Home /News /trending /

DO YOU KNOW A NEW BORN BABY GETS PERIODS FIVE DAYS AFTER BIRTH HERE IS INTERESTING NEWS SK

పుట్టిన 5 రోజులకే పీరియడ్స్.. పాపను ఎత్తుకొని ఆస్పత్రికి పరుగెత్తిన తల్లి.. ఏం జరిగిందంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Girl Gets Periods 5 Days After Birth: పుట్టిన ఐదు రోజులకే ఓ అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఎందుకలా జరిగింది? డాక్టర్లు ఏం చెప్పారో తెలుసా..?

    యుక్త వయసు వచ్చిన అమ్మాయి శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. అందులో భాగంగానే వారికి నెలనెలా పీరియడ్స్ (Menstrual cycle) వస్తాయి. రజస్వల అయిన తర్వాతే ఆ మార్పు ఉంటుంది. అంటే ఇంచు మించు 12 ఏళ్ల తర్వతే పీరియడ్స్ వస్తుంటాయి. హార్మోన్స్ బట్టి కొందరి ఆలస్యంగా వస్తే.. కొందరికి ముందుగానే వస్తాయి. కానీ చైనా (China)లో మాత్రం ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పుట్టిన ఐదు రోజులకే ఓ ఆడ శిశువులో పీరియడ్స్ (Girl Gets Periods 5 Days After Birth) కనిపించాయి. నమ్మడానికి కొంత విచిత్రంగా ఉన్నా ఇది నిజం. తన బిడ్డకు రుతుక్రమం రావడంతో ఆమె తల్లి కంగారుపడింది. బిడ్డను వడిలోకి తీసుకొని భయంతో ఆస్పత్రికి పరుగులు పెట్టింది. ఆ తర్వాత ఏం జరిగింది? డాక్టర్లు ఏం చెప్పారు?

    Viral Video: పెళ్లి వేడుకలోనే అలా అడిగితే ఎలా బాబూ.. పెళ్లికూతురి రియాక్షన్ మామూలుగా..

    ఇది 2019లో జరిగిన కథ. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడ్డారు. కానీ పాప పుట్టిన ఐదు రోజులకే జరగరానిది జరిగింది. ఆ పాపకు పీరియడ్స్ (Menstrual Bleeding) వచ్చాయి. తన కూతురి పరిస్థితి చూసి తల్లి వణికిపోయింది. ఇలాంటిది ఎక్కడా చూడలేదు. ఎప్పుడూ వినలేదు. తన కూతురికి ఎందుకిలా జరిగిందబ్బా? ఏదైనా ప్రాణాపాయం ఉందా? అని భయపడుతూ ఆస్పత్రికి పరుగులు పెట్టింది. బాలికకు పరీక్షించిన డాక్టర్లు.. ఏం లేదు? అంతా బాగానే ఉందని చెప్పారు. భయపడాల్సి విషయం ఏమీలేదని ఆ తల్లికి ధైర్యం చెప్పారు. మరి బాలికకు పీరియడ్స్ ఎందుకు వచ్చాయని ఆమె ఆలోచనలో పడింది. అప్పుడు డాక్టర్లు పాప శరీరంలో ఏం జరిగిందో క్షణ్ణంగా వివరించారు. అప్పుడు ఆమె ఊపిరిపీల్చుకుంది.

    Hyderabad Doctors: బాలికకు ఆ నవ్వు పెద్ద శాపంగా మారింది..చివరకు డాక్టర్లు ఏం చేశారో తెలుసా

    ఇంతకి డాక్టర్ ఏం చెప్పారు?
    నియోనాటల్ మెన్‌స్ట్రుయేషన్ ( Neonatal Menstruation)కారణంగా పాపలో పీరియడ్స్ కనిపించాయని డాక్టర్లు తెలిపారు. హంగ్జోలోని ఫస్ట్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వాంగ్ దీని గురించి వివరంగా చెప్పారు. అందరికీ అర్ధమయ్యేలా వివరించారు. తల్లి గర్భం చివరి రోజుల్లో కొన్ని సార్లు ఈస్ట్రోజన్ హార్మోన్ పిండం లోపలికి వెళ్తుందని..ఆ ఈస్ట్రోజన్ శిశువును జననేంద్రియం నుంచి రక్తం రూపంలో బయటకు వెళ్తుందని ఆయన తెలిపారు. దానిని చూసి పీరియడ్స్‌ అని.. తల్లిదండ్రులు తప్పుగా అర్ధం చేసుకుంటారని వివరించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని, అందుకే చాలా మందికి తెలియక భయపడుతారని ఆయన పేర్కొన్నారు.

    Fitness and Alcohol: ఫిట్‌గా ఉన్నవారే ఎక్కువగా తాగుతారట.. ఆ పరిశోధనలో ఏం తేలిందంటే..

    ఒక వారం రోజుల తర్వాత ఈస్ట్రోజన్ పూర్తిగా బయటకువెళ్లిపోతుందని, ఆ తర్వాత సాధారణ స్థితిలోకి వస్తుందని డాక్టర్లు చెప్పారు. ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. అందుకే పుట్టిన ఆడపిల్ల జననేంద్రియం నుంచి రక్తం వస్తే ఆందోళనకు గురికావద్దని తెలిపారు. అప్పుడప్పుడూ బట్టలు..డైపర్‌పైనా రక్తం మరకలు కనిపిస్తాయని.. వాటిని చూసి టెన్షన్ పడవద్దని చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: China, Trending

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు