భయపడుతున్నామని వెల్లడించారు. అయితే ఇటీవల చేసిన తాజా సర్వేలో ఈ భయం కాస్త తగ్గింది. భారత్ లో కోవిషీల్డ్(31 శాతం), కోవాగ్జిన్(18 శాతం) రెండింటిని తీసుకునేందుకు 61 శాతం మంది సుముఖంగా ఉన్నట్లు తేల్చారు. 23 శాతం మంది ఇప్పటికీ టీకాలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. 16 శాతం మందికి వ్యాక్సిన్ల గురించి అవగాహన లేదు.

మహమ్మారికి మందు ఫిట్ నెస్..
గత ఏడాది లాక్ డౌన్ కారణంగా ప్రజలు సామాజిక దూరం కొనసాగించేందుకు బహిరంగ ప్రదేశాలు, జిమ్ లకు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆంక్షల వల్ల కూడా బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్ వంటివి చేయడం కూడా తగ్గించారు చాలామంది. గతేడాది మార్చి నుంచి మే మధ్యలో చాలామంది రోజువారీ అడుగుల మొత్తాన్ని కూడా తగ్గించేశారు. లాక్ డౌన్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతులు లేకపోవడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే దీని అర్థం వారు పూర్తిగా ఫిట్ నెస్ ని పక్కన పెట్టినట్లుగా కాదని.. ఇంటి పనులు చేయడం, ఇంట్లోనే వ్యాయామం చేయడం వంటివి చేస్తూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నించి ఉంటారని ఈ సర్వే వెల్లడించింది. లాక్ డౌన్ లో చాలామంది హోమ్ వర్కవుట్స్, యోగా చేయడానికి ఆసక్తి చూపించారట. జిమ్ లకు వెళ్లే వారిలో 19 శాతం మంది వ్యాయామం మానేశామని చెప్పగా.. 50 శాతం మంది ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్నామని చెప్పడం విశేషం. ఈ సంఖ్య ప్రస్తుతం మరింతగా పెరుగుతోందట. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం మంచి మార్గంగా చాలామంది భావిస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే వింత కేసు.. భర్త పనిచేసే కంపెనీపై కేసు పెట్టిన భార్య.. మాకు కరోనా రావడానికి మీరే కారణమంటూ..

పండుగలకు హాజరవడం..
కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ పూర్తి స్థాయిలో జరుగుతుండగా భారతీయులు క్రమంగా వారి సాధారణ జీవనం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మూడు నెలల్లో భారతీయులు తమ కార్యకలాపాల్లో రెస్టారెంట్లలో తినడం(27.10 శాతం), కుటుంబ కార్యక్రమానికి హాజరుకావడం, పుట్టినరోజులకు(25.95 శాతం), వివాహాలకు హాజరు కావడం(19.54 శాతం) లాంటివి చేస్తున్నారు. జీఓక్యూఐఐ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, మహమ్మారిని అరికట్టడానికి తీసుకొచ్చిన వ్యాక్సిన్ల పట్ల భారత పౌరులు ఎలా భావించారో అర్థం చేసుకోవడానికి జీఓక్యూఐఐ ఇండియా ఫిట్ రిపోర్టు కోరినట్లు తెలిపారు.
Published by:Hasaan Kandula
First published:

అగ్ర కథనాలు