రోడ్లు బాగోలేదని ఇంజినీర్ చేత గుంజీళ్లు తీయించిన ఎమ్మెల్యే

ఓ జూనియర్ ఇంజినీర్‌ను పట్టుకుని ఐదు నిమిషాల్లో వంద గుంజీళ్లు తీయాలని ఆదేశించాడు ఎమ్మెల్యే. చుట్టూ వంద మందికి పైగా జనం చూస్తుంటే, బిక్కచచ్చిపోయాడు ఆ ఇంజినీర్.

news18-telugu
Updated: June 6, 2019, 10:48 PM IST
రోడ్లు బాగోలేదని ఇంజినీర్ చేత గుంజీళ్లు తీయించిన ఎమ్మెల్యే
బీజేడీ ఎమ్మెల్యే మెహర్
  • Share this:
రోడ్లు సరిగా లేవని, దాన్ని పర్యవేక్షించాల్సిన ఇంజినీర్ చేత గుంజీళ్లు తీయించాడో ఎమ్మెల్యే. ఒడిశాలో ఈ ఘటన జరిగింది. ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ ఎమ్మెల్యే సరోజ్ మెహర్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ జూనియర్ ఇంజినీర్‌ను పట్టుకుని ఐదు నిమిషాల్లో వంద గుంజీళ్లు తీయాలని ఆదేశించాడు ఎమ్మెల్యే. చుట్టూ వంద మందికి పైగా జనం చూస్తుంటే, బిక్కచచ్చిపోయిన ఆ ఇంజినీర్ చేసేది లేక గుంజీళ్లు తీయడం మొదలుపెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఓ ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరించడం పెద్ద దుమారానికి దారి తీసింది. అయితే, దీనిపై సదరు ఎమ్మెల్యే వివరణ ఇచ్చాడు. రోడ్ల నిర్మాణం సరిగా ఉండడం లేదని అప్పటికే చాలా మంది ప్రజలు తమకు ఫిర్యాదులు చేశారని, వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్యే మెహర్ చెప్పాడు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చకపోతే ఇంజినీర్ మీద దాడి చేసే అవకాశం కూడా ఉండేదని, అతడి చేత గుంజీళ్లు తీయించి ప్రజల దృష్టిని మళ్లించానని చెప్పాడు. అయితే, తన చర్యల వల్ల పొరపాటు జరిగినట్టు భావిస్తే క్షమించాలని కోరాడు.

First published: June 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>