DO NOT YOU DARE TO JAB ME WOMEN TO VACCINATION TEAM VIDEO GOES VIRAL SSR
Viral Video: వ్యాక్సిన్ వేయడానికి వెళితే బుట్టలో నుంచి పామును బయటకు తీసి.. ఏం చెప్తాంలే.. మీరే చూడండి..
పామును చూపించి బెదిరిస్తున్న మహిళ
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. చాలాచోట్ల ప్రజలే ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వైద్య సిబ్బంది కూడా డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకునే విషయంలో చొరవ చూపిస్తుండటం హర్షించదగిన విషయం.
పుష్కర్: దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. చాలాచోట్ల ప్రజలే ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. వైద్య సిబ్బంది కూడా డోర్ టూ డోర్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ తీసుకునే విషయంలో చొరవ చూపిస్తుండటం హర్షించదగిన విషయం. కానీ.. ఇప్పటికీ కొన్నిచోట్ల వ్యాక్సిన్‌పై కొందరు లేనిపోని అపోహలు, భయాలు ఏర్పరచుకుని కోవిడ్ టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కోవిడ్-19 వ్యాక్సిన్‌పై అవగాహన లేకపోవడం, అవగాహన కల్పించేందుకు ప్రయత్నించినా వినిపించుకునే స్థితిలో కొందరు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. వ్యాక్సిన్ వేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కొందరు, లైంగిక సమస్యలు తలెత్తుతాయని మరికొందరు లేనిపోని అపోహలు పెట్టుకుని ‘వ్యాక్సిన్ మాకొద్దు’ అంటూ బెదిరిపోతున్నారు.
తాజాగా రాజస్థాన్‌లోని పుష్కర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న నాగెలావ్ గ్రామంలో కూడా వైద్య సిబ్బందికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. రాజస్థాన్‌లో ‘డోర్ టూ డోర్ కరోనా వ్యాక్సినేషన్’ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా వైద్యఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ వేసేందుకు నాగెలావ్ గ్రామానికి వెళ్లారు. ఇది ఒక గిరిజన గ్రామం. అక్షరాస్యత శాతం అంతం మాత్రమే. వ్యాక్సిన్‌పై అవగాహన కూడా గ్రామంలో ఎక్కువ మందికి లేదు. గ్రామంలో చాలామంది పాములాట ఆడించుకుంటూ వచ్చిన సొమ్ముతో పొట్టపోసుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వ్యాక్సినేషన్లో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో కొందరు చిన్నారులు, ఓ మహిళ ఉంది. ఆ మహిళకు వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించేందుకు వైద్యఆరోగ్య సిబ్బంది ప్రయత్నించారు. అయితే.. ఎంత చెప్పినా తనకు వ్యాక్సిన్ వద్దంటే వద్దని ఆ మహిళ మొండికేసింది.
ఆమెకు నచ్చజెప్పి వ్యాక్సిన్ ఆవశ్యకతను చెప్పి టీకా ఇచ్చే ప్రయత్నం చేసిన వైద్య సిబ్బందికి ఆ మహిళ ఊహించని షాకిచ్చింది. వెంటనే ఓ అల్లిన బుట్టలో నుంచి నాగు పామును బయటకు తీసింది. తనకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రయత్నిస్తే పాముతో కరిపిస్తానని ఆ మహిళ నానా హంగామా చేసింది. దీంతో.. వైద్య సిబ్బంది భయంతో కంగుతిన్నారు. ఆ బుట్టలో నాగుపాము బుసలు కొడుతూ ఉన్న తీరు చూసి వైద్య సిబ్బందికి పై ప్రాణం పైకే పోయినంత పనయింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆమె కుటుంబం ఒప్పుకోవడం లేదన్న విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు వ్యాక్సిన్ తీసుకోవాలని, వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఆ కుటుంబానికి నచ్చజెప్పారు. తాము కూడా వ్యాక్సిన్ తీసుకుంటామని ఆ మహిళకు వ్యాక్సిన్ పట్ల అవగాహన ఉన్న కొందరు గ్రామస్తులు చెప్పడంతో ఎట్టకేలకు ఆ కుటుంబం వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఈ కుటుంబంతో పాటు మరో 20 మంది గ్రామస్తులు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్య సిబ్బంది తెలిపారు. గతంలో కూడా కొన్ని చోట్ల వ్యాక్సిన్ ఇచ్చేందుకు వెళ్లిన వైద్య సిబ్బందికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
కర్ణాటకలోని యాద్గిరి తాలుకాలోని కెంచగరహళ్ళి గ్రామ ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడి తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వ్యాక్సిన్ తీసుకుంటే జ్వరం, ఇతర దుష్ప్రభావాలు వస్తాయని వీరు ఆందోళన చెందారు. వ్యాక్సిన్ వేయడానికి ఈ గ్రామానికి వెళ్ళిన ఆశావర్కర్లకు, ఇతర అధికారులకు ఊరంతా ఖాళీగా కనిపించింది. అక్కడక్కడ కనిపించిన కొందరు మహిళలను వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా అధికారులు కోరినప్పటికీ వారు నిరాకరించారు. పైగా వ్యాక్సిన్ తీసుకోమని చెబుతున్నా ఎందుకు బలవంతం చేస్తారని ఎదురుతిరిగారు. వ్యాక్సిన్‌పై అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని వైద్య ఆరోగ్య సిబ్బంది చెబుతున్నారు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.